మెర్సిడెస్ ఏఎమ్‌జి ఎస్63 కూపే విడుదల

మెర్సిడెస్ బెంజ్ విపణిలోకి సరికొత్త మెర్సిడెస్ ఏఎంమ్‌జి ఎస్63 కూపే(C217) కారును లాంచ్ చేసింది. W222 ఎస్-క్లాస్ ఆధారిత మూడు డోర్ల వెర్షన్ ఎస్63 కూపే ప్రారంభ ధర రూ. 2.55 కోట్లు ఎక్స్-షోరూమ్

By Anil Kumar

మెర్సిడెస్ బెంజ్ విపణిలోకి సరికొత్త మెర్సిడెస్ ఏఎంమ్‌జి ఎస్63 కూపే(C217) కారును లాంచ్ చేసింది. W222 ఎస్-క్లాస్ ఆధారిత మూడు డోర్ల వెర్షన్ ఎస్63 కూపే ప్రారంభ ధర రూ. 2.55 కోట్లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

మెర్సిడెస్ ఏఎమ్‌జి ఎస్63

అంతే కాకుండా, మెర్సిడెస్ బెంజ్ ఇటీవల అత్యుత్తమ పనితీరును కనబరిచే ఏఎమ్‌జి ఇ63 ఎస్ పర్ఫామెన్స్ సెడాన్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 1.50 కోట్లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

మెర్సిడెస్ ఏఎమ్‌జి ఎస్63

మెర్సిడెస్ బెంజ్ వారి "సెన్సువల్ ప్యూరిటీ" డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా రూపొందించారు. మెర్సిడెస్ బెంజ్ డిజైన్ హెడ్ గార్డెన్ వ్యాగనర్ ఏఎమ్‌జి లోని స్పోర్టినెస్ మరియు ఎస్-క్లాస్ లోని చక్కదనం మేళవింపుతో ఎస్63 కూపే కారును అభివృద్ది చేశారు.

మెర్సిడెస్ ఏఎమ్‌జి ఎస్63

వర్టికల్ స్లాట్ గ్రిల్, విశాలమైన ఎయిర్ ఇంటేకర్, కార్బన్ లేదా బ్ల్యాక్ మరియు పలు క్రోమ్ సొబగులతో కూడిని ఫ్రంట్ డిజైన్ చూడటానికి అచ్చం ఇతర ఏఎమ్‍‌‌జి మోడళ్లనే పోలి ఉంటుంది. బానెట్ మరియు ఫ్రంట్ ఫెండర్స్ మరింత అట్రాక్టివ్‌గా ఉన్నాయి.

మెర్సిడెస్ ఏఎమ్‌జి ఎస్63

కూపే 3-డోర్ వెర్షన్ కావడంతో సైడ్ ప్రొఫైల్ చాలా పొడవుగా కనిపిస్తోంది. డోర్ మధ్యలో మరియు బాడీ అంచున్న విభిన్నమైన క్యారెక్టర్ లైన్స్ ఉన్నాయి. విండో చుట్టూ మరియు బాడీ చివరంచున్న క్రోమ్ సొబగులను గుర్తించవచ్చు. డిజైన్ పరంగా ఎస్-క్లాస్ చక్కదనం మరియు ఏఎమ్‌జి స్పోర్టినెస్ స్పష్టంగా గుర్తించవచ్చు.

మెర్సిడెస్ ఏఎమ్‌జి ఎస్63

ఏఎమ్‌జి ఎస్63 రియర్ డిజైన్ విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో వస్తున్న ఏఎమ్‌జి మోడళ్ల రియర్ డిజైన్ చాలా చెత్తగా ఉంది. దాదాపు అన్ని కూపే కార్లలో వెనుక వైపున అన్ని డిజైన్ అంశాలు గుండ్రంగా ఉన్నాయి. అయితే, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్, క్వాడ్ ఎగ్జాస్ట్, మరియు బంపర్ మీదున్న ఎయిర్ వెంట్స్ మన దృష్టిని ఆకర్షిస్తాయి.

మెర్సిడెస్ ఏఎమ్‌జి ఎస్63

మెర్సిడెస్ ఏఎమ్‌జి ఎస్63 కూపే లగ్జరీ కారులో నాలుగు వైపులా 20-అంగుళాల పరిమాణంలో ఉన్న 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ తప్పనిసరిగా వచ్చాయి.

మెర్సిడెస్ ఏఎమ్‌జి ఎస్63

ఏఎమ్‌జి ఎస్63 కూపే ఇంటీరియర్ విషయానికి వస్తే మెర్సిడెస్ ఆధునిక టెక్నాలజీ మరియు లగ్జరీ అంశాల జోడింపును గమనించవచ్చు. ఇంస్ట్రుమెంట్ కన్సోల్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం 12.3-అంగుళాల పరిమాణంలో ఉన్న రెండు డిస్ల్పేలు డ్యాష్‌బోర్డులో ఉన్నాయి. ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్‌లో కూడా అచ్చం ఇదే తరహా డ్యాష్‌బోర్డ్ ఉంది.

మెర్సిడెస్ ఏఎమ్‌జి ఎస్63

ఇంటీరియర్‌లోని సీట్లను అత్యంత నాణ్యమైన నప్పా లెథర్‌తో తయారు చేశారు. మరియు పలు రకాల రంగులు, మెటీరియల్ మరియు స్టిచ్చింగ్ ఛాయిస్‌లో ఎంచుకోవచ్చు. ఇంటీరియర్‌లో సుమారుగా 300ఎల్ఇడి లైట్లు మరియు 64 కలర్ ఆప్షన్స్ గల ఆంబియంట్ ఇల్యూమినేషన్ ఉంది.

మెర్సిడెస్ ఏఎమ్‌జి ఎస్63

ఇతర ఫీచర్లు

  • ఆప్షనల్ ప్రీమియం బర్మెస్టర్ సరౌండ్ ఆడియో సిస్టమ్
  • 12-మార్గాల్లో అడ్జెస్ట్ చేసుకునే ఫ్రంట్ సీట్లు
  • డ్యూయల్-జోన్ క్లమైట్ కంట్రోల్
  • హీటెడ్, కోల్డ్ మరియు మసాజింగ్ సీట్లు
  • వెనుక వైపున చిల్లర్ బాక్స్
  • పలు రకాల కస్టమైజేషన్ ఆప్షన్స్
  • మెర్సిడెస్ మి మొబైల్ యాప్ ద్వారా రిమోట్ స్టార్ట్
  • మెర్సిడెస్ ఏఎమ్‌జి ఎస్63

    ఇంటీరియర్ అంత విశాలమైనదేమీ కాదు, కాళ్లను సరిగ్గా ఉంచుకోలేము. వెనుక సీటులో ఓ మోస్తారు లావు ఉన్న వ్యక్తులు మాత్రమే కూర్చోగలరు. కూపే డిజైన్ కావడంతో హెడ్ రూమ్ చాలా వరకు ఇబ్బందికరంగానే ఉంటుంది.

    మెర్సిడెస్ ఏఎమ్‌జి ఎస్63

    సాంకేతికంగా మెర్సిడెస్ ఏఎమ్‌జి ఎస్63 లగ్జరీ కూపే కారులో 4.0-లీటర్ బై-టుర్భో వి8 పెట్రోల్ ఇంజన్ కలదు. 9-స్పీడ్ ఏఎమ్‍‌జి స్పీడ్‌షిఫ్ట్ మల్టీ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా 4మ్యాటిక్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ గుండా పవర్ మరియు టార్క్ అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

    మెర్సిడెస్ ఏఎమ్‌జి ఎస్63

    ఎస్63 కూపే కేవలం 3.5 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 300కిలోమీటర్లుగా ఉంది.

    మెర్సిడెస్ ఏఎమ్‌జి ఎస్63

    లగ్జరీ కార్ల పరిశ్రమలో ఎంతో మంది కస్టమర్ల హృదయాలను దోచుకున్న మెర్సిడెస్ తమ కార్లలో అందించే భద్రత ఫీచర్ల పట్ల అస్సలు రాజీపడదు. ఏఎమ్‌జి ఎస్63 కూపేలో ఉన్న సేఫ్టీ ఫీచర్లు...

    • డిస్ట్రోనిక్ + సెమీ-అటానమస్ మోడ్
    • బ్లైండ్ స్పాట్, లేన్ చేంజ్, స్టీరింగ్ మరియు పార్కింగ్ ఇంకా ఎన్నో...
    • 10 ఎయిర్ బ్యాగులు
    • సరౌండ్ వ్యూవ్ కెమెరా
    • ఆప్షనల్ నైట్ విజన్
    • ప్రి-సేఫ్
    • కార్-టు-ఎక్స్ కమ్యూనికేషన్స్
    • మెర్సిడెస్ ఏఎమ్‌జి ఎస్63

      డ్రైవ్‍‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

      పర్ఫామెన్స్ మరియు లగ్జరీ మధ్య సమతుల్యం కోరుకునే కస్టమర్లకు 2018 మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి ఎస్63 కూపే పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ కారు ఏఎమ్‌జి పర్ఫామెన్స్ లక్షణాలను ఎస్-క్లాస్ లగ్జరీతో కప్పి ఉంచుతోంది.

      ఎస్-క్లాస్ మరియు ఏఎమ్‌జి ఆధారిత ఎస్63 కూపే విపణిలో ఉన్న ఆస్టన్ మార్టిన్ డిబి11 మరియు అప్‌కమింగ్ బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ కూపే వంటి మోడళ్లకు గట్టిపోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Mercedes-AMG S63 Coupe Launched At Rs 2.55 Crore — Combines Performance With Elegance
Story first published: Monday, June 18, 2018, 16:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X