మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు, ఫోటోలు

Written By:

జర్మన్ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ దేశీయ లగ్జరీ కార్ల విపణిలోకి సరికొత్త జిఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. మెర్సిడెస్ జిఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. జిఎల్ఎస్ 400 మరియు 350డి రెండు వేరియంట్ల ధర రూ. 86.90 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్

జిఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్ ఎస్‌యూవీని రెగ్యులర్ జిఎల్ఎస్ ఎస్‌యూవీతో పోల్చితే ఇందులో కాస్మొటిక్ అప్‌డేట్స్ తప్పితే మరే మార్పులు చోటు చేసుకోలేదు. ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో ఉన్న ఫీచర్ల విషయానికి వస్తే, ఇంటిగ్రేటెడ్ బ్లాక్ రింగ్స్ గల ఇంటెలిజెంట్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్, బానెట్ మీద క్రోమ్ ఫిన్స్, బ్లాక్ కలర్ పెయింట్ చేయబడిన 20 అంగుళాల 10-స్పోక్ అల్లాయ్ వీల్స్ మరియు ఎస్‌యూవీ మొత్తం గ్రాండ్ ఎడిషన్ బ్యాడ్జింగ్ కలదు.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్

జిఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్ ఇంటీరియర్ ఫీచర్లలో, నప్పా లెథర్ తొడుగు గల హీటెడ్ 3-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, పడిల్ షిఫ్టర్స్, 12 ఫంక్షన్ కీస్, నప్పా లెథర్ ఫినిషింగ్ గల ఎయిర్ బ్యాగ్ కవర్, సెమీ ఇంటిగ్రేటెడ్ కలర్ మీడియా డిస్ల్పేతో రీడిజైన్ చేయబడిన సరికొత్త ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, వెనుక ప్యాసింజర్ల ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రెండు 7-అంగుళాల పరిమాణం గల హెచ్‌డి డిస్ల్పేలు ఉన్నాయి. ఇవి, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేస్తాయి.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్

జిఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్ విడుదల సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మరియు సిఇఒ రొలాండ్ ఫోల్గర్ మాట్లాడుతూ, ఎస్-క్లాస్ శైలి యొక్క ఎస్‌యూవీని జిఎల్ఎస్‌గా చెప్పుకోవచ్చు. అసమానమైన లగ్జరీ మరియు ఆకట్టుకునే సౌకర్యం, అద్భుతమైన డైనమిక్స్ మరియు అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఇంకా ఎన్నో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు."

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్

అంతే కాకుండా, "ఇండియాలో లగ్జరీ ఎస్‌యూవీలకు డిమాండ్ అధికంగా ఉంది. అద్భుతమైన పాపులారిటీతో జిఎల్ఎస్ ఎస్‌యూవీకి ప్రపంచ వ్యాప్తంగా టాప్ 6 మార్కెట్ అయిన ఇండియాలో పరిచయం అయ్యింది. జిఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్ కస్టమర్లకు అభిరుచికి ఎంతో దగ్గరగా ఉంటుంది. జిఎల్ఎస్ గ్రాండ్ మెర్సిడెస్ ఇండియా మంచి విజయాన్ని సాధించిపెడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు."

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్

సాంకేతికంగా, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్ ఎస్‌యూవీలో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇందులో అవే మునుపటి 3.0-లీటర్ కెపాటిసిటి గల వి6 పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్‌లు ఉన్నాయి. ఇవి, వరసగా 338బిహెచ్‌పి పవర్ మరియు 480ఎన్ఎమ్ టార్క్ మరియు 258బిహెచ్‌పి పవర్ మరియు 620ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త గ్రాండ్ ఎడిషన్ మెర్సిడెస్ జిఎల్ఎస్ స్టాండర్డ్ వేరింయంట్‌తో పోల్చుకుంటే ఎక్ట్సీరియర్ కాస్మొటిక్ అప్‌డేట్స్ మినహాయిస్తే సాంకేతికంగా ఎలాంటి మార్పులకు నోచుకోలేదు. అయినప్పటికీ, స్టాండర్డ్ వెర్షన్ జిఎల్ఎస్ ఎస్‌యూవీ కంటే రూ. 4 లక్షల అధిక ధరతో రూ. 82.90 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తోంది.

ధర మ్యాటర్ కాదు, స్టేటస్ ముఖ్యమనుకునే కస్టమర్లకు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్ అచ్చంగా సరిపోతుంది....

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్

1. రూ. 77 వేల బైకును 14 లక్షల రూపాయల బైకుగా మార్చిన ఘనుడు

2.డీజిల్ రైలింజన్లు అస్సలు ఆఫ్ చేయరు ? ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటాయి ఎందుకో తెలుసా...?

3.క్షణాల్లో డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ లింక్ చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి

4.ప్రేతాత్మలకు నిలయాలుగా మారిన ఇండియన్ రైల్వే స్టేషన్లు

5.వోల్వో బస్సుల్లో ప్రయాణిస్తున్నారా..? అయితే వీటి గురించి తప్పక తెలుసుకోండి

English summary
Read In Telugu: Mercedes-Benz GLS Grand Edition Launched In India; Priced At Rs 86.90 Lakh
Story first published: Thursday, April 5, 2018, 9:50 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark