మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఇంజన్, స్పెసిఫికేషన్స్, ఫీచర్లు మరియు ఫోటోలు

జర్మనీ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ తమ ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్ కారును ఫేస్‌లిఫ్ట్ రూపంలో నేడు (ఫిబ్రవరి 26, 2018) విపణిలోకి విడుదల చేసింది.

By Anil

Recommended Video

Renault Trezor Concept Walkaround Auto Expo 2018 - DriveSpark

జర్మనీ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ తమ ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్ కారును ఫేస్‌లిఫ్ట్ రూపంలో నేడు (ఫిబ్రవరి 26, 2018) విపణిలోకి విడుదల చేసింది. సరికొత్త 2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 1.33 కోట్లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్

మెర్సిడెస్ ఎస్-క్లాస్ భారత్‌లో తయారైన తొలి బిఎస్-VI వెహికల్. 2020 నాటికి అమల్లోకి రానున్న అత్యంత కఠినమైన బిఎస్-VI ఉద్గార నియాలను 2018 మెర్సిడెస్ ఎస్-క్లాస్ పాటిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్

2018 మెర్సిడెస్ ఎస్-క్లాస్ వేరియంట్లు మరియు ధరలు

మెర్సిడెస్ ఎస్-క్లాస్ రెండు విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి, ఎస్ 350డి మరియు ఎస్ 450. ఎస్-క్లాస్ లైనప్‌లో ఎస్ 350డి ఏకైక డీజల్ వేరియంట్ మరియు ఎస్ 450 పెట్రోల్ వెర్షన్‌లో లభ్యమవుతోంది.

Variant Price
S 350 d Rs 1.33 crore
S 450 Rs 1.37 crore
మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్

2018 మెర్సిడెస్ ఎస్-క్లాస్ స్పెసిఫికేషన్స్

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2018 మెర్సిడెస్ ఎస్-క్లాస్ సరికొత్త పెట్రోల్ మరియు టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది. ఎస్-క్లాస్ ఎస్ 350డి వేరియంట్లోని సరికొత్త టుర్భోఛార్జ్‌డ్ 3.0-లీటర్ల కెపాసిటి గల ఆరు సిలిండర్ల ఇన్-లైన్ ఇంజన్ గరిష్టంగా 282బిహెచ్‌పి పవర్ మరియు 600న్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్

సరికొత్త మెర్సిడెస్ ఎస్-క్లాస్ ఎస్ 350డి కేవలం 6.0-సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 250కిలోమీటర్లుగా ఉంది. మెర్సిడెస్ కథనం మేరకు, ఎస్ 350డి భారతదేశపు తొలి బిఎస్-VI ఉద్గార నియమాలను పాటించే కారు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్

2018 మెర్సిడెస్ ఎస్-క్లాస్ లోని ఎస్ 450 వేరియంట్లోని 3.0-లీటర్ల కెపాసిటి గల ఇన్-లైన్ ఆరు సిలిండర్ల ట్విన్-టుర్భో‌ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ 362బిహెచ్‌పి పవర్ మరియు 500ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్

9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల మెర్సిడెస్ ఎస్-క్లాస్ ఎస్ 450 కేవలం 5.1 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని ఎలక్ట్రికల్‌గా 250కిలోమీటర్ల వరకు లాక్ చేశారు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్

2018 మెర్సిడెస్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మెర్సిడెస్ ఎస్-క్లాస్ ఫ్రంట్ డిజైన్‌లో బ్లాక్ ఫినిషింగ్‌లో పొడవాటి బార్స్ గల రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, గ్రిల్ వెనుక వైపున క్రోమ్ ఫినిషింగ్ గల ట్రిపుల్ హారిజంటల్ స్లాట్స్ ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్

ఇతర మార్పుల్లో సరికొత్త పగటి పూట వెలిగే ట్రిపుల్ ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న మల్టీ-బీమ్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్ మెర్సిడెస్ బెంజ్ సిగ్నేచర్ ఫ్రంట్ గ్రి‌ల్‌‌కు ఇరువైపులా ఉన్నాయి. పెద్ద పరిమాణంలో ఉన్న ఎయిర్ ఇంటేకర్‌తో పాటు స్పోర్టివ్ ఫీల్ కలిగించే రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ వంటివి ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్

ఎస్-క్లాస్ రియర్ డిజైన్‌లో అధునాతన టెయిల్ ల్యాంప్ క్లస్టర్ మరియు స్పోర్టివ్ బంపర్ ఉన్నాయి. అంతే కాకుండా మెర్సిడెస్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్‌లో 18-అంగుళాల పరిమాణం గల 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ వచ్చాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్

మెర్సిడెస్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో అధికంగా మార్పులు జరిగాయి. మునుపటి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ స్థానంలో 12.3-అంగుళాల పరిమాణంలో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పే కలదు. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. దీనికి 13-స్పీకర్లు గల 590W బర్మెస్టర్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ కనెక్టివిటి ఉంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్

ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్‌లోని ఇతర ఇంటీరియర్ ఫీచర్లలో అబ్‌స్ట్రక్షన్ సెన్సార్ గల సరికొత్త ప్యానొరమిక్ సన్‌రూఫ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కంట్రోల్ చేసే స్టీరింగ్ వీల్ మీద న్యూ టచ్ ప్యానల్స్, 64 విభిన్న రంగుల్లో వెలిగే ఇంటీరియర్ ఆంబియంట్ లైటింగ్, ఇంటీరియర్ కోసం 6 రకాలుగా వెదజల్లే సువాసనలు, గాలి నాణ్యతను పెంచే క్లైమేట్ కంట్రోల్ మరియు ఫ్రంట్ అండ్ రియర్ ఆర్మ్ రెస్ట్ వద్ద వైర్ లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్

2018 మెర్సిడెస్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్‌లోని సేఫ్టీ ఫీచర్లు

సరికొత్త మెర్సిడెస్ ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్‌లో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ట్రాక్షన్ కంట్రోల్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా, ఇందులో రాడార్ సూచించే సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వాటిలో, యాక్టివ్ డిస్టెస్ట్ అసిస్ట్ ఒకటి. ఇది మెర్సిడెస్ 210 కిలోమీటర్ల వేగంలో ఉన్నపుడు దీనికి దగ్గరా పరిమిత దూరంలోకి ఏదైనా ఇతర కారు వస్తే ఆటోమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్

అంతే కాకుండా, యాక్టివ్ స్టీరింగ్ అసిస్ట్ ఉంది, ఇది ఎలాంటి మలుపు లేకుండా పొడవుగా ఉన్న రోడ్ల మీద వెళుతున్నపుడు లేన్ మారకుండా వెళ్లడానికి సహాయపడుతుంది. దీనికి తోడు యాక్టివ్ బ్రేక్ అసిస్ట్ మరియు బ్లైండ్ స్పాట్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అద్వితీయమైన లగ్జరీ ఫీచర్లు మరియు టెక్నాలజీని కలిగి ఉండే ఎస్-క్లాస్ వారసత్వాన్ని ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ యథావిధిగా తీసుకొచ్చింది. మెర్సిడెస్ అభిమానులను ఆశ్చర్యపరిచే ట్విన్ డిస్ల్పే సెటప్, విపరీతమైన సేఫ్టీ ఫీచర్లు, రాడార్ గైడెడ్ సేఫ్టీ ఆప్షన్స్ ఇంకా ఎన్నో విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇండియన్ రోడ్ల మీద లగ్జరీ మీద దూసుకెళ్లాలనుకునే ఔత్సాహికులకు మెర్సిడెస్ ఎస్-క్లాస్ బెస్ట్ ఛాయిస్.

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Mercedes S-Class Facelift Launched In India; Prices Start At Rs 1.33 Crore
Story first published: Monday, February 26, 2018, 16:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X