TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
కొడుకుని పోగొట్టుకున్న ఈ తండ్రి చేస్తున్న పనిని అందరూ అభినందించాల్సిందే!!
ముంబాయ్‌కి చెందిన దాదారావ్ బిల్‌హోర్ మూడేళ్ల క్రితం రోడ్డు మీదున్న గొయ్యి కారణంగా 16 ఏళ్ల కుమారున్ని కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరకీ రాకూడదనే ఉద్దేశ్యంతో ముంబాయ్ నగర వ్యాప్తంగా ఉన్న రోడ్ల మీ సుమారుగా 556 గుంతలను పూడ్చాడు.
జూలై 28, 2015 వ రోజున దాదారావు కుమారుడు ప్రకాశ్, ముంబాయ్‌లోని జోగేశ్వర్-విక్రోలీ లింక్ రోడ్డులో వర్షం నీటితో నిండిపోయి కనబడకుండా ఉన్న గొయ్యి మీదుగా వెళ్లడంతో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు.
రోడ్డు మీదున్న గొయ్యి తన కుమారుడిని పొట్టనబెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితి మరే కుటుంబానికి రాకూడదనే ఉద్దేశ్యంతో పాట్‌హోల్స్ ద్వారా జరిగే ప్రమాదాలను నివారించేందుకు రోడ్డు మీద ఉన్న గుంతలను పూడ్చేందుకు పూనుకొన్నాడు.
దాదారావు బిల్‌హోల్ మీడియాతో మాట్లాడుతూ, "నా కొడుకు విషయంలో జరిగిన ఈ సంఘటన మరెవ్వరికీ జరగకూడదు, ఇండియాలో గుంతలు లేని రహదారులుగా మార్చేంత వరకు పనిచేస్తూనే ఉంటాను. కనీసం దేశవ్యాప్తంగా ఒక లక్ష మంది రోడ్డు మీద ఉన్న గుంతలను పూడ్చితే పాట్‌హాల్స్ ద్వారా జరిగే ప్రమాదాలు ఒక్కటి కూడా ఉండవని పేర్కొన్నాడు."
నగర ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రహదారులను బాగు చేస్తున్నపుడు, బిృహన్ ముంబాయ్ మున్సిపల్ కార్పోరేషన్ మరియు ముంబాయ్ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ మరియు ఇతర అధికారులు కళ్లు తెరివాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంభందిత అధికారులు ప్రజలతో కలిసి పనిచేసి సమస్యను పరిష్కారించాలని దాదారావు చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన మొదట్లో ముంబాయ్ నగర వ్యాప్తంగా ఆరు మంది కేవలం రోడ్డు మీద ఉన్న గుంతల కారణంగానే మరణించారు. రాష్ట్రంలో మరియు నగరంలో రోడ్డు మీద గుంతల వల్ల ప్రజలు ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన సభ్యులు నిరసన తెలియజేశారు.
1. గతుకులు రోడ్లకు రోజుకు 10 మంది మృతి
2. మరో నిండు ప్రాణాన్ని బలిగొన్న అధికారుల నిర్లక్ష్యం - వీడియో
3. ఒక్కసారి ఈ వీడియో చూడండి హెల్మెట్ విలువేంటో తెలుస్తుంది!
4. అమ్మకానికి ఇండియన్ ఆర్మీ ఉపయోగించిన మారుతి జిప్సీ వాహనాలు
5.పార్కింగ్ చేసిన కారులో మద్యం సేవిస్తూ పోలీసులకు దొరికిపోతే..?