హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

భారతదేశపు రెండవ అతి పెద్ద దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తమ 2018 క్రెటా ఎస్‌యూవీని ఈ ఏడాది మే నెలలో లాంచ్ చేయడానికి సిద్దమైంది.

By Anil Kumar

భారతదేశపు రెండవ అతి పెద్ద దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తమ 2018 క్రెటా ఎస్‌యూవీని ఈ ఏడాది మే నెలలో లాంచ్ చేయడానికి సిద్దమైంది. తాజాగా అందిన సమాచారం మేరకు, హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎస్‌యూవీ అతి త్వరలో ఇండియన్ రోడ్లను చేరనుంది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

2018 హ్యుందాయ్ క్రెటా ఇప్పుటికే పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షించబడింది. ప్రస్తుతం క్రెటా వెర్షన్‌లో ఉన్న అవే 1.6-లీటర్ పెట్రోల్, 1.4-డీజల్ మరియు 1.6-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్లు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో రానున్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

వీటిలో పెట్రోల్ ఇంజన్ 121బిహెచ్‌పి పవర్ మరియు 154ఎన్ఎమ్ టార్క్, 1.4-లీటర్ డీజల్ ఇంజన్ 89బిహెచ్‌పి పవర్ మరియు 224ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా 1.6-లీటర్ డీజల్ ఇంజన్ 126బిహెచ్‌పి పవర్ మరియు 256ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Recommended Video

Mahindra Rexton Quick Look; Specs, Interior And Exterior - DriveSpark
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

మూడు ఇంజన్ వేరియంట్లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తున్నాయి. అదనంగా పెట్రోల్ ఇంజన్ మరియు 1.6-లీటర్ డీజల్ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యమవుతున్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ హ్యుందాయ్ క్రెటా ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ స్టైలింగ్‌తో పాటు ఫీచర్ల పరంగా భారీ మార్పులకు గురవుతోంది. సరికొత్త హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు గల అధునాతన ఫ్రంట్ బంపర్ మరియు రియర్ డిజైన్‍‌లో రీడిజైన్ చేయబడిన టెయిల్ లైట్లు మరియు నూతన బంపర్ వంటివి రానున్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

2018 హ్యుందాయ్ క్రెటా ఇంటీరియర్‌లో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్‌ కార్‌ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయగల సరికొత్త 8-అంగుళాల పరిమాణం గల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆకర్షణీయమైన అధునాతన సెంటర్ కన్సోల్ వంటి అప్‌డేట్స్ తప్పనిసరిగా రాబోతనున్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

సరికొత్త 2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో సన్‌రూఫ్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ వంటి అదనపు ఫీచర్లు రానున్నాయి. క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా రానున్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీకి ఇండియన్ మార్కెట్లో ఇప్పటి వరకు ఖచ్చితమైన పోటీలేదు. సేల్స్ పరంగా కూడా క్రెటా మంచి ఫలితాలు సాధిస్తోంది. ఇప్పుడు భారీ అప్‌డేట్స్‌తో రీలాంచ్ కానున్న నేపథ్యంలో క్రెటా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌కు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరిన్ని తాజా ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్‌ తెలుగుతో కలిసి ఉండండి.

Source: MotorOctane

More from DriveSpark

Article Published On: Wednesday, March 21, 2018, 10:16 [IST]
English summary
Read In Telugu: New Hyundai Creta 2018 Launch Date: Expected Price, Specifications & Key Features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+