విపణిలోకి 7-సీటర్ మారుతి సుజుకి సోలియో
మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్ కోసం వ్యాగన్ఆర్ ఆధారిత సరికొత్త 7-సీటర్ సోలియో ఎమ్‌పీవీని ఖరారు చేసింది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, ప్రొడక్షన్ దశకు చేరుకున్న ఏడు మంది ప్రయాణించే వ్యాగన్ఆర్ వాహనాన్న
మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్ కోసం వ్యాగన్ఆర్ ఆధారిత సరికొత్త 7-సీటర్ సోలియో ఎమ్‌పీవీని ఖరారు చేసింది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, ప్రొడక్షన్ దశకు చేరుకున్న ఏడు మంది ప్రయాణించే వ్యాగన్ఆర్ వాహనాన్ని సెప్టెంబరు 2018 నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

వ్యాగన్ఆర్ ఆధారిత సోలియో సబ్-4 మీటర్ మినీ ఎమ్‌పీవీ. ఇందులో 5+2 సీటింగ్ సామర్థ్యం ఉంది. 2012లో ఆటో ఎక్స్ పో ఈవెంట్ జరిగే సమయంలో మారుతి సుజుకి ఈ సోలియో మినీ ఎమ్‌పీవీని ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది. ఇప్పుడు అదే మోడల్ తెర మీదకు వచ్చింది.

సోలియో రియర్ మరియు ఫ్రంట్ డిజైన్ ప్రస్తుతం ఉన్న మోడల్‌నే పోలి ఉంటుంది. అంతే కాకుండా, ఇందులో ఎలక్ట్రానిక్ స్లైడింగ్ డోర్లు కూడా రానున్నాయి. మారుతి సోలియో పూర్తి స్థాయిలో విపణిలోకి లాంచ్ అయితే మారుతి ఎర్టిగా క్రింది స్థానాన్ని భర్తీ చేసి, డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పీవీకి గట్టి పోటీనివ్వనుంది.

వ్యాగన్ఆర్ ఆధారిత సోలియో ఎమ్‌పీవీ ఇప్పటికే అంతర్జాతీయంగా పలు మార్కెట్లలో అందుబాటులో ఉంది. 7-సీటర్ సోలియో ఎమ్‌పీవీ 1.2-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తోంది. 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 90బిహెచ్‌పి పవర్ మరియు 118ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
Recommended Video


సరికొత్త 7-సీటర్ సోలియో ఎమ్‌పీవీని మారుతి సుజుకి పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేస్తే, అంతర్జాతీయ విపణిలో సోలియో లభించే అవే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో లభ్యం కానుంది. మారుతి కూడా వచ్చే సెప్టెంబర్ 2018 నాటికి విడుదల చేయడానికి ఉన్న అవకాశాలను అంచనా వేస్తోంది.

పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో పరిచయమయ్యే మారుతి సోలియో తొలు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో విడుదలయ్యి, తరువాత కాస్త ఆలస్యంగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

కస్టమర్లు ఎంచుకోవడానికి పలు విభిన్న వేరియంట్లలో విడుదలయ్యే 7-సీటర్ మారుతి సోలియో ఎమ్‌పీవీ ఎక్స్-షోరూమ్ ధరల శ్రేణి రూ. 4.5 లక్షల నుండి రూ. 6.5 లక్షల మధ్య ఉండవచ్చు.

Source: Team-BHP


Click it and Unblock the Notifications








