జెనీవా కోసం సరికొత్త ఆడి ఏ6 రివీల్

జర్మనీకి చెందిన దిగ్గజ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడి ఎనిమిదవ తరానికి చెందిన ఏ6 లగ్జరీ సెడాన్ కారును ఆవిష్కరించింది. కొత్త తరం ఆడి ఏ6 అతి త్వరలో ప్రారంభం కానున్న 2018 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించన

By Anil Kumar

Recommended Video

2018 Audi Q5 Launched In India; Prices Start At Rs 53.25 Lakh

జర్మనీకి చెందిన దిగ్గజ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడి ఎనిమిదవ తరానికి చెందిన ఏ6 లగ్జరీ సెడాన్ కారును ఆవిష్కరించింది. కొత్త తరం ఆడి ఏ6 అతి త్వరలో ప్రారంభం కానున్న 2018 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించనుంది.

డిజైన్, ఎక్ట్సీరియర్, ఇంటీరియర్, మరియు టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులతో వస్తున్న సరికొత్త ఆడి ఏ6 గురించి మరిన్ని వివరాలు మరియు ఫోటోలు ఇవాళ్టి కథనంలో...

సరికొత్త ఆడి ఏ6 లగ్జరీ సెడాన్ ఆవిష్కరణ

డిజైన్ పరంగా సరికొత్త ఆడి ఏ6 చూడటానికి ఏ8 మరియు ఏ7 స్పోర్ట్స్ బ్యాక్ కార్ల తరహా స్పోర్టివ్ మరియు స్ట్రైకింగ్ స్టైల్లో ఉంటుంది. ఏ6 ఫ్రంట్ డిజైన్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న సింగల్ ఫ్రేమ్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న పలుచటి పదునైన హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి.

సరికొత్త ఆడి ఏ6 లగ్జరీ సెడాన్ ఆవిష్కరణ

ఆడి ఏ6 సైడ్ ప్రొఫైల్లో క్లీన్‌గా ఉన్న క్యారెక్టర్ లైన్స్ మరియు సి-పిల్లర్ వద్ద ముగిసే రూఫ్‌లైన్ ఉన్నాయి. రియర్ డిజైన్‌లో అత్యాధునిక ఎల్ఇడి ల్యాంప్ క్లస్టర్, ఒక్కో టెయిల్ లైట్లో నిలువుగా ఉన్న 9 గీతలు ఉన్నాయి. రెండు లైట్లను కలుపుతూ మధ్యలో క్రోమ్ పట్టీ కలదు.

సరికొత్త ఆడి ఏ6 లగ్జరీ సెడాన్ ఆవిష్కరణ

ఆడి ఏ6 ఇంటీరియర్‌లో బ్లాక్-ప్యానల్ డిజైన్ థీమ్ ఉంది. సెంటర్ కన్సోల్ మీద 8.6-అంగుళాల పరిమాణం గల ఎమ్ఎమ్ఐ టచ్ డిస్ల్పే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మనుపటి ఏ6 మోడల్‌తో పోల్చుకుంటే క్యాబిన్‌లో విశాలమైన లెగ్ రూమ్ మరియు హెడ్ రూమ్ స్పేస్ కలదు.

సరికొత్త ఆడి ఏ6 లగ్జరీ సెడాన్ ఆవిష్కరణ

సరికొత్త ఆడి ఏ6 కారులో బెల్ట్ ఆల్టర్నేటర్ స్టార్టర్ మరియు లిథియం-అయాన్ బ్యాటరీ జోడింపుతో ఉన్న మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని పరిచయం చేసే అవకాశం ఉంది. నూతన ఏ6 రెండు ఇంజన్ వేరియంట్లలో రానుంది. అవి, 3-లీటర్ వి6 పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు.

సరికొత్త ఆడి ఏ6 లగ్జరీ సెడాన్ ఆవిష్కరణ

సాంకేతికంగా ఆడి ఏ6లో ఉన్న 3-లీటర్ వి6 టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 335బిహెచ్‌పి పవర్ మరియు 500ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా ఇందులోని 3-లీటర్ డీజల్ ఇంజన్ 282బిహెచ్‌పి పవర్ మరియు 620ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

సరికొత్త ఆడి ఏ6 లగ్జరీ సెడాన్ ఆవిష్కరణ

రెండు ఇంజన్ ఆప్షన్లలో రానున్న ఆడి ఏ6 7-స్పీడ్ ఆటోమేటిక్ ఎస్ ట్రోనిక్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా మరియు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రిట్రోనిక్ గేర్‌బాక్స్ ఆప్షనల్‌గా లభించనుంది. ఆడి ఏ6 కేవలం 5.1 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిమీల వేగాన్నిఅందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 250కిమీలుగా ఉంది.

సరికొత్త ఆడి ఏ6 లగ్జరీ సెడాన్ ఆవిష్కరణ

ఇందులో నాలుగు రకాల సస్పెన్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. స్టాండర్ట్,స్పోర్ట్, ఆడాప్టివ్ డ్యాంపర్ కంట్రోల్ ఉన్నాయి. అదనంగా ఫుల్లీ ఆడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్ ఆప్షనల్ ఫీచర్‌గా లభిస్తోంది. ఏ6లో అధునాతన 21-అంగుళాల వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ వీల్స్‌కు అల్యూమినయం ఫిక్స్‌డ్ బ్రేక్ కాలిపర్స్ ఉన్నాయి.

సరికొత్త ఆడి ఏ6 లగ్జరీ సెడాన్ ఆవిష్కరణ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆడి ఈ కొత్త తరం ఏ6 లగ్జరీ సెడాన్ కారులో డిజైన్, ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ మరియు ఫీచర్లతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించి ఒక కొత్త రూపంలో తీర్చిందిద్దింది. అతి త్వరలో జరగబోయే 2018 జెనీవా మోటార్ షో ప్రజా సందర్శనలో ఆడి ఏ6 కొలువుదీరనుంది.

2019 ప్రారంభం నాటికి ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న సరికొత్త ఆడి ఏ6 విపణిలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ వంటి లగ్జరీ సెడాన్ కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

More from DriveSpark

Article Published On: Sunday, March 4, 2018, 9:00 [IST]
English summary
Read In Telugu: New Audi A6 Revealed Ahead Of Geneva Debut; Specifications, Features & Images
Read more on: #audi #ఆడి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+