2018 ఆడి ఆర్ఎస్5 కూపే విడుదల: ధర రూ. 1.10 కోట్లు

Written By:

2018 ఆడి ఆర్ఎస్5 కూపే ఇండియన్ లగ్జరీ కార్ల మార్కెట్లోకి విడుదలయ్యింది. సరికొత్త 2018 ఆడి ఆర్ఎస్5 కూపే ప్రారంభ ధర రూ. 1,10,65,000 లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఆడి తమ ఏ5 మరియు ఎస్5 కార్ల జోడింపుతో ఆర్ఎస్5 కూపేను నిర్మించింది. ఈ ఏడాది ఆడి ఇండియా నుండి విడుదలైన రెండవ మోడల్ ఆడి ఆర్ఎస్5 కూపే.

2018 ఆడి ఆర్ఎస్5 కూపే విడుదల

2018 ఆడి ఆర్ఎస్5 కూపే కారును నూతన ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు. దీంతో కొలతల పరంగా మునుపటి వెర్షన్‌తో పోల్చితే పెద్దదిగా ఉంటుంది. ఆప్షనల్ కార్బన్ ఫైబర్ రూఫ్ జోడించడంతో 2018 ఆడి ఆర్ఎస్5 కూపే బరువు రెగ్యులర్ మోడల్ కంటే 60కిలోలు వరకు తగ్గుతుంది.

2018 ఆడి ఆర్ఎస్5 కూపే విడుదల

డిజైన్ విషయానికి వస్తే, 2018 ఆడి ఆర్ఎస్5 కూపే ఆడి ఏ5 మరియు ఎస్5 డిజైన్ లక్షణాలను కలిగి ఉంది. సరికొత్త 2018 ఆడి ఆర్ఎస్5 కూపే కారులో స్పోర్టివ్ మరియు అగ్రెసివ్ బంపర్లు, ఎయిర్ ఇంటేకర్లు, పెద్ద పరిమాణంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్, క్వాట్రో బ్లిస్టర్స్, మ్యాట్రిక్స్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ మరియు 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి అప్‌డేటెడ్ ఫీచర్లు ఉన్నాయి.

2018 ఆడి ఆర్ఎస్5 కూపే విడుదల

సాంకేతికంగా 2018 ఆడి ఆర్ఎస్5 కూపే కారులో తక్కువ సామర్థ్యం ఉన్న 2.9-లీటర్ టిఎఫ్ఎస్ఐ వి6 ట్విన్-టుర్బోఛార్జ్‌డ్ ఇంజన్ వి8 ఇంజన్ స్థానాన్ని భర్తీ చేసింది. వి6 ఇంజన్ గరిష్టంగా 444బిహెచ్‌పి పవర్ మరియు 600ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్పోర్టివ్ మరియు డైనమిక్ డ్రైవింగ్ కోసం ప్రత్యేకంగా ట్యూనింగ్ చేసిన 8-స్పీడ్ టిప్‌ట్రోనిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

2018 ఆడి ఆర్ఎస్5 కూపే విడుదల

2018 ఆడి ఆర్ఎస్5 కూపే కేవలం 3.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు ఎలక్ట్రికల్‌గా దీనిని గరిష్ట వేగాన్ని గంటకు 250కిలోమీటర్లకు లిమిట్ చేశారు. ఏదేమైనప్పటికీ, ఆర్ డైనమిక్ ప్యాకేజి ద్వారా దీని గరిష్ట వేగాన్ని గంటకు 280కిమీలకు పెంచుకోవచ్చు. ఆడి కథనం మేరకు, 2.9-లీటర్ పెట్రోల్ ఇంజన్ లీటరుకు 10.8కిమీల మైలేజ్‌నిస్తుంది.

2018 ఆడి ఆర్ఎస్5 కూపే విడుదల

2018 ఆడి ఆర్ఎస్5 కూపే ఇంటీరియర్‌లో ఫ్రంట్ సీట్లు మరియు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంది. ఆర్ఎస్5 కూపేలో ఉన్న ఇతర ఫీచర్లయిన ఆర్ఎస్ స్క్రీన్ గల ఆడి వర్చువల్ కాక్‌పిట్, అప్‌డేటెడ్ ఎమ్ఎమ్ఐ యూనిట్ మరియు ఆడి స్మార్ట్ ఫోన్ ఇంటర్‌ఫేస్ వంటివి ఉన్నాయి. ఇంటీరియర్ మొత్తం అల్కంటారా ఫినిషింగ్ ఉన్న అప్‌హోల్‌స్ట్రే మరియు అల్యూమినియం ఫినిషింగ్ గల పెడల్స్ ఉన్నాయి.

2018 ఆడి ఆర్ఎస్5 కూపే విడుదల

సేఫ్టీ పరంగా సరికొత్త 2018 ఆడి ఆర్ఎస్5 లగ్జరీ కూపే కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, ట్రాక్షన్ కంట్రోల్, టార్క్ వెక్టారింగ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, రియర్ వ్యూవ్ కెమెరా మరియు పార్కింగ్ సిస్టమ్ ప్లస్ ఆధారిత పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2018 ఆడి ఆర్ఎస్5 కూపే విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెండవ తరం ఆడి ఆర్ఎస్5 లగ్జరీ కూపే కారును మునుపటి తరం ఆర్ఎస్5 తో పోల్చుకుంటే డిజైన్ పరంగా ఓ మెస్తారు మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే, కొత్త ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించి, కొత్త ఇంజన్ అందివ్వడం జరిగింది. దీంతో 4-సీటర్ లగ్జరీ కూపే పనితీరు మరింత మెరుగుపడింది.

2018 ఆడి ఆర్ఎస్5 కూపే విపణిలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4 లగ్జరీ కారుకు గట్టి పోటీనిస్తుంది.

2018 ఆడి ఆర్ఎస్5 కూపే విడుదల

1. త్వరపడండి కంపాస్‌లోని ఆ ఒక్క వేరియంట్ మీద ఒకటిన్నర లక్ష డిస్కౌంట్

2.2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ: 42 ఏళ్లుగా కొనసాగుతున్న రాజసం

3.5 మరియు 7 సీటింగ్ ఎస్‌యూవీలకు రహదారి పరీక్షలు నిర్వహించిన టాటా

4.టియాగో కారు ఢీకొట్టడంతో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్: ఇదీ కారు పరిస్థితి!

5.ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ: ఒక కొత్త అధ్యయనానికి నాంది

English summary
Read In Telugu: 2018 Audi RS5 Coupe Launched In India; Priced At Rs 1.10 Crore
Story first published: Thursday, April 12, 2018, 10:00 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark