రహస్యంగా పట్టుబడిన 2018 ఫోర్డ్ ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్
తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, పూర్తి స్థాయిలో సిద్దమైన ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్‌ను ఫోర్డ్ ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షించింది. ఇప్పటికే దీని ప్రొడక్షన్ ప్రారంభించినట్లు తెలిసింది.
ఫోర్డ్ ఇండియా సరికొత్త 2018 ఫోర్డ్ ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ కాంపాక్ట్ సెడాన్ కారును ఈ ఏడాదిలో జూన్ నెలలో విడుదల చేయడానికి ఫోర్డ్ సమాయత్తమవుతోంది. 2018 ఫోర్డ్ ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి.

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, పూర్తి స్థాయిలో సిద్దమైన ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్‌ను ఫోర్డ్ ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షించింది. ఇప్పటికే దీని ప్రొడక్షన్ ప్రారంభించినట్లు తెలిసింది. విడుదల కంటే ముందుగా డీలర్లకు చేరవేసేందుకు ఉత్పత్తిని వేగవంతం చేసింది.

ఫోర్డ్ పాత తరానికి చెందిన ఆస్పైర్ ప్రొడక్షన్‌ను ఏప్రిల్‌లో ముగించింది. ఇప్పుడు కొత్త తరం ఆస్పైర్ సెడాన్ కారును ప్రొడక్షన్‌ను ప్రారంభించింది. నూతన ఫోర్డ్ ఆస్పైర్‌లో అధునాతన ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన ఫాగ్ ల్యాంప్స్, హెడ్ ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు వచ్చాయి. కారు సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ చూడటానికి మునుపటిలాగే ఉన్నప్పటికీ, ఫ్రంట్ బంపర్‌లో కొద్ది మేర మార్పులు జరిగాయి.

ఫోర్డ్ ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో కూడా కొన్ని కొత్త ఫీచర్లు పరిచయమయ్యాయి. ప్రధానంగా సింక్3, రివర్స్ కెమెరా, న్యావిగేషన్ మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేయగల 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఉంది. కీలెస్ ఎంట్రీ, బ్లాక్ మరియు బీజి డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ ఉన్నాయి.

సరికొత్త 2018 ఫోర్డ్ ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ అధునాతన డ్రాగన్ సిరీస్ నుండి సేకరించిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది. వీటిలో పెట్రోల్ ఇంజన్ 95బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ మరియు డీజల్ ఇంజన్ 99బిహెచ్‌పి పవర్ మరియు 215ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఫోర్డ్ ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ లభించే రెండు ఇంజన్ ఆప్షన్‌లను 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో ఎంచుకోవచ్చు. అయితే, అదనంగా పెట్రోల్ మోడల్ ఆప్షన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యమయ్యే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
సరికొత్త 2018 ఫోర్డ్ ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ కాంపాక్ట్ సెడాన్ ఫోర్డ్ ఇండియాకు సేల్స్ మెరుగుపరిచే అవకాశాలు ఉన్నాయి. అదనంగా జోడించిన ఫీచర్లు, శక్తివంతమైన నూతన ఇంజన్ పరిచయం మరియు ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లో చోటు చేసుకున్న మార్పుల దృష్ట్యా చూస్తే కస్టమర్లను మరింత ఆకట్టుకోనుంది.
Source: MotorOctane


Click it and Unblock the Notifications








