2018 హోండా అమేజ్ విడుదల: ధర రూ. 5.59 లక్షలు

సరికొత్త 2018 హోండా అమేజ్ (Honda Amaze 2018) విపణిలోకి విడుదల అయ్యింది. జపాన్ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ మార్కెట్లోకి సెకండ్ జనరేషన్ హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును లాంచ్ చేసింది. 2018 హోండా అమేజ్ ప్రారంభ ధర రూ. 5.59 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది.

2018 హోండా అమేజ్ విడుదల: ధర రూ. 5.59 లక్షలు

పూర్తి స్థాయిలో ఒక కొత్త డిజైన్ శైలిలో వచ్చిన హోండా అమేజ్ మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే చాలా విభిన్నంగా ఉంటుంది. కొత్త తరానికి చెందిన హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును తొలుత 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఆవిష్కరించింది. హోండా సిటీ ప్రేరణతో రూపొందించింది. హోండా అమేజ్ గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి....

2018 హోండా అమేజ్ విడుదల: ధర రూ. 5.59 లక్షలు

హోండా అమేజ్ వేరియంట్లు మరియు ధరలు

2018 హోండా అమేజ్ ఇ, ఎస్, వి మరియు విఎక్స్ అనే నాలుగు విభిన్న వేరియంట్లలో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో విడుదలయ్యింది. పెట్రోల్ వేరియంట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.59 లక్షలు మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 6.69 లక్షలుగా ఉన్నాయి. వేరియంట్ల వారీగా హోండా అమేజ్ ధరలు....

Variants Petrol Diesel
E MT ₹5,59,900 ₹6,69,900
S MT ₹6,49,900 ₹7,59,900
V MT ₹7,09,900 ₹8,19,900
VX MT ₹7,57,900 ₹8,67,900
S CVT ₹7,39,900 ₹8,39,900
V CVT ₹7,99,900 ₹8,99,900

2018 హోండా అమేజ్ విడుదల: ధర రూ. 5.59 లక్షలు

హోండా అమేజ్ ఇంజన్ మరియు స్పెసిఫికేషన్స్

సరికొత్త హోండా అమేజ్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 89బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.

2018 హోండా అమేజ్ విడుదల: ధర రూ. 5.59 లక్షలు

అదే విధంగా హోండా అమేజ్ కారులోని 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 99బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‍‌బాక్స్‌ అనుసంధానంతో లభ్యమవుతోంది.

2018 హోండా అమేజ్ విడుదల: ధర రూ. 5.59 లక్షలు

హోండా మోటార్స్ తమ రెండవ తరానికి చెందిన హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌ను సరికొత్త ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. దీని బరువు 905కిలోల నుండి 1039 కిలోల మధ్య ఉంటుంది. మునుపటి మోడల్ అమేజ్‌తో పోల్చుకుంటే దీని బరువు తక్కువగానే ఉంటుంది.

2018 హోండా అమేజ్ విడుదల: ధర రూ. 5.59 లక్షలు

సరికొత్త హోండా అమేజ్ కొలతల పరంగా కొద్దిగా మార్పులకు గురయ్యింది. పొడవు 5ఎమ్ఎమ్, వెడల్పు 15ఎమ్ఎమ్ పెరిగింది. ఏదేమైనప్పటికీ, అమేజ్ కారు మొత్తం పొడవు నాలుగు మీటర్ల లోపే ఉంది.

2018 హోండా అమేజ్ విడుదల: ధర రూ. 5.59 లక్షలు

హోండా అమేజ్ మైలేజ్

  • హోండా అమేజ్ పెట్రోల్ మ్యాన్యువల్ మైలేజ్ 19.5 కిమీ/లీ
  • హోండా అమేజ్ పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్ 19 కిమీ/లీ
  • హోండా అమేజ్ డీజల్ మ్యాన్యువల్ మైలేజ్ 27.8 కిమీ/లీ
  • హోండా అమేజ్ డీజల్ ఆటోమేటిక్ మైలేజ్ 23.8 కిమీ/లీ
  • 2018 హోండా అమేజ్ విడుదల: ధర రూ. 5.59 లక్షలు

    2018 హోండా అమేజ్ డిజైన్

    సరికొత్త హోండా అమేజ్ ముందు మరియు వెనుక వైపున అధునాతన డిజైన్ అంశాలను కలిగి ఉంది. ఫ్రంట్ డిజైన్‌లోని ఫ్రంట్ గ్రిల్ మీద క్రోమ్ స్ట్రిప్ హైలైట్‌గా నిలిచింది. ఎల్ఇడి పొజిషన్ ల్యాంప్స్ ఉన్న యాంగులర్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ క్రింది రీడిజైన్ చేయబడిన బంపర్‌లో ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ ఉంది.

    2018 హోండా అమేజ్ విడుదల: ధర రూ. 5.59 లక్షలు

    అమేజ్ సైడ్ డిజైన్ విషయానికి వస్తే, కండలు తిరిగి రూపంలో కాకుండా అత్యంత పదునైన క్యారెక్టర్ లైన్స్ కలిగి ఉంది. ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ నుండి డోర్ల మీదుగా రియర్ టెయిల్ ల్యాంప్ వద్ద ముగిసే అట్రాక్టివ్ షోల్డర్ లైన్స్ ఉన్నాయి. అదే విధంగా 15-అంగుళాల మల్టీ స్పోక్ట్ అల్లాయ్ వీల్స్‌ గుర్తించవచ్చు.

    2018 హోండా అమేజ్ విడుదల: ధర రూ. 5.59 లక్షలు

    కొత్త తరం హోండా అమేజ్ రియర్ డిజైన్‌లో అత్యంత ఆకర్షణీయమైన సి-ఆకారంలో ఉన్న స్ల్పిట్ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ ఉంది. మరియు ఇరువైపులా ఉన్న టెయిల్ లైట్లను కలుపుతూ డిక్కీ మీద క్రోమ్ స్ట్రిప్ అందివ్వడం జరిగింది.

    2018 హోండా అమేజ్ విడుదల: ధర రూ. 5.59 లక్షలు

    2018 హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌ను ఐదు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, రేడియంట్ రెడ్, వైట్ ఆర్చిడ్ పర్ల్, లునార్ సిల్వర్ మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్ మరియు మోడ్రన్ స్టీల్ మెటాలిక్.

    2018 హోండా అమేజ్ విడుదల: ధర రూ. 5.59 లక్షలు

    2018 హోండా అమేజ్ ఫీచర్లు

    సెకండ్ జనరేషన్ హోండా అమేజ్ ఇంటీరియర్ మునుపటి మోడల్ తరహా డ్యూయల్ థీమ్ ఉంది. అమేజ్ ఇంటీరియర్‌లో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేసే 7-అంగుళాల పరిమాణంలో ఉన్న డిజిప్యాడ్ 2.0 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెట్ సిస్టమ్ మరియు ఎమ్‌ఐడి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. పెట్రోల్ అమేజ్ వేరియంట్లో పెడల్ షిఫ్టర్లు కూడా ఉన్నాయి.-

    2018 హోండా అమేజ్ విడుదల: ధర రూ. 5.59 లక్షలు

    2018 హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌లో ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ గల పవర్ ఫోల్డింగ్ మరియు అడ్జెస్టబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ ఆధారిత కంట్రోల్స్, డే/నైట్ ఇన్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

    2018 హోండా అమేజ్ విడుదల: ధర రూ. 5.59 లక్షలు

    హోండా అమేజ్ సేఫ్టీ ఫీచర్లు

    హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ కొత్త తరం హోండా అమేజ్ కారులో భద్రత పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లను అన్ని వేరింయట్లలో తప్పనిసరిగా అందించింది.

    అదనంగా హోండా అమేజ్‌లో ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, సెంట్రల్ లాకింగ్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ మరియు రియర్ డీఫాగర్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

    2018 హోండా అమేజ్ విడుదల: ధర రూ. 5.59 లక్షలు

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    సెకండ్ జనరేషన్ హోండా జాజ్ నూతన శైలిలో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ పరంగా ప్రీమియం ఫీల్ కలిగించే బ్రాండ్ న్యూ కారు. నమ్మశక్యంగాని మరో హైలైట్ హోండా అమేజ్‌లోని పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో పరిచయం అయ్యింది.

    హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ ధరకు తగ్గ విలువలను కలిగి ఉంది. విపణిలో ఉన్న మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఎక్సెంట్, ఫోర్డ్ ఆస్పైర్ మరియు వోక్స్‌వ్యాగన్ అమియో వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Read In Telugu: Honda Amaze 2018 Launched In India; Prices Start At Rs 5.59 Lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X