సాంకేతిక లోపంతో పెద్ద ఎత్తున రీకాల్ అయిన హోండా అమేజ్‌

భారీ మార్పులు చేర్పులతో విడుదలైన సెకండ్ జనరేషన్ హోండా అమేజ్ భారీ విజయాన్ని అందుకొంది. అయితే, తాజాగా కస్టమర్ల మైండ్ బ్లాంక్ అయ్యే ప్రకటన ఒకటి విడుదల చేసింది.

By Anil Kumar

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఇటీవల విపణిలోకి సరికొత్త అమేజ్ కారును విడుదల చేసింది. భారీ మార్పులు చేర్పులతో విడుదలైన సెకండ్ జనరేషన్ హోండా అమేజ్ భారీ విజయాన్ని అందుకొంది. అయితే, తాజాగా కస్టమర్ల మైండ్ బ్లాంక్ అయ్యే ప్రకటన ఒకటి విడుదల చేసింది. అవును, కొత్తగా విడుదలైన హోండా అమేజ్ కార్లలో సాంకేతికంగా లోపం కారణంగా పెద్ద ఎత్తున రీకాల్ చేసినట్లు హోండా పేర్కొంది.

సాంకేతిక లోపంతో పెద్ద ఎత్తున రీకాల్ అయిన హోండా అమేజ్‌

హోండా మోటార్స్ మే 2018 న మార్కెట్లోకి తమ కొత్త తరం అమేజ్ కారును రూ. 5.59 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ధరతో లాంచ్ చేసింది. అయితే, మార్కెట్లోకి వచ్చి కనీసం మూడు నెలలు కూడా గడవకముందే హోండా కార్ల తయారీ దిగ్గజం తమ కాంపాక్ట్ సెడాన్ కారును రీకాల్ చేసింది.

సాంకేతిక లోపంతో పెద్ద ఎత్తున రీకాల్ అయిన హోండా అమేజ్‌

హోండా మోటార్స్ ఇటీవల విక్రయించిన హోండా అమేజ్ కార్లలోని స్టీరింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా రీకాల్ చేసింది. సుమారుగా 7,290 హోండా అమేజ్ కార్లలో ఇపిఎస్ (ఎలక్ట్రిక్-అసిస్ట్ పవర్ స్టీరింగ్) సెన్సార్ పనితీరును పరీక్షించేందుకు రీకాల్‌కు గురైన కార్లను వెనక్కి పిలిచినట్లు వెల్లడించింది.

సాంకేతిక లోపంతో పెద్ద ఎత్తున రీకాల్ అయిన హోండా అమేజ్‌

ఏప్రిల్ 17,2018 నుండి మే 24, 2018 మధ్య కాలంలో తయారైన హోండా అమేజ్ కార్లు మాత్రమే రీకాల్‌కు గురయ్యాయి. రీకాల్ అయిన కార్లలోని సమస్య సంభందింత డీలర్లు ఉచితంగా పరీక్షిస్తారు. మరియు ఏదైనా లోపం గుర్తిస్తే, ఆ పరికరాన్ని పూర్తి ఉచితంగా మారుస్తారు.

సాంకేతిక లోపంతో పెద్ద ఎత్తున రీకాల్ అయిన హోండా అమేజ్‌

కొన్ని హోండా అమేజ్ కార్లలో, స్టీరింగ్ వీల్ బరువుగా అనిపించడం మరియు ఇపిఎస్ ఇండికేటర్ ఆన్ అవ్వడం జరుగుతుందని హోండా ప్రకటించింది. ఇపిఎస్‌లో సమస్య ఉన్నట్లు గుర్తించిన కార్లలో ఆ యూనిట్‌ను మార్చేస్తామని కూడా పేర్కొంది.

సాంకేతిక లోపంతో పెద్ద ఎత్తున రీకాల్ అయిన హోండా అమేజ్‌

రీకాల్‌కు గురైన కార్లను గుర్తించి డీలర్లు ఆయా కార్ల యజమానులను జూలై 26, 2018 నుండి సంప్రదిస్తారు. అయితే, హోండా అమేజ్ ఓనర్లు కారు యొక్క వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌ ద్వారా హోండా అఫీషియల్ వెబ్‌సైట్లో తమ వెహికల్ రీకాల్ జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు.

సాంకేతిక లోపంతో పెద్ద ఎత్తున రీకాల్ అయిన హోండా అమేజ్‌

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్‌పో 2018లో సెకండ్ జనరేషన్ అమేజ్ కారును ఆవిష్కరించి, మే 2018లో పూర్తి స్థాయిలో మార్కెట్లోకి లాంచ్ చేసింది. అధునాతన డిజైన్ మరియు పలు ప్రీమియం ఫీచర్లతో విడుదలైన అమేజ్ భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్ కార్లలో ఒకటిగా నిలిచింది.

సాంకేతిక లోపంతో పెద్ద ఎత్తున రీకాల్ అయిన హోండా అమేజ్‌

సరికొత్త హోండా అమేజ్ అవే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. వీటిలో, పెట్రోల్ యూనిట్ 87బిహెచ్‌పి-110ఎన్ఎమ్ అదే విధంగా డీజల్ యూనిట్ 98.6బిహెచ్‌పి-200ఎన్ఎమ్ ప్రొడ్యూస్ చేస్తాయి.

సాంకేతిక లోపంతో పెద్ద ఎత్తున రీకాల్ అయిన హోండా అమేజ్‌

పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో అదే విధంగా, డీజల్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఆప్షనల్ సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో లభ్యమవుతోంది. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు స్టాండర్డ్ ఫీచర్లుగా లభ్యమవుతున్నాయి.

సాంకేతిక లోపంతో పెద్ద ఎత్తున రీకాల్ అయిన హోండా అమేజ్‌

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా మోటార్స్ తమ కొత్త తరం అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కార్లను పవర్ స్టీరింగ్ సెన్సార్‌లో లోపం కారణంగా రీకాల్ చేసింది. సమస్య చిన్నదే అయినప్పటికీ, కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని హోండా మోటార్స్ ఈ తాత్కాలిక రీకాల్ చేపట్టింది. ఇండియాలో రీకాల్ పట్ల ప్రత్యేకమైన చట్టాలు ఏమీ లేవు. అయితే, కార్ల కంపెనీలే స్వచ్ఛందంగా రీకాల్ చేపట్టి, సమస్య ఉన్న కార్లను గుర్తించి లోపాన్ని సరిచేస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, July 23, 2018, 12:52 [IST]
English summary
Read In Telugu: New Honda Amaze Recalled In India Over Power Steering Sensor Issue
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+