సరికొత్త బ్రియో కారును ఆవిష్కరించిన హోండా మోటార్స్

హోండా మోటార్స్ 2018 ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షోలో సెకండ్ జనరేషన్ బ్రియో హ్యాచ్‌బ్యాక్ కారును ఆవిష్కరించింది. జకార్తా వేదికగా జరిగిన గైకిండో ఇండోషినేషియా ఇంటర్నేషనల్ ఆటో షో (GIIAS 2018)లో హోండా స్మాల

By Anil Kumar

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా మోటార్స్ 2018 ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షోలో సెకండ్ జనరేషన్ బ్రియో హ్యాచ్‌బ్యాక్ కారును ఆవిష్కరించింది. జకార్తా వేదికగా జరిగిన గైకిండో ఇండోషినేషియా ఇంటర్నేషనల్ ఆటో షో (GIIAS 2018)లో హోండా స్మాల్ ఆర్ఎస్ కాన్సెప్ట్ ఆధారిత బ్రియో కారును ఆవిష్కరించింది.

సరికొత్త బ్రియో కారును ఆవిష్కరించిన హోండా మోటార్స్

సెంకడ్ జనరేషన్ హోండా బ్రియో హ్యాచ్‌బ్యాక్ ఒవరాల్ డిజైన్ చూడటానికి అచ్చం హోండా స్మాల్ ఆర్ఎస్ కాన్సెప్ట్ మోడల్‌నే పోలి ఉంటుంది. హోండా మోటార్స్ బ్రియో కారును స్టాండర్డ్ మరియు బ్రియో స్టాండర్డ్ అనే రెండు విభిన్న వేరియంట్లలో ప్రవేశపెట్టింది.

సరికొత్త బ్రియో కారును ఆవిష్కరించిన హోండా మోటార్స్

కొత్త తరం హోండా బ్రియో ఫ్రంట్ డిజైన్‌లో ఇంటిగ్రేటెడ్ హెడ్ ల్యాంప్స్ గల అధునాతన ఫ్రంట్ గ్రిల్ ఉంది. బ్రియో ఫ్రంట్ డిజైన్ ఇండోనేషియా మార్కెట్లో అమ్ముడవుతున్న హోండా మొబీలియో ఎమ్‌పీవీని పోలి ఉంటుంది. పెద్ద పెద్ద డోర్లు మరియు పొడగించిన బాడీ గల బ్రియో ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోల్చితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది

సరికొత్త బ్రియో కారును ఆవిష్కరించిన హోండా మోటార్స్

బ్రియో హ్యాచ్‌బ్యాక్ యొక్క స్పోర్టివ్ వెర్షన్ బ్రియో ఆర్ఎస్ కారులో పలు అరుదైన మరియు విభిన్న డిజైన్ ఎలిమెంట్లు ఉన్నాయి. బ్లాక్ కలర్ ఫినిషింగ్ గల ఫ్రంట్ ఎండ్ పిల్లర్, స్పోర్టివ్ అల్లాయ్ వీల్స్, అగ్రెసివ్ రియర్ బంపర్ డిజైన్ మరియు బ్రియో ఆర్ఎస్‌లో అత్యంత శక్తివంతమైన ఇంజన్ వచ్చే అవకాశం ఉంది.

సరికొత్త బ్రియో కారును ఆవిష్కరించిన హోండా మోటార్స్

హోండా మోటార్స్ బ్రియో హ్యాచ్‌బ్యాక్ టెక్నికల్ వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇండోనేషియా మార్కెట్లోని మొదటి తరం హోండా బ్రియో కారులో 88బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. బహుశా సెకండ్ జనరేషన్ మోడల్‌లో కూడా ఇదే ఇంజన్ వచ్చే అవకాశం ఉంది.

సరికొత్త బ్రియో కారును ఆవిష్కరించిన హోండా మోటార్స్

రెండవ తరానికి చెందిన హోండా బ్రియో ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ బ్రియో ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడం ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు. కానీ భారీ మార్పులకు గురైన హోండా బ్రియో ఇండియన్ మార్కెట్లోకి రీలాంచ్ అయితే మంచి సక్సెస్ అందుకునే అవకాశం ఉంది.

సరికొత్త బ్రియో కారును ఆవిష్కరించిన హోండా మోటార్స్

హోండా మోటార్స్ ఈ ఏడాది సెకండ్ జనరేషన్ హోండా అమేజ్ కారును లాంచ్ చేసింది. హోండా సిటీ డిజైన్ శైలిలో, భారీ మార్పులు చేర్పులతో అధునాతన ఫీచర్లతో వచ్చిన హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కంపెనీ భారీ సేల్స్ సాధించిపెడుతోంది.

సరికొత్త బ్రియో కారును ఆవిష్కరించిన హోండా మోటార్స్

డైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సెకండ్ జనరేషన్ హోండా బ్రియో దాదాపు హోండా అమేజ్ కారును పోలి ఉంటుంది. అంతే కాకుండా, బ్రియో స్టాండర్డ్ మరియు బ్రియో ఆర్ఎస్ స్పోర్టివ్ వేరియంట్లను ఆవిష్కరించింది. ఈ రెండు మోడళ్లు పూర్తి స్థాయిలో విడుదలైతే, మార్కెట్లో ఉన్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు గట్టి పోటీనిస్తుంది.

కొత్త తరం హోండా బ్రియో గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి...

Image Courtesy: Paultan

More from DriveSpark

Article Published On: Thursday, August 2, 2018, 15:22 [IST]
English summary
Read In Telugu: New Honda Brio Revealed At 2018 Indonesia International Auto Show
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+