2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ఇవీ ప్రత్యేకతలు!!

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ భారత్‌లోకి విడుదలయ్యిది: జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి సరికొత్త 2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ కారును లాంచ్ చేసింది.

By Anil Kumar

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ భారత్‌లోకి విడుదలయ్యిది: జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి సరికొత్త 2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ కారును లాంచ్ చేసింది. మునుపటి జాజ్ కారుతో పోల్చుకుంటే 2018 జాజ్ ఫేస్‌లిఫ్ట్ కారులో నూతన ఫీచర్లు పరిచయం అయ్యాయి. సరికొత్త జాజ్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.35 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ మూడు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, ఎస్, వి, మరియు విఎక్స్. వీటిలో, ప్రారంభ ఎస్ వేరియంట్ కేవలం డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యమవుతోంది.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

వి మరియు విఎక్స్ వేరియంట్లు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లో మాత్రమే లభిస్తుండగా, వి మరియు విఎక్స్ సీవీటీ గేర్‌బాక్స్ వేరియంట్లు కేవలం పెట్రోల్ ఇంజన్‌లో మాత్రమే లభిస్తున్నాయి.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల వారీగా ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

Variants Petrol Diesel
S MT Not Available Rs 8.05 lakh
V MT Rs 7.35 lakh Rs 8.85 lakh
VX MT Rs 7.79 lakh Rs 9.29 lakh
V CVT Rs 8.55 lakh Not Avilable
VX CVT Rs 8.99 lakh Not Avilable
2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ కారులో ఎక్ట్సీరియర్ డిజైన్ మరియు మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు. కానీ, పాత జాజ్ హ్యాచ్‌బ్యాక్ కారుతో పోల్చుకుంటే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ జాజ్ కారులో పలు నూతన ఫీచర్లు మరియు ఇంటీరియర్ అప్‌డేట్స్ చోటు చేసుకున్నాయి.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

హోండా జాజ్ ఎంట్రీ లెవల్ వేరియంట్ "ఎస్"లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఫోర్-స్పీకర్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, రియర్ డీఫాగర్, సెంట్రల్ ఆర్మ్ రెస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

2018 హోండా జాజ్ మిడ్ వేరియంట్ "వి"లో పైన పేర్కొన్న ఫీచర్లతో పాటు 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, 5-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, ఫాగ్ ల్యాంప్స్, రియర్ వైపర్ మరియు బీజీ ఇంటీరియర్స్ ఉన్నాయి.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్స్ గల సీవీటి "వి" వేరియంట్లో క్రూయిజ్ కంట్రోల్ టెక్నాలజీ ఉంది. అయితే, సీవీటీ పెట్రోల్ "వి" వేరియంట్లో మాత్రమే పెడల్ షిఫ్టర్స్ ఉన్నాయి.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

హోండా జాజ్ టాప్ ఎండ్ వేరియంట్ "విఎక్స్"లో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల పెద్ద పరిమాణంలో ఉన్న 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే అవకాశం ఉన్న ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు లెథర్ తొడుగులు గల గేర్ నాబ్ మరియు స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అవే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి. వీటిలో 88బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేగా సీవీటీ ట్రాన్స్‌మిషన్‌లో ఎంచుకోవచ్చు.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

అదే విధంగా జాజ్ ఫేస్‌లిఫ్ట్‌లోని 1.5-లీటర్ డీజల్ ఇంజన్ గరిష్టంగా 98బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇది కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యమవుతోంది.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి సరికొత్త అప్‌డేటెడ్ 2018 జాజ్ ఫేస్‌లిఫ్ట్ కారును లాంచ్ చేసింది. డిజైన్ మరియు మెకానికల్‌గా ఎలాంటి మార్పులు సంభవించలేదు. అయితే, ఫీచర్ల పరంగా భారీ మార్పులు చేర్పులతో పాటు పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ చోటు చేసుకున్నాయి.

2018 హోండా జాజ్ విపణిలో ఉన్న మారుతి సుజుకి బాలెనో మరియు హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లకు గట్టి పోటీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 19, 2018, 21:47 [IST]
English summary
Read In Telugu: 2018 Honda Jazz Facelift Launched In India; Prices Start At Rs 7.35 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+