2018 హ్యుందాయ్ క్రెటా విడుదల: ధర రూ. 9.43 లక్షలు

విపణిలోకి 2018 హ్యుందాయ్ క్రెటా విడుదలయ్యింది. హ్యుందాయ్ ఇండియా దేశీయ విపణిలోకి సరికొత్త 2018 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ క్రెటా ఎస్‌యూవీని లాంచ్ చేసింది. 2018 హ్యుందాయ్ క్రెటా ప్రారంభ వేరియంట్ ధర రూ. 9.43 లక

విపణిలోకి 2018 హ్యుందాయ్ క్రెటా విడుదలయ్యింది. హ్యుందాయ్ ఇండియా దేశీయ విపణిలోకి సరికొత్త 2018 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ క్రెటా ఎస్‌యూవీని లాంచ్ చేసింది. 2018 హ్యుందాయ్ క్రెటా ప్రారంభ వేరియంట్ ధర రూ. 9.43 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

సరికొత్త 2018 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ హ్యుందాయ్ క్రెటా అధునాతన ఎక్ట్సీరియర్ మరియు డిజైన్ అప్‌డేట్స్‌తో పాటు ఎన్నో అత్యాధునిక ఫీచర్లతో పరిచయమయ్యింది. పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

2018 హ్యుందాయ్ క్రెటా విడుదల

2018 హ్యుందాయ్ క్రెటా మూడు ఇంజన్ ఆప్షన్‌లలో ఐదు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. 2018 హ్యుందాయ్ క్రెటా ప్రారంభ వేరియంట్ ధర రూ. 9.43 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 15.03 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

2018 హ్యుందాయ్ క్రెటా విడుదల

2018 హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ వేరియంట్ల ధరలు

Variant (Petrol) Price
1.6 E ₹9,43,908
1.6 E+ ₹9,99,900
1.6 SX ₹11,93,934
1.6 SX Dual Tone ₹12,43,934
1.6 SX AT ₹13,43,834
1.6 SX (O) ₹13,59,948
2018 హ్యుందాయ్ క్రెటా విడుదల

2018 హ్యుందాయ్ క్రెటా డీజల్ వేరియంట్ల ధరలు

Variant (Diesel) Price
1.4 E+ ₹9,99,900
1.4 S ₹11,73,893
1.6 S AT ₹13,19,934
1.6 SX ₹13,23,934
1.6 SX Dual Tone

₹13,73,934
1.6 SX AT ₹14,83,934
1.6 SX(O) ₹15,03,934
2018 హ్యుందాయ్ క్రెటా విడుదల

డిజైన్ పరంగా సరికొత్త హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలోని ఫ్రంట్ డిజైన్‌లో అతి పెద్ద క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్, నూతన ఫ్రంట్ బంపర్, కొత్తగా రూపొందించిన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ మరియు ఆకర్షణీయమైన సిల్వర్ స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి. 2018 క్రెటాలో డ్యూయల్ టోన్ ఎక్ట్సీరియర్ ఫినిషింగ్ మరియు రీడిజైన్ చేయబడిన రియర్ బంపర్ వంటి మార్పులు చోటు చేసుకున్నాయి.

2018 హ్యుందాయ్ క్రెటా విడుదల

2018 హ్యుందాయ్ క్రెటా ఏడు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. అవి, వైట్, ఆరేంజ్, బ్లాక్, సిల్వర్, బ్లూ, వైట్/బ్లాక్(డ్యూయల్-టోన్) మరియు ఆరేంజ్/బ్లాక్(డ్యూయల్-టోన్).

2018 హ్యుందాయ్ క్రెటా విడుదల

2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో కూడా ఆశించిన మేర మార్పులు జరిగాయి. ఈ మార్పులు వేరియంట్ల వారీగా విభిన్నంగా ఉన్నాయి. క్రెటా బేస్ వేరియంట్ "ఇ" లో డ్రైవర్ సీట్ అడ్జెస్ట్‌మెంట్ మరియు స్లైడింగ్ ఆర్మ్ రెస్ట్ పరిచయం అయ్యాయి.

2018 హ్యుందాయ్ క్రెటా విడుదల

హ్యుందాయ్ క్రెటా టాప్ ఎండ్ వేరియంట్ ఎస్ఎక్స్(ఒ)లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఆరు మార్గాల్లో అడ్జెస్ట్ చేసుకునే అవకాశం ఉన్న డ్రైవర్ సీటు, స్మార్ట్ కీ బ్యాండ్, వైర్-లెస్ ఛార్జింగ్ మరియు ఆరు ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి.

2018 హ్యుందాయ్ క్రెటా విడుదల

సాంకేతికంగా 2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ అవే మునుపటి ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. వీటిలో, 1.4-లీటర్ డీజల్ ఇంజన్ 88.7బిహెచ్, 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ 121బిహెచ్‌పి మరియు 1.6-లీటర్ డీజల్ ఇంజన్ 126బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 హ్యుందాయ్ క్రెటా విడుదల

ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, 1.4 మరియు 1.6 లీటర్ ఇంజన్‌లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ అనుసంధానంతో, అదే విధంగా రెండు 1.6-లీటర్(పెట్రోల్ మరియు డీజల్) ఇంజన్‌లు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ అనుసంధానంతో లభిస్తున్నాయి. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ క్రెటా ఎస్‌యూవీలో నాయిస్, వైబ్రేషన్ మరియు హార్స్‌నెస్ గణనీయంగా మెరుగుపరిచినట్లు హ్యుందాయ్ పేర్కొంది.

2018 హ్యుందాయ్ క్రెటా విడుదల

2018 హ్యుందాయ్ క్రెటా టాప్ ఎండ్ వేరియంట్ ఎస్ఎక్స్(ఒ)లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మిస్సయ్యింది. ఒకవేళ క్రెటా టాప్ ఎండ్ వేరియంట్‌ను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకున్నట్లయితే, ఎలక్ట్రానిక్ సన్‌రూఫ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్లను కోల్పోతారు.

2018 హ్యుందాయ్ క్రెటా విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా పలు మార్పులు చేర్పులు నిర్వహించిన అనేకమార్లు ఇండియన్ రోడ్ల అత్యంత రహస్యంగా పరీక్షించిన అనంతరం హ్యుందాయ్ ఎట్టకేలకు 2018 క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను విపణిలోకి లాంచ్ చేసింది. మునుపటి క్రెటాతో పోల్చితే ఫేస్‌లిఫ్ట్ క్రెటా చాలా లగ్జరీగా ఉంటుంది.

2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ రెనో క్యాప్చర్, మారుతి ఎస్-క్రాస్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

2018 హ్యుందాయ్ క్రెటా విడుదల

1.ఒకప్పుడు రోడ్డు ప్రక్కన గాలిపటాలు అమ్ముకునే వాడు, కానీ ఇప్పుడు....

2.ఇన్నోవా క్రిస్టాకు పోటీగా వస్తోన్న 11 సీటర్ కియా గ్రాండ్ కార్నివాల్

3.సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్ డెలివరీ ప్రారంభించిన టాటా మోటార్స్

4.మార్కెట్‌ను శాసించేందుకు 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న9 కొత్త ఎస్‌యూవీలు

5.ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్

Most Read Articles

English summary
Read In Telugu: Hyundai Creta 2018 Launched In India; Prices Start At Rs 9.43 Lakh
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X