హ్యుందాయ్ శాంట్రో విడుదల తేదీ ఖరారు
హ్యుందాయ్ మోటార్స్ తమ సరికొత్త శాంట్రో కారును ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. ప్రస్తుతానికైతే దీనిని ఏహెచ్2 పేరుతో పిలుస్తున్న హ్యుందాయ్ అతి త్వరలో దీనికి కొత్త పేరును కూ
హ్యుందాయ్ మోటార్స్ తమ సరికొత్త శాంట్రో కారును ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. ప్రస్తుతానికైతే దీనిని ఏహెచ్2 పేరుతో పిలుస్తున్న హ్యుందాయ్ అతి త్వరలో దీనికి కొత్త పేరును కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ, తాజాగా అందిన సమాచారం మేరకు ఆక్టోబరు 23, 2018 న శాంట్రో పేరుతోనే మళ్లీ విడుదలవుతున్న సమాచారం.

అంతే కాకుండా, హ్యుందాయ్ మోటార్స్ ఆక్టోబర్ 9, 2018 న అధికారికంగా తమ సరికొత్త శాంట్రో హ్యాచ్‌బ్యాక్ కారును ఆవిష్కరించనున్నట్లు తెలిసింది. హ్యుందాయ్ గత కొన్ని నెలల నుండి శాంట్రో కారును ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తూ వచ్చింది. కొత్త తరం శాంట్రో కారులో ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.

ఏదేమైనప్పటికీ, అదే మునుపటి టాల్ బాయ్ డిజైన్‌ను యథావిధిగా కొనసాగించనుంది. కాస్త పదునైన మరియు స్లోప్ ఉన్న రూఫ్ టాప్ మరియు కండలు తిరిగిన సైడ్ పిల్లర్లు రానున్నాయి. రియర్ డిజైన్‌లో రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, ఆకర్షణీయమైన వీల్ ఆర్చెస్ మరియు శాంట్రో టాప్ ఎండ్ వేరియంట్లో పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు కూడా వచ్చే అవకాశం ఉంది.

శాంట్రో ఇంటీరియర్‌లో నలుపు మరియు లేత గోధుమ వర్ణంలో ఉండే డ్యూయల్ టోన్ థీమ్ కలదు. ఇంటీరియర్ కలర్‌ను పోలి ఉండే ప్రీమియం అప్‌హోల్‌స్ట్రే, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, ట్విన్-పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు చిన్న పరిమాణంలో ఉండే మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ల్పే ఉంది.

సాంకేతికంగా సరికొత్త హ్యుందాయ్ శాంట్రో కారులో అదే మునుపటి శక్తివంతమైన 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా ఇందులో పరిచయం అయ్యే అవకాశం ఉంది.

హ్యుందాయ్ మోటార్స్ తమ శాంట్రో లేదా ఏహెచ్2 కారుకు కొత్త పేరును పెట్టేందుకు ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఔత్సాహికులు ఇందులో పాల్గొని, హ్యుందాయ్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారుకు మీరు ఒక కొత్త పేరును సూచించవచ్చు. అన్ని పేర్లను పరిశీలించిన అనంతరం హ్యుందాయ్ ఓ పేరును ఎంచుకుని దానినే ఖారారు చేస్తుంది. ఆ పేరును సూచించిన వ్యక్తి ఈ కారును బహుమానంగా అందుకోనున్నారు.

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!
హ్యుందాయ్ మోటార్స్ అతి త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్న శాంట్రో కారు విపణిలో ఉన్న ఇయాన్ స్థానాన్ని భర్తీ చేయనుంది. హ్యుందాయ్ ఇయాన్ ఆశించిన సేల్స్ సాధించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. ఏదేమైనప్పటికీ, డిమాండ్ ఎక్కువగా ఉన్న ఈ సెగ్మెంట్లో ఇప్పటికే ఉన్న ఆల్టో కె10, రెనో క్విడ్ మరియు టాటా టియాగో వంటి మోడళ్లకు గట్టి పోటీనిచ్చేందుకు హ్యందాయ్ సర్వం సిద్దం చేసుకుంది.


Click it and Unblock the Notifications








