సరికొత్త 2018 హ్యుందాయ్ శాంట్రో ఇంటీరియర్ రివీల్
2018 హ్యుందాయ్ శాంట్రో ఇంటీరియర్ మొట్టమొదటిసారి అత్యంత రహస్యంగా లీక్ అయ్యింది. తాజాగా రివీల్ అయిన ఫోటోలు అతి త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కానున్న శాంట్రో కారు ఇంటీరియర్ ఫస్ట్ లుక్ రివీల్ చేశాయి.
2018 హ్యుందాయ్ శాంట్రో ఇంటీరియర్ మొట్టమొదటిసారి అత్యంత రహస్యంగా లీక్ అయ్యింది. తాజాగా రివీల్ అయిన ఫోటోలు అతి త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కానున్న శాంట్రో కారు ఇంటీరియర్ ఫస్ట్ లుక్ రివీల్ చేశాయి.

హ్యుందాయ్ ఇండియా శాంట్రో హ్యాచ్‌బ్యాక్‌ను ఈ ఏడాదిలో పండుగ సీజన్ ప్రారంభమయ్యే నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం హ్యాందాయ్ శాంట్రోను అనేక సార్లు దేశీయ రోడ్ల మీద పరీక్షిస్తోంది. తాజాగా, తమిళనాడులోని ఊటీకి సమీపంలో శాంట్రోకు టెస్టింగ్ నిర్వహిస్తుండగా ఇంటీరియర్ ఫోటోలు లీక్ అయ్యాయి.

మునుపటి తరం శాంట్రోతో పోల్చుకుంటే కొత్త తరం శాంట్రో హ్యాచ్‌బ్యాక్ మరింత వివాసవంతమైన లక్షణాలతో రానుంది. హ్యుందాయ్ వారి ఫ్లూయిడిక్ డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా, సరికొత్త క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్ మరియు హెడ్‌ల్యాంప్స్‌తో రానుంది. ఫ్రంట్ డిజైన్ గ్రాండ్ ఐ10 మోడల్‌ను పోలి ఉంటుంది.

ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ చాలా ఎత్తులో, హెడ్ ల్యాంప్‌కు చాలా దగ్గరలో ఇవ్వబడ్డాయి. సైడ్ ప్రొఫైల్‌లో క్యారెక్టర్ లైన్స్, పుల్ అప్ డోర్లు, పెద్ద పరిమాణంలో ఉన్న టెయిల్ ల్యాంప్స్ మరియు రియర్ బంపర్ మీద బ్లాక్ ఇన్సర్ట్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లలో ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ ఉన్న ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, రియర్ వైపర్స్ మరియు ఫ్లాట్ బూట్ స్పేస్ ఉన్నాయి. శాంట్రో బేస్ వేరియంట్లో స్టీల్ వీల్స్ మరియు టాప్ ఎండ్ వేరియంట్లో అల్లాయ్ వీల్స్ వచ్చే అవకాశం ఉంది.

కొత్త తరం హ్యుందాయ్ శాంట్రో ఇంటీరియర్ విషయానికి వస్తే, గ్రాండ్ ఐ10 తరహా ఆడియో కంట్రోల్స్ గల త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంది. నూతన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, గేర్ లీవర్ వెనుక పవర్ విండో బటన్స్ మరియు డ్యాష్ బోర్డు మీద అందించిన గేర్ లీవర్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. బ్లాక్ మరియు బీజి డ్యూయల్-టోన్ ఇంటీరియర్ వచ్చే అవకాశం ఉంది.

2018 హ్యుందాయ్ శాంట్రోలో సాంకేతికంగా 1.0-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ రానుంది. మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో దీనిని ఎంచుకోవచ్చు. అదనంగా మరో రూ.50,000 లు చెల్లిస్తే సిఎన్‌జి కిట్ కూడా అందివ్వనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
సరికొత్త 2018 హ్యుందాయ్ శాంట్రో పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, మార్కెట్లో ఉన్న టాటా టియాగో, మారుతి సుజుకి సెలెరియో మరియు వ్యాగన్ఆర్ వంటి మోడళ్లకు గట్టిపోటీనివ్వనుంది. హ్యుందాయ్ శాంట్రో ధరల శ్రేణి రూ. 3 లక్షల నుండి 5 లక్షల ధరల శ్రేణిలో వచ్చే అవకాశం ఉంది.
Source: MotorBeam


Click it and Unblock the Notifications








