9 సీటర్ మహీంద్రా టియువి 300 ప్లస్ లాంచ్ ఖరారు: వేరియంట్లు మరియు ధరలు

మహీంద్రా అండ్ మహీంద్రా విడుదలకు సిద్దం చేసిన మహీంద్రా టియువి 300 ప్లస్ గురించిన వివరాలు లీక్ అయ్యాయి.

By Anil Kumar

మహీంద్రా అండ్ మహీంద్రా విడుదలకు సిద్దం చేసిన మహీంద్రా టియువి 300 ప్లస్ గురించిన వివరాలు లీక్ అయ్యాయి. ఆన్‌లైన్ వేదికగా బయటికొచ్చిన బ్రోచర్ ప్రకారం, సరికొత్త మహీంద్రా టియువి300 ప్లస్ విడుదలకు మరెంతో సమయం లేదని చెప్తోంది.

9 మంది ప్రయాణించే సీటింగ్ సామర్థ్యంతో వస్తున్న మహీంద్రా టియువి 300 ప్లస్ వేరియంట్లు, ఫీచర్లు, ధరల మరియు ఇతర వివరాలు ఇవాళ్టి స్టోరీలో చూద్దాం రండి...

9 సీటర్ మహీంద్రా టియువి 300 ప్లస్ లాంచ్ ఖరారు: వేరియంట్లు మరియు ధరలు

రహస్యంగా లీక్ అయిన సమాచారం మేరకు, టియువి 300 ప్లస్ రెగ్యులర్ టియువి 300 యొక్క పొడగించబడిన వెర్షన్ అని తెలుస్తోంది. ఈ కొత్త ఎస్‌యూవీ మునుపటి ఎస్‌యూవీ యొక్క 5-స్లాట్ ఫ్రంట్ గ్రిల్ మరియు న్యూ స్వెప్ట్ బ్యాక్ హెడ్‌ల్యాంప్స్ కలయికలో ఉన్న ఫ్రంట్ డిజైన్‌తో వచ్చింది. అచ్చం మునుపటి మోడల్‌లో ఉన్న ఫ్రంట్ బంపర్ మరియు ఎయిర్ ఇంటేకర్‌లో కూడా ఎలాంటి మార్పు జరగలేదు.

9 సీటర్ మహీంద్రా టియువి 300 ప్లస్ లాంచ్ ఖరారు: వేరియంట్లు మరియు ధరలు

సైడ్ డిజైన్ విషయానికి వస్తే, బాక్సీ ఆకారంలో ఉన్న బాడీలో చతురస్రాకారంలో ఉన్న వీల్ ఆర్చెస్ గమనించవచ్చు. అదే విధంగా, మూడవ వరుస సీటింగ్ ఉంటుంది కాబట్టి, చివరలో గ్లాస్ ఫినిషింగ్ మరియు వ్రాప్-అరౌండ్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. రియర్ డిజైన్‌లో టెయిల్ గేట్ మీద స్పేర్ వీల్ అందివ్వడం జరిగింది.

9 సీటర్ మహీంద్రా టియువి 300 ప్లస్ లాంచ్ ఖరారు: వేరియంట్లు మరియు ధరలు

లీక్ అయిన బ్రోచర్‌లో మహీంద్రా టియువి 300 ప్లస్ లభించే వేరియంట్లలో పి4 వేరియంట్ ఉన్నట్లు బయటపడింది. మహీంద్రా టియువి 300 ప్లస్ ఎస్‌యూవీ పొడవు 4,400ఎమ్ఎమ్, వెడల్పు 1,835ఎమ్ఎమ్, ఎత్తు 1,812ఎమ్ఎమ్‌గా ఉంది. అయితే, దీని వీల్ బేస్ సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యూవీ యొక్క వీల్ బేస్ 2,680ఎమ్ఎమ్‌కు సమానంగా ఉంది.

9 సీటర్ మహీంద్రా టియువి 300 ప్లస్ లాంచ్ ఖరారు: వేరియంట్లు మరియు ధరలు

మహీంద్రా టియువి300 ప్లస్ ఎస్‌యూవీ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, ట్విన్ పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, చివరి వరుసలో నలుగు ప్రయాణించే విధంగా ప్రక్కకు ఇవ్వబడిన రెండు సీట్లు ఉన్నాయి.

9 సీటర్ మహీంద్రా టియువి 300 ప్లస్ లాంచ్ ఖరారు: వేరియంట్లు మరియు ధరలు

అదనంగా, టిల్ట్ అడ్జెస్ట్‌మెంట్ గల స్టీరింగ్ వీల్, పవర్ విండోస్, అంతర్గతంగా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, సెంట్రల్ లాకింగ్, ఇల్యూమినేటెడ్ ఇగ్నిషన్ రింగ్ డిస్ల్పే వంటి ఫీచర్లు ఉన్నాయి.

9 సీటర్ మహీంద్రా టియువి 300 ప్లస్ లాంచ్ ఖరారు: వేరియంట్లు మరియు ధరలు

భద్రత పరంగా సరికొత్త మహీంద్రా టియువి 300 ప్లస్ ఎస్‌యూవీలో చైల్డ్ లాక్స్, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ వార్నింగ్, యాంటీ-థెఫ్ట్ స్టీరింగ్ లాక్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, క్రాష్ ప్రొటెక్షన్ మరియు సైడ్ ఇంట్రూషన్ బీమ్స్ వంటివి ఉన్నాయి.

9 సీటర్ మహీంద్రా టియువి 300 ప్లస్ లాంచ్ ఖరారు: వేరియంట్లు మరియు ధరలు

సరికొత్త మహీంద్రా టియువి 300 ప్లస్ ఎస్‌యూవీ నాలుగు విభిన్న రంగుల్లో లభ్యం కానుంది. అవి, బోల్డ్ బ్లాక్, గ్లేజియర్ వైట్, మాజెస్టిక్ సిల్వర్ మరియు డైనమో రెడ్.

9 సీటర్ మహీంద్రా టియువి 300 ప్లస్ లాంచ్ ఖరారు: వేరియంట్లు మరియు ధరలు

సాంకేతికంగా టియువి 300 ప్లస్ ఎస్‌యూవీలో మహీంద్రా వారి 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్ ఉంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఈ ఇంజన్ గరిష్టంగా 120బిహెచ్‌పి పవర్ మరియు 280ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

9 సీటర్ మహీంద్రా టియువి 300 ప్లస్ లాంచ్ ఖరారు: వేరియంట్లు మరియు ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారత్‌లో మహీంద్రా టియువి 300 ప్లస్ విడుదల గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే, ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే మార్కెట్లో ఉన్న మహీంద్రా జైలో ఎస్‌యూవీ స్థానాన్ని భర్తీ చేయనుంది.

Source: Team-BHP

Most Read Articles

English summary
Read In Telugu: New Mahindra TUV 300 Plus Details Leaked — Launch Expected Soon
Story first published: Wednesday, May 9, 2018, 9:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X