కొత్త స్విఫ్ట్: నెక్సా షోరూమ్‌లో కాదు అరెనా షోరూమ్‌లో లభ్యమవుతాయి

మారుతి సుజుకి సరికొత్త స్విఫ్ట్ విడుదలతో ప్యాసింజర్ మార్కెట్లో విజృంభించనుంది. ఇందుకు తగిన ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తోంది. మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ కారును అఫీషియల్ వెబ్‌సైట్లో చేర్చింది.

By Anil

Recommended Video

Minor Motorcycle Rider Caught For Not Having A License - The Climax Of The Video Will Surprise You - DriveSpark

మారుతి సుజుకి సరికొత్త స్విఫ్ట్ విడుదలతో ప్యాసింజర్ మార్కెట్లో విజృంభించనుంది. ఇందుకు తగిన ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తోంది. మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ కారును విడుదలకు ముందే అఫీషియల్ వెబ్‌సైట్లో చేర్చింది.

2018 మారుతి స్విఫ్ట్

కొత్త తరం స్విఫ్ట్ లభించే వేరియంట్లు, రంగులు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు ఇంకా వివరాలను పొందుపరిచింది. అంతే కాకుండా తమ స్విఫ్ట్ కారును కేవలం అరెనా విక్రయ కేంద్రాలలో మాత్రమే అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. దీని గురించిన కంప్లీట్ డిటైల్స్ చూద్దాం రండి...

2018 మారుతి స్విఫ్ట్

కొత్త తరం స్విఫ్ట్ లభించే వేరియంట్లు, రంగులు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు ఇంకా వివరాలను పొందుపరిచింది. అంతే కాకుండా తమ స్విఫ్ట్ కారును కేవలం అరెనా విక్రయ కేంద్రాలలో మాత్రమే అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. దీని గురించిన కంప్లీట్ డిటైల్స్ చూద్దాం రండి...

2018 మారుతి స్విఫ్ట్

మారుతి లైనప్‌‌లో ఈ నాలుగు కార్లు మినహా మిగిలిన అన్ని కార్లను దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉన్న అరెనా షోరూమ్‌లలో లభ్యమవుతాయి. మారుతి రెగ్యులర్ షోరూమ్‌లకే అరెనా పేరు పెట్టింది.

2018 మారుతి స్విఫ్ట్

అరెనా షోరూమ్‌ల ద్వారా లభ్యమవుతుండటంతో కొత్త తరం స్విఫ్ట్ దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రాంతాల ప్రజలకు సులభంగా అందుబాటులోకి రానుంది. దీంతో కొనుగోళ్లు కూడా విపరీతంగా పుంజుకోనున్నాయి.

2018 మారుతి స్విఫ్ట్

పాత స్విఫ్ట్‌తో పోల్చుకుంటే కొత్త తరం స్విఫ్ట్‌లో ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. ఫ్రంట్ ప్రొఫైల్‌లో అధునాతన ఫ్రంట్ గ్రిల్, సరికొత్త ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు అదే విధంగా సైడ్ మరియు రియర్ ప్రొఫైల్‌లో బాడీ డిజైన్ పరంగా స్పల్ప మార్పులు జరిగాయి.

2018 మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి అఫీషియల్ వెబ్‌సైట్లోకి న్యూ స్విఫ్ట్‌ను చేర్చింది. వెబ్‌సైట్ ప్రకారం, కొత్త స్విఫ్ట్ వెర్షన్‌లో ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, విఎక్స్ఐఏఎమ్‌టి, జడ్ఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ ఏఎమ్‌టి మరియు జడ్ఎక్స్ఐ ప్లస్

2018 మారుతి స్విఫ్ట్

అదే విధంగా మారుతి స్విఫ్ట్ డీజల్ వెర్షన్‌లో ఎల్‌డిఐ, విడిఐ, విడిఐ ఏఎమ్‌టి, జడ్‌డిఐ, జడ్‌డిఐ ఏఎమ్‌టి మరియు జడ్‌డిఐ ప్లస్ వేరియంట్లు ఉన్నాయి. పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్‌లు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు తొలిసారిగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యంకానున్నాయి.

2018 మారుతి స్విఫ్ట్

సాంకేతికంగా మారుతి స్విఫ్ట్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది. వీటిలో నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 81.8బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా నాలుగు సిలిండర్ల డిడిఐఎస్ డీజల్ ఇంజన్ 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 మారుతి స్విఫ్ట్

గ్లోబల్ మార్కెట్లో ఉన్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ తరహా ఇంటీరియర్‌ను ఇండియన్ వెర్షన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో మారుతి అందిస్తోంది. డ్యాష్ బోర్డ్ డిజైన్‌ను పూర్తిగా మార్చేసింది. అదనంగా ఫ్లాట్‌బాటమ్ స్టీరింగ్ వీల్, తాకేతెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆల్ బ్లాక్ అప్‌హోల్‌స్ట్రే ఉన్నాయి.

2018 మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి సరికొత్త స్విఫ్ట్ కారులో ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, స్మార్ట్ కీ, ఆటో హెడ్‌ల్యాంప్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రిక్ పవర్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ ఉన్నాయి.

2018 మారుతి స్విఫ్ట్

భద్రత పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఐఎస్ఒ ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి ఫీచర్లను అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా అందిస్తోంది.

2018 మారుతి స్విఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి సరికొత్త డిజైన్ భాషలో తమ మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫిబ్రవరి 2018లో లాంచ్ చేయనుంది. పాత స్విఫ్ట్‌తో పోల్చుకుంటే ప్రతి అంశం పరంగా కస్టమర్లను ఆశ్చర్యచకితుల్ని చేసే మార్పులను కొత్త తరం స్విఫ్ట్‌లో కల్పించింది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

More from DriveSpark

Article Published On: Saturday, January 20, 2018, 11:39 [IST]
English summary
Read In Telugu: New Maruti Swift Details Revealed — The 2018 Swift Is Finally Here!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+