2018 ఎడిషన్ మారుతి వితారా బ్రిజా విడుదలకు సర్వం సిద్దం

ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోతున్న యుటిలిటీ వాహనాలలో మారుతి సుజుకి వితారా బ్రిజా ఒకటి.

By Anil Kumar

ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోతున్న యుటిలిటీ వాహనాలలో మారుతి సుజుకి వితారా బ్రిజా ఒకటి. మారుతి వితారా బ్రిజా విపణిలోకి విడుదలైన అనతి కాలంలోనే భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా మొదటి స్థానంలో నిలిచింది.

2018 ఎడిషన్ మారుతి వితారా బ్రిజా విడుదలకు సర్వం సిద్దం

తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, మారుతి సుజుకి తమ 2018 ఎడిషన్ వితారా బ్రిజా ఎస్‌యూవీని స్వల్ప మార్పు చేర్పులతో విడుదల చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. మరి మీరు వితారా బ్రిజా కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా...? అయితే, 2018 ఎడిషన్ వితారా బ్రిజా మీద ఓ లుక్కేసుకోండి...

2018 ఎడిషన్ మారుతి వితారా బ్రిజా విడుదలకు సర్వం సిద్దం

రిపోర్ట్స్ మేరకు, 2018 మారుతి వితారా బ్రిజా అనేక సేఫ్టీ ఫీచర్లతో రానుంది. ప్రత్యేకించి ఎన్నో చిన్న కార్లలో సాధారణంగా వస్తున్న డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు వితారా బ్రిజా లభించే అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా రానున్నాయి.

2018 ఎడిషన్ మారుతి వితారా బ్రిజా విడుదలకు సర్వం సిద్దం

వితారా బ్రిజా ఎంట్రీ లెవల్ మరియు మిడ్ రేంజ్ వేరియంట్లలో ఎయిర్ బ్యాగులు మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందిస్తుండటంతో వితారా బ్రిజా ఆప్షనల్ ఎల్‌డిఐ(ఒ) మరియు విడిఐ(ఒ) వేరియంట్లను మార్కెట్ నుండి తొలగించే అవకాశం ఉంది.

2018 ఎడిషన్ మారుతి వితారా బ్రిజా విడుదలకు సర్వం సిద్దం

2018 మారుతి సుజుకి వితారా బ్రిజా జడ్‌డిఐ మరియు జడ్‌డిఐ(ఒ) టాప్ ఎండ్ వేరియంట్లలో బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్న మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఎస్‌యూవీకి స్పోర్టివ్ లుక్ తీసుకొచ్చాయి. వీల్స్ మినహాయిస్తే, వితారా బ్రిజాలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

2018 ఎడిషన్ మారుతి వితారా బ్రిజా విడుదలకు సర్వం సిద్దం

అంతే కాకుండా మారుతి సుజుకి వితారా బ్రిజాలో నూతన కలర్ కాంబినేషన్ పరిచయం చేసే అవకాశం ఉంది. 2018 ఎడిషన్‌లో అప్‌డేట్స్ కేవలం ఎక్ట్సీరియర్‌ డిజైన్‌కు మాత్రమే పరిమితమయ్యాయి. ఇంజన్ మరియు సాంకేతికంగా ఎలాంటి మార్పులు జరగలేదు.

2018 ఎడిషన్ మారుతి వితారా బ్రిజా విడుదలకు సర్వం సిద్దం

సాంకేతికంగా 2018 మారుతి సుజుకి వితారా బ్రిజాలో 1.3-లీటర్ కెపాసిటి గల డిడిఐఎస్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 89బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి అతి త్వరలో వితారా బ్రిజాను పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లాంచ్ చేయాలని భావించింది. అయితే, ఈ 2018 ఎడిషన్ అప్‌డేట్‌లో ఈ రెండు మిస్సయ్యాయి.

2018 ఎడిషన్ మారుతి వితారా బ్రిజా విడుదలకు సర్వం సిద్దం

భద్రత పరంగా మరియు పలు ఇతర ఫీచర్ల జోడింపుతో 2018 మారుతి వితారా బ్రిజా ధరలు పెరిగాయి. వితారా బ్రిజా ఎల్‌డిఐ వేరియంట్ మీద రూ. 12,500 ధర పెరిగితే, విడిఐ వేరియంట్ మీద రూ. 8,500 వరకు ధర తక్కింది. టాప్ ఎండ్ వేరియంట్ జడ్‌డిఐ మీద రూ. 5,500 పెరిగింది.

2018 ఎడిషన్ మారుతి వితారా బ్రిజా విడుదలకు సర్వం సిద్దం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వితారా బ్రిజాను కాస్మొటిక్ అప్‌డేట్స్ మరియు డ్యూయల్ ఫ్రంట్ బ్యాగులు అదే విధంగా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. కానీ ఇందులో పెట్రోల్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రాలేకపోయాయి.

విపణిలో ఉన్న టాటా నెక్సాన్ మరియు ఫోర్డ్ ఇకోస్పోర్ట్‌ ఎస్‌యూవీలకు పోటీగా మారుతి సుజుకి అతి త్వరలో పెట్రోల్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ గల వితారా బ్రిజాను లాంచ్ చేయనుంది.

More from DriveSpark

Article Published On: Monday, May 7, 2018, 16:40 [IST]
English summary
Read In Telugu: 2018 Maruti Vitara Brezza Launch Soon — To Get New Colour And Standard Safety Features.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+