మినీ కంట్రీమ్యాన్ విడుదల: ధర రూ. 34.9 లక్షలు
మినీ ఇండియన్ మార్కెట్లోకి మినీ కంట్రీమ్యాన్ కారును లాంచ్ చేసింది. సరికొత్త 2018 మినీ కంట్రీమ్యాన్ ధర రూ. 34.9 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. సరికొత్త మినీ కంట్రీమ్యాన్ కారును తొలుత ఆటో ఎక్స్ పో 2
బిఎమ్‌డబ్ల్యూ గ్రూపుకు చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ ఇండియన్ మార్కెట్లోకి 2018 కంట్రీమ్యాన్ కారును లాంచ్ చేసింది. సరికొత్త 2018 మినీ కంట్రీమ్యాన్ ధర రూ. 34.9 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. సరికొత్త మినీ కంట్రీమ్యాన్ కారును తొలుత ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది.

చెన్నైలోని బిఎమ్‌డబ్ల్యూ ప్రొడక్షన్ ప్లాంటులో ఇప్పటికే మినీ కంట్రీమ్యాన్ కారు ఉత్పత్తిని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని అధీకృత డీలర్ల వద్ద బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. మినీ కంట్రీమ్యాన్ డెలివరీలను జూన్ నుండి ప్రారంభించనున్నారు.

మినీ కంట్రీమ్యాన్ మూడు విభిన్న వేరియంట్లలో లభ్యం కానుంది. అవి, కూపర్ ఎస్, కూపర్ ఎస్‌జెడబ్ల్యూ ఇన్‌స్పైర్డ్ మరియు కూపర్ ఎస్‌డి. అన్ని వేరియంట్ల ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
| Variants | Price |
| Cooper S (Petrol) | Rs 34.9 Lakh |
| Cooper SD (Diesel) | Rs 37.4 Lakh |
| Cooper S JCW Inspired (Petrol) | Rs 41.4 Lakh |

మినీ కంట్రీమ్యాన్ కూపర్ ఎస్ మరియు కూపర్ ఎస్‌జెడబ్ల్యూ ఇన్‌స్పైర్డ్ మోడళ్లలో 2.0-లీటర్ కెపాసిటి గల ట్విన్ పవర్ టుర్బో నాలుగు-సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ గరిష్టంగా 190బిహెచ్‌పి పవర్ మరియు 280ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

అదే విధంగా, మినీ కంట్రీమ్యాన్ కూపర్ ఎస్‌డి వేరియంట్లో 2.0-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. ఇది, 188బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అన్ని వేరియంట్లలోనే, అన్ని రకాల ఇంజన్ ఆప్షన్‌లు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యమవుతున్నాయి

సరికొత్త మినీ కంట్రీమ్యాన్ కారులో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా స్పల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకించి అతి ముఖ్యమైన ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ఫాగ్ ల్యాంప్స్, రీడిజైన్ చేయబడిన బంపర్, సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, ముందు మరియు వెనుక వైపున స్కిడ్ ప్లేట్లు, ఎల్ఇడి లైట్లు మరియు ఎగ్జాస్ట్ పైపులు వంటి ఫీచర్లు వచ్చాయి.

మినీ కంట్రీమ్యాన్ ఇంటీరియర్‌లో మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ ప్యాసింజర్ మరియు డ్రైవర్ కోసం స్పోర్ట్స్ సీట్లు, టు-జోన్ ఆటోమేటిక్ ఎయిర్ కండీషనింగ్ మరియు లెథర్ స్టీరింగ్ వీల్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

సరికొత్త 2018 మినీ కంట్రీమ్యాన్ విపణిలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ, ఆడి క్యూ3 మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 వంటి ఎంట్రీ లెవల్ లగ్జరీ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మినీ కార్ల లైనప్‌లో సెడాన్, హ్యాచ్‌బ్యాక్ మరియు ఎస్‌యూవీ కాకుండా కేవలం ఒకే డిజైన్ శైలిలో ఉండే కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. అత్యుత్తమ రైడింగ్ అనుభవాన్ని కల్పించే మినీ కార్లు చిన్న స్థాయి ఎస్‌యూవీలు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మినీ కంట్రీమ్యాన్ నిజానికి ఎస్‌యూవీ కూడా కాదు, క్రాసోవర్ అని చెప్పవచ్చు. ఖరీదైన మార్కెట్లో శక్తివంతమైన, లగ్జరీ ఫీచర్లు ఉన్న సింపుల్ కారును ఎంచుకునేవారికి మినీ కంట్రీమ్యాన్ చక్కగా సెట్ అవుతుందని చెప్పవచ్చు.
మరి కార్ల లైనప్‌లో బాగా ప్రాచుర్యం పొందిన కూపర్ మరియు కంట్రీమ్యాన్ వీటిలో మీకు నచ్చిన మోడల్ ఏది?


Click it and Unblock the Notifications








