రెనో క్రాసోవర్ ఎస్‌యూవీ టీజర్ ఫోటో రివీల్
రెనో తమ అప్‌కమింగ్ క్రాసోవర్ ఎస్‌యూవీ టీజర్ ఫోటోను రివీల్ చేసింది. సరికొత్త క్రాసోవర్ ఎస్‌యూవీ పేరును రెనో ఇంకా ఖరారు చేయలేదు. రెనో దీనిని ఆగష్టులో జరగబోయే 2018 మాస్కో ఇంటర్నేషనల్ మోటార్ షోలో ఆవిష్కరి
ఫ్రెంచ్‌కు చెందిన ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో తమ అప్‌కమింగ్ క్రాసోవర్ ఎస్‌యూవీ టీజర్ ఫోటోను రివీల్ చేసింది. సరికొత్త క్రాసోవర్ ఎస్‌యూవీ పేరును రెనో ఇంకా ఖరారు చేయలేదు. రెనో దీనిని ఆగష్టులో జరగబోయే 2018 మాస్కో ఇంటర్నేషనల్ మోటార్ షోలో ఆవిష్కరించనున్నట్లు తెలిసింది.

ఈ అప్‌కమింగ్ క్రాసోవర్ ఎస్‌యూవీ ఇండియా వంటి అభివృద్ది చెందుతున్న మార్కెట్లలో అమ్ముడవుతున్న రెనో క్యాప్చర్ క్రాసోవర్ మోడల్‌కు చాలా దగ్గరగా ఉంటుందని తెలిసింది. అంతే కాకుండా దీనిని రెనో ఎమ్‌ఓ ఫ్లాట్‌పామ్ మీద నిర్మిస్తున్నట్లు సమాచారం. కాబట్టి క్యాప్చర్ మరియు డస్టర్ ఎస్‌యూవీల లక్షణాలతో వచ్చే అవకాశం ఉంది.

రెనో రివీల్ చేసిన టీజర్ ఫోటోలో క్రాసోవర్ ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్‌ను గమనించవచ్చు. పేరు ఇంకా ఖరారు చేయని ఈ ఎస్‌యూవీలో పలుచటి హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు అగ్రెసివ్ డిజైన్ శైలిలో ఉన్న ఫ్రంట్ బంపర్ వంటివి ఉన్నాయి.

రెనో అప్‌కమింగ్ క్రాసోవర్ ఎస్‌యూవీ ఓవరాల్ డిజైన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. రెనో ఈ ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తో ఇది విడుదలయ్యే మొదటి మార్కెట్ రష్యా. దీనిని మాస్కో లోని ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేసి, తరువాత లెఫ్ట్-హ్యాండ్-డ్రైవ్ ఉన్న దేశాలకు ఎగుమతి చేయనుంది.

చైనా వంటి మార్కెట్లలో సిఎమ్ఎఫ్-బి ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన క్రాసోవర్ ఎస్‌యూవీని పరిచయం చేయనుంది. ఇది క్యాప్చర్ ఎస్‌యూవీకి ఖరీదైన ప్రత్యామ్నాయంగా నిలవనుంది. అంతే కాకుండా డస్టర్ తరహా ఆధారిత డాసియా బ్రాండ్ క్రింద కూడా దీనిని పరిచయం చేసే ఛాన్స్ ఉంది.

తక్కువ ధరలో అందించేందుకు ఈ నూతన క్రాసోవర్ ఎస్‌యీవీ ఇంటీరియర్‌ను క్యాప్చర్ నుండి సేకరించినున్నట్లు సమాచారం. ఇండియాలో క్రాసోవర్ సెగ్మెంట్లోకి పరిచయమైన క్యాప్చర్ ఎస్‌యూవీ ప్రియులను ఆకట్టుకోలేకపోయింది. కాబట్టి కనీసం ఈ మోడల్‌లోనైనా ఎస్‌యూవీ లక్షణాలను జోడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
రెనో టీజ్ చేసిన సరికొత్త క్రాసోవర్ ఎస్‌యూవీ కంపెనీ యొక్క ప్రీమియం ఉత్పత్తి. పేరుకి కొత్తదే అయినప్పటికీ చాలా అంశాల వరకు క్యాప్చర్ శైలిలోనే ఉండనుంది. కానీ ఓవరాల్ ఎక్ట్సీరియర్ డిజైన్ క్యాప్తర్ కంటే ప్రీమియంగా ఉంటుంది. రెనో ఇంటర్నేషనల్ లైనప్‌లో విలాసవంతమైన మోడల్‌గా దీనిని చెప్పుకోవచ్చు. తాజాగా అందుతున్న సమచారం మేరకు, మాస్కోలో ఈ ఆగష్టున జరగబోయే 2018 మాస్కో ఇంటర్నేషనల్ మోటార్ షోలో ఆవిష్కరించనున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications








