రెనో క్విడ్ 2018 ఎడిషన్ విడుదల: ధర, ఇంజన్, వేరియంట్లు, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

రెనో నేడు విపణిలోకి సరికొత్త 2018 క్విడ్ కారును విడుదల చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. పలు రకాల నూతన ఫీచర్లతో పరిచయమైన 2018 రెనో క్విడ్ ప్రారంభ ధర రూ. 2.66 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

By N Kumar

ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో నేడు విపణిలోకి సరికొత్త 2018 క్విడ్ కారును విడుదల చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. పలు రకాల నూతన ఫీచర్లతో పరిచయమైన 2018 రెనో క్విడ్ ప్రారంభ ధర రూ. 2.66 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

రెనో క్విడ్ 2018 ఎడిషన్

సరికొత్త రెనో క్విడ్ కారుకు అన్ని వైపులా డిజైన్ పరంగా పలు అప్‌డేట్స్ జరిగాయి. ఫ్రంట్ హెడ్‌ల్యాంప్స్‌లో సి-ఆకారంలో ఉన్న రెనో సిగ్నేచర్ లైటింగ్ ఉంటుంది. సరికొత్త రేజర్ షార్ప్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, దీనికి మధ్యలో రెనో లోగో వచ్చింది. ఫాగ్ ల్యాంప్స్, ఫుల్ వీల్ కవర్స్ మరియు బాడీ కలర్ బంపర్లు ఉన్నాయి.

రెనో క్విడ్ 2018 ఎడిషన్

2018 ఎడిషన్‌లో విడుదలైన రెనో క్విడ్ మొత్తం ఎనిమిది విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. వేరియంట్ల వారీగా 2018 రెనో క్విడ్ ధరలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

Kwid 2018 Range Price (ex-showroom, New Delhi)
Standard - 0.8L SCe Rs 266,700
RXE - 0.8L SCe Rs 309,800
RXL - 0.8L SCe Rs 335,900
RXT-O (MT) - 0.8L SCe Rs 382,500
RXT-O (MT) - 1.0 L SCe Rs 404,500
RXT-O- (AMT) - 1.0 L SCe Rs 434,500
KWID Climber MT- 1.0 L SCe Rs 429,500
KWID Climber AMT- 1.0 L SCe Rs 459,500
రెనో క్విడ్ 2018 ఎడిషన్

రెనో ఇండియా సీఈఓ మరియు మేనేజింగ్ డైరక్టర్ సుమిత్ సాహ్నే మాట్లాడుతూ, "2.5 లక్షల కస్టమర్లతో రెనో క్విడ్ ఓ సుస్థిరమైన స్థానాన్ని పధిలం చేసుకుంది. నిరంతరం వస్తున్న స్పందనకు అనుగుణంగా కస్టమర్లకు కొత్తదనాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు క్విడ్‌లో మార్పులు చేర్పులు నిర్వహిస్తున్నట్లు తెలిపాడు."

రెనో క్విడ్ 2018 ఎడిషన్

"ఈసారి 2018 రెనో క్విడ్ కారును డిజైన్ మరియు ఇంటీరియర్ పరంగా పలు మార్పులు నిర్వహించాము. దీంతో రెనో క్విడ్ ఫ్యామిలీలోకి మరింత వచ్చి చేరనున్నారు. ఈ 2018 ఎడిషన్ క్విడ్ కంపెనీ యొక్క విజయాన్ని యథావిధిగా కొనసాగిస్తుందని చెప్పుకొచ్చాడు."

రెనో క్విడ్ 2018 ఎడిషన్

2018 రెనో క్విడ్ కారులో ఎన్నో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు పరిచయం అయ్యాయి. ఇంటిగ్రేటెడ్ రివర్స్ పార్కింగ్ కెమెరా, రియర్ ఆర్మ్ రెస్ట్ మరియు రియర్ సీట్ ప్యాసింజర్ల కోసం 12వోల్ట్స్ ఛార్జింగ్ సాకెట్ ఉన్నాయి.

రెనో క్విడ్ 2018 ఎడిషన్

2018 రెనో క్విడ్‌లో ఇతర ఫీచర్లు అయిన, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ న్యావిగేషన్, డిజిటిల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, లేనే చేంజ్ ఇండికేటర్ మరియు లోడ్ లిమిటర్లు గల సీట్ బెల్ట్ ప్రి-టెన్షనర్లు వంటివి ఉన్నాయి.

రెనో క్విడ్ 2018 ఎడిషన్

రెనో క్విడ్ టాప్ ఎండ్ వేరియంట్లో పవర్ స్టీరింగ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, త్రీ అండ్ ఫోర్ స్పీడ్ మ్యాన్యువల్ ఏసి, పవర్ విండోస్, ట్రాఫిక్ అసిస్ట్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ మరియు రియర్ ఎమర్జెన్సీ లాకింగ్ రిట్రాక్టర్ వంటివి ఫీచర్లు ఉన్నాయి.

రెనో క్విడ్ 2018 ఎడిషన్

2018 రెనో క్విడ్ సాంకేతికంగా అవే మునుపటి పెట్రోల్ ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది. 800సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ 52బిహెచ్‌పి పవర్ మరియు 72ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రెనో క్విడ్ 2018 ఎడిషన్

అదే విధంగా, 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్‌లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌‌బాక్స్ అనుసంధానంతో లభ్యమవుతున్నాయి.

రెనో క్విడ్ 2018 ఎడిషన్

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెనో క్విడ్ ఫ్రెంచ్ దిగ్గజానికి అత్యంత కీలకమైన మోడల్, ప్రస్తుతం రెనో ఇండియాకు అత్యధిక విక్రయాలు సాధించిపెడుతున్న మోడల్ కూడా ఇదే. ఇప్పటి వరకు 2,50,000 యూనిట్ల క్విడ్ కార్లు రోడ్డెక్కాయి. క్విడ్ మీద వస్తోన్న ట్రెండ్ యథావిధిగా కొనసాగించడానికి 2018 ఎడిషన్‌లో క్విడ్ మోడల్‌ను లాంచ్ చేశారు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 1, 2018, 16:00 [IST]
English summary
Read In Telugu: 2018 Renault Kwid Launched In India; Prices Start At Rs 2.66 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+