వోల్వ్ ఎక్స్‌సి40 ఎస్‌యూవీ మీద బుకింగ్స్ ప్రారంభం

వోల్వో ఇండియా విభాగం జూలై 4, 2018 న తమ సరికొత్త ఎక్స్‌సి40 (Volvo XC40) ఎస్‌యూవీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా, వోల్వో ఇండియా ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ ఎక్స్‌సి40 మీద బుకింగ్స్ కూడా ఆహ

By Anil Kumar

స్వీడిష్ దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియా విభాగం జూలై 4, 2018 న తమ సరికొత్త ఎక్స్‌సి40 (Volvo XC40) ఎస్‌యూవీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా, వోల్వో ఇండియా ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ ఎక్స్‌సి40 మీద బుకింగ్స్ కూడా ఆహ్వానించింది.

వోల్వ్ ఎక్స్‌సి40 మీద బుకింగ్స్ ప్రారంభం

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వోల్వో అధీకృత డీలర్ల వద్ద రూ. 5 లక్షల రుపాయల బుకింగ్ మొత్తంతో వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీ మీద బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే, విడుదలకు ముందు కేవలం 200 యూనిట్లకు మాత్రమే బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి.

వోల్వ్ ఎక్స్‌సి40 మీద బుకింగ్స్ ప్రారంభం

వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీ ఒక్కసారి విడుదలైతే, దేశీయంగా ఉన్న ఎక్స్‌సి60 ఎస్‌యూవీ క్రింది స్థానాన్ని భర్తీ చేస్తుంది. వోల్వో డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా ఎక్స్‌సి60 మరియు ఎక్స్‌సి90 ఎస్‌యూవీల తరహాలోనే ఎక్స్‌సి40 డిజైన్ ఉంటుంది.

వోల్వ్ ఎక్స్‌సి40 మీద బుకింగ్స్ ప్రారంభం

వోల్వో వారి కాంపాక్ట్ మోడ్యులర్ ఆర్కిటెక్చర్(CMA) ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా ఎక్స్‌సి40 ఎస్‌యూవీని నిర్మించింది. ఈ సెగ్మెంట్లో సెమీ-అటానమస్ డ్రైవింగ్ ఫీచర్లతో వస్తున్న మొదటి మోడల్ వోల్వో ఎక్స్‌సి40.

వోల్వ్ ఎక్స్‌సి40 మీద బుకింగ్స్ ప్రారంభం

వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీలో లేన్-కీప్ అసిస్ట్, పైలట్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, మరియు ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఎన్నో అధునాతన సెమీ-అటానమస్ ఫీచర్లు ఉన్నాయి.

వోల్వ్ ఎక్స్‌సి40 మీద బుకింగ్స్ ప్రారంభం

వోల్వో ఎక్స్‌సి40 తొలి బ్యాచ్‌ను పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకుని విక్రయించనుంది. అందులో కూడా టాప్ ఎండ్ వేరియంట్ ఆర్-డిజైన్ ఆప్షన్‌లో మాత్రమే లభించనుంది. సేఫ్టీ పరంగా వోల్వో ఎక్స్‌సి40లో హిల్ స్టార్ట్ మరియు డిసెండ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగాం వంటివి ఉన్నాయి.

వోల్వ్ ఎక్స్‌సి40 మీద బుకింగ్స్ ప్రారంభం

వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీలో ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, పానరోమిక్ సన్‌రూఫ్, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్ సపోర్ట్ గల స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి, వైర్‌లెస్ ఛార్జింగ్, పవర్ టెయిల్ గేట్ మరియు మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఎన్నో అదనపు ఫీచర్లు ఉన్నాయి.

వోల్వ్ ఎక్స్‌సి40 మీద బుకింగ్స్ ప్రారంభం

సాంకేతికంగా వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీలో 2.0-లీటర్ల కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. ఇంజన్ ఉత్పత్తి చేసే 190బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ 8-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం నుండి స్టాండర్డ్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

వోల్వ్ ఎక్స్‌సి40 మీద బుకింగ్స్ ప్రారంభం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీ ఒక్కసారి విడుదలైతే, విపణిలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, ఆడి క్యూ3 మరియు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది. వోల్వో ఎక్స్‌సి40 ధరల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు, అయితే పోటీదారులను దృష్టిలో ఉంచుకుని అత్యంత చాకచక్యంగా నిర్ణయించే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 30, 2018, 13:37 [IST]
English summary
Read In Telugu: New 2018 Volvo XC40 India Bookings Started — Launch Details Revealed
Read more on: #volvo #వోల్వో
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+