TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
నిస్సాన్ మరియు డాట్సన్ కార్లు ఇప్పుడు మరింత ప్రియం
నిస్సాన్ మరియు డాట్సన్ రెండు కంపెనీల కార్ల మీద ధరలు పెంచినట్లు నిస్సాన్ ఇండియా ప్రకటించింది. నిస్సాన్-డాట్సన్ కార్ల మీద గరిష్టంగా రెండు శాతం మేర ధరలు పెరిగాయి. ధరల పెంపు అనంతరం సవరించబడిన నూతన ధరలు ఏప్రిల్ 1, 2018 నుండి అమల్లోకి వస్తాయి.
పెట్టుబడి ఖర్చులు పెరిగినందున్న నిస్సాన్ ఇండియా లైనప్‌లో లభించే అన్ని కార్ల మీద ధరలు పెంచింది. తయారీ భారాన్ని సమతుల్యం చేయడానికి స్వల్ప మేర ధరల పెంపు తప్పడంలేదని నిస్సాన్ పేర్కొంది.
నిస్సాన్ ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతానికి మైక్రా హ్యాచ్‌బ్యాక్, సన్నీ సెడాన్ మరియు టెర్రానో కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్యాసింజర్ వాహనాలను విక్రయిస్తోంది. అదే విధంగా నిస్సాన్ ఇండియా భాగస్వామ్యపు సంస్థ డాట్సన్ గో మరియు రెడి-గో హ్యాచ్‌బ్యాక్ కార్లను అదే విధంగా గో ప్లస్ కాంపాక్ట్ ఫ్యామిలీ వ్యాగన్ కారును విక్రయిస్తోంది.
చివరిసారిగా, 2018 ఏడాది ప్రారంభంలో వివిధ మోడళ్ల ఆధారంగా గరిష్టంగా 15,000 రుపాయల వరకు ధరలు పెంచింది. పెట్టుబడి వ్యయం పెరగడం మరియు ముడి సరుకుల ధరలు పెరగడం అప్పట్లో ధరలు పెంచడానికి గల కారణమని నిస్సాన్ వివరించింది.


నిస్సాన్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ జెరోమ్ సైగట్ మాట్లాడుతూ, "పెట్టుబడి ఖర్చులు పెరగడంతో అన్ని మోడళ్ల మీద ధరల పెంపు చేపట్టాము. ఈ నూతన ధరలు ఏప్రిల్ 1, 2018 నుండి దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్ మరియు డాట్సన్ షోరూమ్‌ల ద్వారా అమల్లోకి వస్తాయని చెప్పుకొచ్చాడు."
నిస్సాన్ మాత్రమే కాదు, టాటా మోటార్స్ మరియు ఆడి ఇండియా కూడా దేశీయంగా విక్రయించే అన్ని కార్ల మీద వివిధ మోడల్ ఆధారంగా ధరలను పెంచాయి. సవరించిన కొత్త ధరలను ఏప్రిల్ 1, 2018 నుండి అమల్లోకి వస్తాయి. దిగుమతి వ్యయం పెరగడంతో ధరలు పెంచినట్లు ఆడి ఇండియా పేర్కొంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం నిస్సాన్ ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సార్లు ధరలు పెంపు చేపట్టింది. కొద్దిమేర మాత్రమే పెంచినప్పటికీ, ఈ ధరలు పెంపు ప్రభావం కార్ల విక్రయాల మీద పడే అవకాశం ఉంది. దేశీయ దిగ్గజం టాటా కూడా ధరలు పెంచడంతో మిగతా కంపెనీలు కూడా ఇదే బాటలో ధరలు పెంచడానికి సిద్దమయ్యాయి.
1. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్రిస్టల్ ఎడిషన్
2.భారీగా ధరలు పెంచిన టాటా మోటార్స్
3.2018 ట్రయంప్ టైగర్ 800 విడుదల: ధర రూ. 11.76 లక్షలు
4. మీ బైక్ మంచి మైలేజ్ ఇవ్వాలంటే చేయాల్సినవి మరియు చేయకూడనివి
5.ఈ ఎండాకాలంలో, మీ కారు ఏ/సి ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే ఇలా చేయండి!!