హ్యుందాయ్ క్రెటాకు పోటీగా వస్తోన్న నిస్సాన్ కిక్స్

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం నిస్సాన్ సరికొత్త కిక్స్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. తాజాగా అందిన సమాచారం మేరకు, ఇండియన్ వెర్షన్ నిస్సాన్ కిక్స్ ఎస్

By Anil Kumar

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం నిస్సాన్ సరికొత్త కిక్స్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. తాజాగా అందిన సమాచారం మేరకు, ఇండియన్ వెర్షన్ నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ, భారతీయు రోడ్లకు అనుగుణంగా జనవరి 2019లో విడుదలవుతున్నట్లు తెలిసింది.

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీకి గట్టి పోటీనివ్వనున్న నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలు...

హ్యుందాయ్ క్రెటాకు పోటీగా వస్తోన్న నిస్సాన్ కిక్స్

నిస్సాన్ కిక్స్ అత్యంత విశాలమైన క్యాబిన్ మరియు అధునాతన కనెక్టివిటి ఫీచర్లతో వస్తోంది. సాంకేతికంగా పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. అయితే, నిస్సాన్ కిక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ గురింటి ఎలాంటి సమాచారం లేదు.

హ్యుందాయ్ క్రెటాకు పోటీగా వస్తోన్న నిస్సాన్ కిక్స్

నిస్సాన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డిజైన్ డైరక్టర్, అల్ఫాన్సో అల్బాసియా మాట్లాడుతూ, "ఇండియన్ వెర్షన్ నిక్సాన్ కిక్స్ ఎస్‌యూవీ ఇంటర్నేషనల్ మోడల్‌తో పోల్చుకుంటే చాలా విభన్నంగా ఉంటుంది. ఇండియన్ కస్టమర్ల కోసం విశాసమైన క్యాబిన్, పెద్ద పరిమాణంలో ఉన్న బాడీ అదే విధంగా అత్యాధుక ఫీచర్లతో ప్రవేశపెడుతున్నట్లు తెలిపాడు"

హ్యుందాయ్ క్రెటాకు పోటీగా వస్తోన్న నిస్సాన్ కిక్స్

దేశీయ మార్కెట్లో జపాన్ దిగ్గజం నిస్సాన్ కంపెనీకి అత్యంత ముఖమైన మోడల్‌గా నిలవనుంది. నిస్సాన్ కిక్స్ పూర్తి స్థాయిలో విడుదలైతే, విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా, రెనో డస్టర్ మరియు మహీంద్రా స్కార్పియో వంటి మోడళ్ల నోరు మూయించనుంది.

హ్యుందాయ్ క్రెటాకు పోటీగా వస్తోన్న నిస్సాన్ కిక్స్

సాంకేతికంగా నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీలో 1.5-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు రానున్నాయి. పెట్రోల్ యూనిట్ 104బిహెచ్‌పి-142ఎన్ఎమ్ అదే విధంగా, డీజల్ యూనిట్ 108బిహెచ్‌పి-240ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి.

హ్యుందాయ్ క్రెటాకు పోటీగా వస్తోన్న నిస్సాన్ కిక్స్

తొలుత నిస్సాన్ కిక్స్ పెట్రోల్ వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, అదే విధంగా డీజల్ వేరియంట్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యం కానున్నాయి. బహుశా మలి దశలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ విడుదల చేయవచ్చు. అంతర్జాతీయ విపణిలో ఉన్న ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ఇండియన్ వెర్షన్‌ కిక్స్‌లలో మిస్సయ్యే అవకాశం ఉంది.

హ్యుందాయ్ క్రెటాకు పోటీగా వస్తోన్న నిస్సాన్ కిక్స్

కిక్స్ ఎస్‌యూవీ నిస్సాన్ ఇండియాకు అత్యంత కీలకమైన ఉత్పత్తి, దేశీయ మార్కెట్లో తననితాను నిరూపించుకోవడానికి ఉన్న ఏకైక ఆప్షన్ నిస్సాన్ కిక్స్ మాత్రమే. ప్రపంచ శ్రేణి నాణ్యత, అత్యుత్త నిర్మాణ విలువలు, అత్యాధునిక ఫీచర్లతో ఇండియన్ కస్టమర్లను ఆకట్టుకోవడానికి నిస్సాన్ ప్రయత్నిస్తోంది. నిస్సాన్ కిక్స్ ధరల శ్రేణి రూ. 11 లక్షల నుండి రూ. 16 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు.

Source: CarandBike

Most Read Articles

English summary
Read In Telugu: Nissan Kicks To Be Launched In India In 2019 — To Rival Hyundai Creta
Story first published: Saturday, August 4, 2018, 15:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X