ఘోర ప్రమాదానికి గురైన నిస్సాన్ మైక్రా - ఘటనా స్థలిలోనే ఐదుగురు దుర్మరణం
మూడు వాహనాల మధ్య జరిగిన విషాద ప్రమాదంలో ముగ్గురు సీఆర్ఎఫ్ జవాన్లతో సహా మొత్తం ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్-పిండ్వారా మార్గంలో జాతీయ రహదారి-76 మీద రెండు మూడు వాహనాల మధ్య ఈ
మూడు వాహనాల మధ్య జరిగిన విషాద ప్రమాదంలో ముగ్గురు సీఆర్ఎఫ్ జవాన్లతో సహా మొత్తం ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్-పిండ్వారా మార్గంలో జాతీయ రహదారి-76 మీద రెండు మూడు వాహనాల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

రాజస్థాన్లోని జాతీయ రహదారి-76 మీద ట్రాలీ గల లారీ, ట్రక్కు మరియు నిస్సాన్ కార్లు ఒకే ప్రమాదానికి గురయ్యాయి. వేగంగా వెళుతున్న లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యి ఎదురుగా వెళుతున్న సీఆర్పీఎఫ్ ట్రక్కును ఢీకొట్టింది.

వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో సీఆర్పీఎఫ్ ట్రక్కును డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో అదుపుతప్పిన ట్రక్కు రోడ్డు ప్రక్కనే ఉన్న బ్యారీయర్‌ను ఢీకొట్టి 25 అడుగుల లోతున్న నీటి ప్రవాహంలేని నదిలోకి పడిపోయింది.

బ్రేకులు ఫెయిల్ అయిన లారీ కూడా అదుపుతప్పి రోడ్డు అవతలి వైపుకు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న రెడ్ కలర్ నిస్సాన్ మైక్రా కారును బలంగా ఢీకొట్టి, అంతటితో ఆగకుండా మైక్రా కారును రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్లింది.

నిస్సాన్ మైక్రా కారుకు అనుకోకుండా ఎదురైన ఈ ఘటనతో డ్రైవర్‌తో సహా కారులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడిడక్కడే మరణించారు. లారీ వెనుక చక్రాలు ఊడిపోవడండో ఇంజన్ రోడ్డుకు రాసుకుని మంటలు చెలరేగాయి. దాంతో లారీ మొత్తానికి మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయింది.

ప్రమాదం విషయం తెలుసుకున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి అంబులెన్స్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. మూడు వాహనాలు ఒకే ప్రమాదానికి గురికావడంతో ప్రమాద శకలాలు రోడ్డు మొత్తం చెల్లాచెదురుగా పడిపోయాయి.

లారీ డ్రైవర్ నరేంద్ర సింగ్ ఘటనా స్థలిలోనే మృతి చెందగా, తీవ్ర గాయాలైన కో-డ్రైవర్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం ఉదయ్‌పూర్‌కు తరలించారు. సహాయక సిబ్బంది మరియు సమీప గ్రామస్థులు సుమారుగా గంటలు పాటు శ్రమించి వాహనాలలో చిక్కుకున్న వారిని వెలికితీశారు.

ఈ ప్రమాదంలో నిస్సాన్ మైక్రా గుర్తుపట్టడానికి వీల్లేకుండా నుజ్జునుజ్జయిపోయింది. లారీ మొత్తం మంటల్లో కాలిపోయింది. నదిలో పడిపోయిన సీఆర్పీఎఫ్ ట్రక్కు టాప్ మొత్తం ఊడిపోయింది.
Source: Source: Rushlane


Click it and Unblock the Notifications








