ఆ మూడు కార్ల మీద భారీ డిస్కౌంట్ ప్రకటించిన నిస్సాన్

నిస్సాన్ ఇండియా విభాగం దేశీయంగా విక్రయిస్తున్న తమ ప్యాసింజర్ కార్ల మీద ఆగష్టు 2018 డిస్కౌంట్లలో భాగంగా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. విపణిలో ఉన్న నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌లోని యాక్టివా మరియు

By Anil Kumar

నిస్సాన్ ఇండియా విభాగం దేశీయంగా విక్రయిస్తున్న తమ ప్యాసింజర్ కార్ల మీద ఆగష్టు 2018 డిస్కౌంట్లలో భాగంగా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. విపణిలో ఉన్న నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌లోని యాక్టివా మరియు రెగ్యులర్ వేరియంట్లు, సన్నీ సెడాన్ మరియు టెర్రానో ఎస్‌యూవీ భారీ తగ్గింపు మరియు డిస్కౌంట్లతో ఎంచుకోవచ్చు.

ఏయే మోడల్ మీద ఎలాంటి ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ఉన్నాయో చూద్దాం రండి...

నిస్సాన్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

నిస్సాన్ ఇండియా సేల్స్ పెంచుకునేందుకు తమ అన్ని మోడళ్లలోని అన్ని వేరియంట్ల మీద రూ. 50,000 నుండి రూ. 1 లక్ష రుపాయల వరకు డిస్కౌంట్లను పరిచయం చేసింది. అయితే, ఈ ఆఫర్లు ఆగష్టు 2018 లోపు కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి.

నిస్సాన్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

నిస్సాన్ మైక్రా యాక్టివా హ్యాచ్‌బ్యాక్ ధరల శ్రేణి రూ. 5.03 లక్షల నుండి రూ. 5.98 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉంది. నిస్సాన్ మైక్రా మీద రూ. 20,000 విలువైన ఉచిత ఇన్సూరెన్స్, రూ. 10,000 విలువైన డిస్కౌంట్ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 5,000 డిస్కౌంట్ లభిస్తోంది. మరియు రూ. 15,000 విలువైన తగ్గించబడిన 7.99 శాతం వడ్డీ రేటుతో లభిస్తోంది. యాక్టివా మోడల్‌ను పోలి ఉండే నిస్సాన్ మైక్రా రెగ్యులర్ హ్యాచ్‌బ్యాక్ మీద రూ. 12,000 విలువైన క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది.

నిస్సాన్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

నిస్సాన్ సన్నీ సెడాన్ మీద రూ. 35,000 విలువైన ఉచిత ఇన్సూరెన్స్, ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 7,000 డిస్కౌంట్ మరియు 7.99 శాతం అతి తక్కువ వడ్డీ రేటుతో లభ్యమవుతోంది.

నిస్సాన్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీ మీద 30,000 రుపాయల విలువైన క్యాష్ డిస్కౌంట్, రూ. 45,000 విలువైన ఉచిత ఇన్సూరెన్స్, ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 10,000 డిస్కౌంట్ మరియు 7.99 శాతం తగ్గించబడిన వడ్డీ రేటుతో లభిస్తోంది.

నిస్సాన్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

నిస్సాన్ ఇండియా విభాగం, వచ్చే ఏడాది ప్రారంభంలో కిక్స్ క్రాసోవర్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. దీనిని నిస్సాన్ వారి బి-జీరో ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన టెర్రానో ఆధారంగా అభివృద్ది చేశారు. ఇది విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు రెనో క్యాప్చర్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తుంది.

నిస్సాన్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

సాంకేతికంగా ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో రానుంది. నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీని సుమారుగా రూ. 10 లక్షల ధరల శ్రేణిలో వచ్చే అవకాశం ఉంది. నిస్సాన్ ఇండియా దేశీయ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి కిక్స్ ఎస్‌యూవీని వ్యూహాత్మక ప్రణాళికతో ప్రవేశపెడుతోంది.

Source: CarDekho

More from DriveSpark

Article Published On: Saturday, August 11, 2018, 16:40 [IST]
English summary
Read In Telugu: Nissan Micra, Sunny & Terrano get BIG discounts for August 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+