ఫార్చూనర్ మరియు ఎండీవర్ లకు పోటీగా నుండి నిస్సాన్ టెర్రా

జపాన్ ఆటోమేకర్ నిస్సాన్ సరికొత్త టెర్రా ఎస్‌యూవీ(Terra SUV) లెఫ్ట్-హ్యాండ్-డ్రైవ్ మోడల్‌ను చైనాలో ప్రదర్శించింది. చైనాలోని బీజింగ్ వేదికగా అతి త్వరలో జరగబోయే బీజింగ్ మోటార్ షో ద్వారా అంతర్జాతీయ ఆవిష్క

By Anil Kumar

Recommended Video

నెక్సాన్ ఆటోమేటిక్ ప్రవేశపెట్టిన టాటా మోటార్స్ | Tata Nexon AMT Details, Specifications - DriveSpark

జపాన్ ఆటోమేకర్ నిస్సాన్ సరికొత్త టెర్రా ఎస్‌యూవీ(Terra SUV) లెఫ్ట్-హ్యాండ్-డ్రైవ్ మోడల్‌ను చైనాలో ప్రదర్శించింది. చైనాలోని బీజింగ్ వేదికగా అతి త్వరలో జరగబోయే బీజింగ్ మోటార్ షో ద్వారా అంతర్జాతీయ ఆవిష్కరణ చేయనుంది.

నిస్సాన్ టెర్రా ఎస్‌యూవీ

నిస్సాన్ గ్లోబల్ లైనప్‌వో ఉన్నఎక్స్-ట్రయల్ మరియు ఇతర చిన్న ఎస్‌యూవీల తరహా కాకుండా టెర్రా ఫుల్ సైజ్ ఎస్‌యూవీ ఎంతో విభిన్నంగా ఉంటుంది.

నిస్సాన్ టెర్రా ఎస్‌యూవీ

సరికొత్త నిస్సాన్ టెర్రా ఎస్‌యూవీని బాడీ-ఆన్-ఫ్రేమ్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేశారు. ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద నవారా పికప్ ట్రక్కు మరియు మెర్సిడెస్ ఎక్స్-క్లాస్ వాహనాలను నిర్మించారు. కఠినంగా కనిపించే ఈ టెర్రా ఎస్‌యూవీని అమెరికా దిగ్గజం తీసుకొచ్చిన ఫోర్డ్ ఎండీవర్ మరియు టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీకి గట్టి పోటీగా దీనిని ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

నిస్సాన్ టెర్రా ఎస్‌యూవీ

నిస్సాన్ టెర్రా ప్రీమియమ్ ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్‌ చూడటానికి అచ్చం నవారా ఫ్రంట్ డిజైన్‌నే పోలి ఉంటుంది. అయితే, రియర్ ప్రొఫైల్ పూర్తిగా కొత్తగా ఉంటుంది. టెర్రా ఫ్రంట్ డిజైన్‌లో నిస్సాన్ సిగ్నేచర్ V ఆకారంలో ఉన్న గ్రిల్, కొత్త డిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల మరియు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్‌, రియర్ డిజైన్‌లో సరికొత్త టెయిల్ ల్యాంప్ క్లస్టర్‌ను అనుసంధానం చేసే క్రోమ్ స్ట్రిప్ కలదు.

నిస్సాన్ తమ టెర్రా ప్రీమియమ్ ఎస్‌యూవీ సాంకేతిక వివరాలను వెల్లడించలేదు. అయితే, 2.3-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ రానుంది. టెర్రా ఇంటీరియర్ ఫోటోలను పరిశీలిస్తే ఇందులోని డీజల్ ఇంజన్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో వచ్చే అవకాశం ఉంది.

నిస్సాన్ టెర్రా ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

నిస్సాన్ నుండి వస్తున్న మొట్టమొదటి ఫుల్ సైజ్ ప్రీమియమ్ ఎస్‌యూవీ టెర్రా. అంతర్జాతీయ ఆవిష్కరణ అనంతరం ఆసియా మొత్తం దశలవారీగా ఒక్కో మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. ప్రస్తుతానికి, భారత్‌లో దీని విడుదల గురించి నిస్సాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఇది కనుక విపణిలోకి విడుదలైతే మార్కెట్లో ఉన్న టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్, మిత్సుబిషి పజేరో స్పోర్ట్ మరియు ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ వంటి మోడళ్ల నుండి గట్టి పోటీని ఎదుర్కోనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Nissan Terra SUV Revealed — Specifications, Features And Images
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X