నిస్సాన్ టెర్రానో స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర రూ. 12.22 లక్షలు
జపాన్ దిగ్గజం నిస్సాన్ విపణిలోకి టెర్రానో స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది.
జపాన్ దిగ్గజం నిస్సాన్ విపణిలోకి టెర్రానో స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ అప్‌డేట్స్‌తో పాటు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎన్నో నూతన ఫీచర్లతో టెర్రానో స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్ విడుదలయ్యింది. సరికొత్త నిస్సాన్ టెర్రానో స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్ ధర రూ. 12.22 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

నిస్సాన్ టెర్రానో స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీలో బ్లాక్ రూఫ్ పెయిటింగ్, బ్లాక్ ఫినిషింగ్ గల పిల్లర్స్ మరియు వీల్ ఆర్చెస్ మీదున్న సరికొత్త క్లాడింగ్స్ గల డైనమిక్ బాడీ డీకాల్స్ ఇందులో ఉన్నాయి. వీటితో పాటు, ఎక్ట్సీరియర్‌లో బానెట్, ఫెండర్స్, రియర్ బంపర్ మరియు ఫ్రంట్ మరియు రియర్ డోర్ల మీద బోల్డ్ స్ట్రిప్స్ ఉన్నాయి.

నిర్రానో స్పోర్ట్ ఇంటీరియర్‌లో డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, క్రిమ్సన్-స్టిట్చ్‌డ్ సీట్ కవర్లు మరియు క్రిమ్సన్ సొబగులు ఉన్న ఫ్లోర్ మ్యాట్లు ఉన్నాయి. అదే విధంగా అత్యంత ముఖ్యమైన 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్ యథావిధిగా వచ్చాయి.

నిస్సాన్ టెర్రానో స్పోర్ట్ ఎస్‌యూవీలో నిస్సాన్ కనెక్ట్ సిస్టమ్ వచ్చింది. స్మార్ట్ ఫోన్ అనుసంధానంతో డ్రైవింగ్ అనుభవాన్ని పంచుకునేందుకు ఇంటిగ్రేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు కమ్యూనికేషన్ ఫ్లాట్‌ఫామ్ నిస్సాన్ కనెక్ట్ సహకరిస్తుంది. ఇందులో సుమారుగా 50కి పైగా ఫీచర్లు ఉన్నాయి.

ప్రయాణికుల భద్రత పరంగా నిస్సాన్ టెర్రానో స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్ ఎస్‍యూవీలో టచ్ లేన్ చేంజ్ ఇండికేటర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, పగటి పూట వెలిగే లైట్లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు బ్రేక్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

సాంకేతికంగా నిస్సాన్ టెర్రానో స్పోర్ట్ ఎస్‌యూవీలో అవే మునుపటి 1.6-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. వీటిలో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే పెట్రోల్ వేరియంట్ 102బిహెచ్‌పి పవర్ మరియు 145ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

అదే విధంగా ఇందులోని డీజల్ ఇంజన్ రెండు రకాలుగా పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అవి, 84బిహెచ్‌పి పవర్-200ఎన్ఎమ్ టార్క్ మరియు 108బిహెచ్‌పి పవర్-243ఎన్ఎమ్ టార్క్. తక్కువ పవర్ వేరియంట్లో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, ఎక్కువ పవర్ వేరియంట్లో 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
నిస్సాన్ ఇండియా ప్రస్తుతం కొనసాగుతున్న క్రికెట్ సీజన్‌ను పురస్కరించుకుని టెర్రానో స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. యువ క్రికెట్ అభిమానులను ఆకట్టుకునే లక్ష్యంతో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో పలు అప్‌డేట్స్‌తో లాంచ్ చేసింది.


Click it and Unblock the Notifications








