తారా స్థాయికి చేరుకున్న పెట్రో ధరలు

దేశంలో పలు అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చివరిసారిగా 2013లో గరిష్ట స్థాయిని చేరుకున్నాయి.

By Anil Kumar

దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చివరిసారిగా 2013లో గరిష్ట స్థాయిని చేరుకున్నాయి. ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన రోజు మారే ఇంధన ధరల కారణంగా పెట్రోల్ మరియు డీజల్ ధరలు రోజు రోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి.

తారా స్థాయికి చేరుకున్న పెట్రో ధరలు

కేంద్ర రాజధాని పరిధి ఢిల్లీలో ఇప్పుడు లీటర్ పెట్రో ధర రూ. 75.32 మరియు లీటర్ డీజల్ ధరర రూ. 66.79. సెప్టెంబర్ 2013 తరువాత నమోదైన అత్యధిక ధర ఇదే. ప్రస్తుతం ధోరణి ప్రకారం రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

తారా స్థాయికి చేరుకున్న పెట్రో ధరలు

దేశ ఆర్థిక రాజధానికి పేరుగాంచిన ముంబాయ్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.16 లతో తారా స్థాయికి చేరుకుంది. ఇదే ముంబాయ్ నగరంలో చివరి సారిగా సెప్టెంబరు 2013లో నమోదైన గరిష్ట ధర రూ. 83.62 లు. ప్రస్తుతం లీటర్ డీజల్ ధర రూ. 71.12 లు.

తారా స్థాయికి చేరుకున్న పెట్రో ధరలు

భారతదేశపు గ్రీన్ సిటీ బెంగళూరు ఈ విపరీతమైన ధరల పెంపుకు మినహాయింపు కాలేదు. బెంగళూరులో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 76.54 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 67.94 లుగా ఉంది.

తారా స్థాయికి చేరుకున్న పెట్రో ధరలు

చెన్నై నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 78.16 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 70.49 లతో తారా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అదే విధంగా కలకత్తాలో పెట్రోల్ ధర రూ. 78.01 లు మరియు డీజల్ ధర రూ. 69.33లుగా ఉంది.

తారా స్థాయికి చేరుకున్న పెట్రో ధరలు

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే రీతిలో పెరిగాయి. హైదరాబాదులో నేడు(17 మే 2018) లీటర్ పెట్రోల్ ధర రూ. 79.78లుగా మరియు గత నాలుగు రోజులుగా 79 రుపాయలుగా ఉంది. అదే విధంగా లీటర్ డీజల్ ధర రూ. 72 లుగా ఉంది.

తారా స్థాయికి చేరుకున్న పెట్రో ధరలు

గత వారం రోజులుగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్ మరియు డీజల్ ధరలను పెంచుతున్నాయి. ఈ ధరల పెంపులో విదేశీ కరెన్సీతో రుపాయి మారకం రేటు కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.

తారా స్థాయికి చేరుకున్న పెట్రో ధరలు

రాష్ట్ర ప్రభుత్వాలు విధించే అదనపు ట్యాక్స్ మినహాయిస్తే, దేశవ్యాప్తంగా ఇంధన ధరల విషయంలో ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషించడం లేదు. ప్రతి రోజు మారే ఇంధన ధరల విధానం అమల్లోకి రావడంతోనే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా పునరావృతమయ్యేవి.

తారా స్థాయికి చేరుకున్న పెట్రో ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2013లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో నగరాల్లో ఇంధన ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో పెరుగుతున్న ఇంధన ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. పెట్రోల్‌తో పాటు డీజల్ ధరలు కూడా అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్నాయి.

పెరిగిన పెట్రోల్ మరియు డీజల్ ధరలు క్రిందకు దిగివచ్చే అవకాశాలు దాదాపు తక్కువగానే ఉన్నాయి. కాబట్టి, ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడం ఎంతో ఉత్తమం.

Most Read Articles

English summary
Read In Telugu: Petrol And Diesel Prices Hiked Again — Petrol Price In Mumbai Stands At Rs 83.16 Per Litre
Story first published: Thursday, May 17, 2018, 13:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X