ఒక్కసారి ఛార్జింగ్‌తో 1,000 కిమీలు ప్రయాణించే మహీంద్రా పినిన్ఫారినా కె350

మహీంద్రాకు చెందిన పినిన్ఫారినా 2018 బీజింగ్ మోటార్ షోలో కె350 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. అంతే కాకుండా, ఈ ఇటీవల జరిగిన జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించిన హెచ్500 సెడాన్ మరియు హెచ్‌కె జిటి గ్రా

By Anil Kumar

అంతర్జాతీయంగా ప్యాసింజర్ కార్లకు అతి ముఖ్యమైన మార్కెట్ ఇటలీ. ఇక్కడే ఎన్నో కార్ల కంపెనీలు పుట్టాయి. ఇక్కడి నుండి ప్రపంచ దేశాలకు ఎగుమతవుతున్నాయి. ప్రతి ఒక్క కార్ల తయారీ సంస్థ ఇటలీ మార్కెట్లో రాణించడం కత్తి మీద సాము వంటిది. అవకాశాలతో పాటు ఎదురయ్యే ప్రతి సవాలును ఎదుర్కోవడం అంత సులభమేమీ కాదు. చిన్న కార్ల సెగ్మెంట్లో ఫర్వాలేదనిపించుకున్న సంస్థలు చాలా ఉన్నప్పటికీ, లగ్జరీ మరియు సూపర్ కార్ల విషయంలో అంచనాలు తలక్రిందులైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

పినిన్ఫారినా కె350 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

ఇంతటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్య దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అదే దేశానికి చెందిన సూపర్ కార్ల తయారీ సంస్థను కొనుగోలు చేసి, అనతి కాలంలో తమ నూతన ఉత్పత్తులను ప్రవేశపెట్టింది.

పినిన్ఫారినా కె350 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

అవును ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునేలా... మహీంద్రా ఇటలీకి చెందిన పినిన్ఫారినా సూపర్ కార్ల తయారీ సంస్థను గత ఏడాది కొనుగోలు చేసింది. ఇప్పుడు ఏడాది తిరగకుండానే తమ తొలి ఉత్పత్తిని బీజింగ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ వాహన ప్రదర్శన వేదికలో ఆవిష్కరించింది.

పినిన్ఫారినా కె350 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

మహీంద్రాకు చెందిన పినిన్ఫారినా 2018 బీజింగ్ మోటార్ షోలో కె350 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. అంతే కాకుండా, ఈ ఇటీవల జరిగిన జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించిన హెచ్500 సెడాన్ మరియు హెచ్‌కె జిటి గ్రాన్ టురిస్మో మోడళ్లను ప్రదర్శించింది.

పినిన్ఫారినా కె350 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

పినిన్ఫారినా కె350 నలుగు ప్రయాణించే కాంపాక్ట్ ఎస్‌యూవీ డిజైన్ కలిగి ఉంది. దీనిని ప్రత్యేకించి హైబ్రిడ్ కైనటిక్ గ్రూప్(HK) కోసం డిజైన్ చేశారు. పనిన్ఫారినాలో హైబ్రిడ్ కైనటిక్ గ్రూప్ అభివృద్ది చేసిన స్టేట్-ఆఫ్-టెక్నాలజీని కె350 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో అందివ్వడం జరిగింది. ఎస్‌యూవీ ఓవరాల్ డిజైన్ చూడటానికి అచ్చం హెచ్‌కె మోడళ్లనే పోలి ఉంటుంది.

పినిన్ఫారినా కె350 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

పినిన్ఫారినా హెచ్‌కె350 ఫ్రంట్ డిజైన్‌లో పొడవాటి స్లాట్లున్న హెచ్‌కె ఫ్రంట్ గ్రిల్ ఉంది. గ్రిల్‌కు ఇరువైపులా పలుచటి ఎల్ఇడి హెడ్‌లైట్లు ఉన్నాయి. ముందు నుండి ప్రారంభమయ్యే అద్దం రూఫ్ టాప్ నుండి వెనుక వరకు ఉంటుంది. ఇక్కడ అద్దమే రూఫ్ టాప్‌గా ఉంటుంది. రియర్ డిజైన్‌లో స్లిమ్ముగా ఉన్న టెయిల్ ల్యాంప్ క్లస్టర్ గమనించవచ్చు.

పినిన్ఫారినా కె350 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

పినిన్ఫారినా హెచ్‌కె350 ఇంటీరియర్‌లో ఫ్లోటింగ్ ఫ్రంట్ సీట్లు సాధారణ కార్లతో పోల్చుకుంటే చాలా విభిన్నంగా ఉన్నాయి. వెనుక వరుసలోని రెండు సీట్లను ఆర్మ్ రెస్ట్ ద్వారా కనెక్ట్ చేయబడ్డాయి. ముందు మరియు వెనుక రెండు సీట్లు కూడా సెంటర్ కన్సోల్ డిస్ల్పేను కలిగి ఉన్నాయి. డ్యాష్‌బోర్డులోని డిస్ల్పే లేదా ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఒక చివర నుండి మరో చివర వరకు ఉంటుంది.

పినిన్ఫారినా కె350 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

పినిన్ఫారినా హెచ్‌కె350 ఎస్‌యూవీలో 300కిలోవాట్ సామర్థ్యం ఉన్న పలు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్టంగా 1,000కిలోమీటర్లు ప్రయాణిస్తుంది (ఆప్షనల్ రేంజ్ ఎక్స్‌టెండర్ ద్వారా). కేవలం 4.7 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ ఎస్‌యూవీ గరిష్ట వేగం గంటకు 250కిలోమీటర్లుగా ఉంది.

పినిన్ఫారినా కె350 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

పినిన్ఫారినా సిఇఒ సిల్వియో పీట్రో ఆంగోరి మాట్లాడుతూ, "హైబ్రిడ్ కైనటిక్ గ్రూపుతో పినిన్ఫారినా భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనది. ఈ ఉమ్మడి భాగస్వామ్యంతో నూతన శ్రేణి ఎలక్ట్రిక్ వాహనాలను మరియు వాణిజ్య అవసరాలకు కావాల్సిన నూతన మోడళ్లను హైబ్రిడ్ కైనటిక్ గ్రూప్ ఆధారంగా అభివృద్ది చేసి అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు చెప్పుకొచ్చాడు."

పినిన్ఫారినా కె350 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్టేట్-ఆఫ్-ఆర్ట్ టెక్నాలజీ మరియు నూతన డిజైన్ అంశాలతో రూపొందించిన పినిన్ఫారినా కె350 ఫోర్-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఓవరాల్ డిజైన్‌లో హెచ్‌కె గ్రూప్ నుండి సేకరించిన ఫ్రంట్ గ్రిల్ ప్రధాన హైలైట్‌గా నిలిచింది. పనిన్ఫారినా ఎన్నో నూతన శ్రేణి ఎలక్ట్రిక్ కార్లను మరియు వాణిజ్య వాహనాలను అభివృద్ది చేస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu: Pininfarina K350 Electric SUV Concept Unveiled At Beijing Motor Show
Story first published: Friday, April 27, 2018, 8:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X