వందలాది మందిని మింగేస్తున్న గతుకులు రోడ్లు: రోజుకు 10 మంది మృతి
ఇండియాలో కేవలం రోడ్డు మీద ఉన్న గతుకుల కారణంగా మరణిస్తున్న వారి గణాంకాలను పరిశీలిస్తే, గత ఏడాది దేశవ్యాప్తంగా 3,597 మంది గతుకుల రోడ్లకు బలయ్యారు. అంటే రోజుకు సగటున 10 మంది చొప్పున మరణించారు.
వర్షాకాలం కొందరికి చిరునవ్వులు కురిపిస్తే మరికొందరికి కనువిప్పు కలిగిస్తుంది. ఇంకొందరి జీవితాలను రోడ్డు మీద పడేస్తుంది. సాధారణంగా, వర్షాకాలంలో తడిసిన రోడ్లపై వాహనాలను నడపటం అంటే, కత్తిమీద సాము లాంటిదే. అందులోను గతుకులతో కూడిన ఇండియన్ రోడ్ల మీద ప్రయాణించడం ప్రాణాలతో చెలగాటం అనే చెప్పాలి.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు నగరాల్లోని గుంతలమయైన రోడ్లు ఎంతో మంది అభాగ్యులను మింగేస్తున్నాయి. రోడ్డు మీద ఉన్న గతుకుల కారణంగా ప్రమాదానికి గురయ్యి మరణించిన సంఘటనలు వీడియోల రూపంలో మీడియాను కుదిపేస్తున్నాయి.

చేయని పొరపాటుకు వాహన చోదకులు రోడ్డు మీదనే ప్రాణాలొదులుతున్నారు. గతం వారంలో ఓ జంట బైకు మీద వెళుతుండగా, గతుకుల రోడ్డులు అదుపుతప్పి క్రింద పడ్డారు. ఈ దుర్ఘటనలో బస్సు చక్రాల క్రిందపడిన మహిళ్ల అక్కడిక్కడే చనిపోయింది.

ఇదొక్కటే కాదు, వారంలో రోజుల వ్యవధిలో ఇదే తరహాలో ముగ్గురు ప్రాణాలు ప్రాణాలు విడిచారు. వెలుగులోకి రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న గతుకుల రోడ్లు ఎంతో మందిని పొట్టనబెట్టుకుంటున్నాయి.

ఇండియాలో కేవలం రోడ్డు మీద ఉన్న గతుకుల కారణంగా మరణిస్తున్న వారి గణాంకాలను పరిశీలిస్తే, గత ఏడాది దేశవ్యాప్తంగా 3,597 మంది గతుకుల రోడ్లకు బలయ్యారు. అంటే రోజుకు సగటున 10 మంది చొప్పున మరణించారు.

గతుకుల రోడ్ల కారణంగా 2016లో మరణించిన వారితో పోల్చితే, 2017లో ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది. మరి 2018లో ఈ సంఖ్య ఎంత ఉంటుందో చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా కురుస్తున్న భీభత్సమైన వర్షాల కారణంగా ఇప్పటికే ఎంతో మంది చనిపోయారు.

గతుకుల రోడ్ల కారణంగా ఏడాదికి వేల సంఖ్యలో మరణాలు నమోదవ్వడం చాలా బాధాకరమైన విషయం. ప్రపంచ గణాంకాలతో పోల్చితే గతుకులు రోడ్ల మీద చనిపోతున్నవారి సంఖ్య ఇండియాలో అత్యధికం.

డ్రైనేజ్ సిస్టమ్, రోడ్ల నిర్మాణ నాణ్యత, సరైన అవగాహన లేకుండా రోడ్లను నిర్మించడంతో అతి తక్కువ కాలంలోనే రహదారులు దెబ్బతింటున్నాయి. దీనికి తోడు ప్రతి ఏడాది వర్షాకాలాన్ని ఎదుర్కోవడంలో నగరపాలక మరియు నగర అభివృద్ది శాఖ అధికారులు విఫలమవుతూనే ఉన్నారు.

వర్షాకాంలో వాహన చోదకులు ఎన్నో జాగ్రత్తలు వహించాలి. నీటితో నిండిన రోడ్ల మీద వెళ్లడం, హెల్మెట్ లేకుండా నడపడం, సిగ్నల్స్ జంప్ చేయడం వంటివి చేయకూడదు మరియు ఓవర్ టేకింగ్ చేస్తున్నపుడు జాగ్రత్తలు వహిస్తే సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications








