విపణలోకి రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్ విడుదల: ధర రూ. 69.53 లక్షలు

Posted By:

విపణిలోకి రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ విడుదల అయ్యింది. ల్యాండ్ రోవర్ ఇండియా విభాగం, లాంచ్ చేసిన రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్ భారతదేశపు మొట్టమొదటి కన్వర్టిబుల్ ఎస్‌యూవీ. రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 69.53 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్

సరికొత్త రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీలో సాంకేతికంగా 2-లీటర్ ఇంజీనియం నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇంజన్ ప్రొడ్యూస్ చేసే 237బిహెచ్‌పి పవర్ మరియు 340ఎన్ఎమ్ టార్క్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ఎస్‌యూవీలోని అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్

ఎవోక్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీలో పెడల్ షిఫ్ట్ గల డ్రైవ్ సెలెక్ట్ మరియు స్పోర్ట్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్ టు-డోర్ మోడల్ కేవలం హెచ్ఎస్ఇ డైనమిక్ అనే సింగల్ వేరియంట్లో మాత్రమే లభిస్తోంది.

రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్

స్టాండర్డ్ రేంజ్ రోవర్ ఎవోక్ ఇంజన్, ఛాసిస్ మరియు ఫీచర్లు ఆధారంగా రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీని రూపొందించారు. ఎవోక్ కన్వర్టిబుల్‌లో ఉన్న ప్రధాన ఆకర్షణ ముడుచుకునే రూఫ్. వేడి మరియు శబ్దం క్యాబిన్‌లోకి చేరడాన్ని అడ్డుకునే ఐదు లేయర్లు గల పాలిక్రిలిక్ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన విచ్చుకునే మరియు ముడుచుకునే రూఫ్ టాప్‌ను అందించారు. Z-ఫోల్డ్ మెకానిజమ్ ద్వారా నాలుగు మోటార్ల సాయంతో రూఫ్‌ టాప్ ఆపరేట్ అవుతుంది.

రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్

రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్ రూఫ్ టాప్ కేవలం 18 సెకండ్లలోనే ముడుచుకుంటుంది. ఈ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ రూఫ్ టాప్‌ను గరిష్టంగా గంటకు 48కిలోమీటర్ల వేగం వద్ద కూడా ఆపరేట్ చేయవచ్చు.

రేంజ్ రోవర్ బృందం ఎవోక్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీని మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ నుండి 90 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య ఏకంగా 6,750 సార్లు పరీక్షించారు.

రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్

డిజైన్ పరంగా, రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీలో ఆడాప్టివ్ జెనాన్ హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, రేడియేటర్ గ్రిల్, ఎయిర్ డ్యామ్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు సాఫ్ట్-టాప్ రూఫ్ అదే విధంగా ఎస్‌యూవీ వెనుక వైపున చిన్న స్టోరేజ్ స్పేస్ గల డిక్కీ కలదు.

Recommended Video - Watch Now!
Mahindra TUV Stinger Concept First Look; Details; Specs - DriveSpark
రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్

స్టాండర్డ్ రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీతో పోల్చుకుంటే ఈ రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్ పొడవు ఎక్కువగా ఉంటుంది. దీని పొడవు 4,370ఎమ్ఎమ్. ఐదు-డోర్ల ఎస్‌యూవీ మోడల్‌తో పోల్చుకుంటే ఎత్తు మరియు వెడల్పు తగ్గించారు. కన్వర్టిబుల్ ఎత్తు 1,900ఎమ్ఎమ్ మరియు వెడల్పు 1,609ఎమ్ఎమ్ అదే విధంగా వీల్ బేస్ ఎలాంటి మార్పు చేయకుండా అదే 2,660ఎమ్ఎమ్ కొలతల్లో ఉంది.

రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్

రేంజ్ రోవర్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీ నలుగురు ప్రయాణించే సీటింగ్ సామర్థ్యంతో ఆల్-బ్లాక్ క్యాబిన్ కలిగి ఉంది. ఇంటీరియర్‌లో వాయిస్ గుర్తించే ఫీచర్ మరియు న్యావిగేషన్ ప్రొ సపోర్ట్ చేసే 10-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పర్ఫోరేటెడ్ విండ్సర్ లెథర్ సీట్లు మరియు ఆంబియంట్ ఇంటీరియర్ లైటింగ్ వంటివి ఉన్నాయి.

రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్ భారతదేశపు తొలి కన్వర్టిబుల్ లగ్జరీ ఎస్‌యూవీగా నిలిచింది. అత్యాధునిక మరియు సౌకర్యవంతమైన ఫీచర్లతో కూడిన రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్ హెచ్ఎస్ఇ డైనమిక్ అనే సింగల్ వేరియంట్లో మాత్రమే లభిస్తోంది. ఈ ఎస్‌యూవీలో ఉన్న అత్యంత అరుదైన ఫీచర్ ఫోల్డింగ్ రూఫ్ టాప్.

రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీకి భారత్‌లో మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. దీని గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ సెక్షన్‌ ద్వారా పాఠకులతో పంచుకోండి.

భారతదేశపు తొలి కన్వర్టిబుల్ రేంజ్ రోవక్ ఎవోక్

1.మారుతి వితారా బ్రిజాకు పోటీగా జీప్ స్మాల్ ఎస్‌యూవీ

2.ఈ ఏడాది విడుదలకు సిద్దమైన అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్-10 కార్లు

3.ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన కొడుకు దగ్గర జరిమానా వసూలు చేసిన పోలీస్ అధికారి

4.2018 ఎడిషన్ బజాజ్ పల్సర్ 150 ధరలు లీక్

5.హోండా సిబి హార్నెట్ 160ఆర్ ఏబిఎస్ విడుదల: ధర రూ. 84,675 లు

English summary
Read In Telugu: Range Rover Evoque Convertible Launched In India; Priced At Rs 69.53 Lakh

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark