రేంజ్ రోవర్ స్పోర్ట్ విడుదల: ధర రూ. 99.48 లక్షలు

ల్యాండ్ రోవర్ ఇండియా సరికొత్త 2018 రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్ రెండు మోడళ్లను నేడు విపణిలోకి లాంచ్ చేసింది. రేంజ్ రోవర్ స్పోర్ట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 99.48 లక్షలు మరియు రేంజ్ రోవర్ టాప్

By Anil Kumar

ల్యాండ్ రోవర్ ఇండియా సరికొత్త 2018 రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్ రెండు మోడళ్లను నేడు విపణిలోకి లాంచ్ చేసింది. రేంజ్ రోవర్ స్పోర్ట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 99.48 లక్షలు మరియు రేంజ్ రోవర్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 1.74 కోట్లు, రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

రేంజ్ రోవర్ స్పోర్ట్ విడుదల: ధర రూ. 99.48 లక్షలు

2018 రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్ రెండు మోడళ్ల మీద ఈ ఏడాది ఆగష్టులో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ల్యాండ్ రోవర్ ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్లో ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

రేంజ్ రోవర్ స్పోర్ట్ విడుదల: ధర రూ. 99.48 లక్షలు

ల్యాండ్ రోవర్ ఈ రెండు కొత్త మోడళ్లను కూడా ఆధునిక జెర్రీ మెక్‌గోవన్స్ డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా డెవలప్ చేసింది. రెండు రేంజ్ రోవర్ ఎస్‌యూవీలను కూడా అత్యంత పదునైన డిజైన్ ఎలిమెంట్లతో అధునిక డిజైన్ శైలిలో తీర్చిద్దారు. ఇటీవల విడుదల విడుదలైన రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ నుండి గ్రహించిన డిజైన్ ఎలిమెంట్లను గుర్తించవచ్చు.

రేంజ్ రోవర్ స్పోర్ట్ విడుదల: ధర రూ. 99.48 లక్షలు

రేంజ్ రోవర్ వేరియంట్ పొందికగా ఉంటుంది, మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్ పేరుకు తగ్గట్లుగానే స్పోర్టివ్ శైలిలో ఉంటుంది. ఇందులో స్పోర్టివ్ క్యారెక్టర్ లైన్స్, విశాలమైన ఎయిర్ ఇంటేకర్, పదునై ఎడ్జెస్ మరియు బ్లాక్-అవుట్ ఎలిమెంట్లు ఉన్నాయి.

రేంజ్ రోవర్ స్పోర్ట్ విడుదల: ధర రూ. 99.48 లక్షలు

రెండు ఎస్‌యూవీలలో కూడా అద్భుతమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలు ఉన్నాయి, డ్రైవర్‌కు సహాయపడేందుకు డ్రైవింగ్ సరళతరం చేసే ఎన్నో ఫీచర్లకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్స టెర్రైన్ రెస్పాన్ 2, ఎలక్ట్రానిక్ సెంటర్ డిఫరెన్షియల్ గల ట్విన్-స్పీడ్ ట్రాన్స్‌ఫర్ బాక్స్ మరియు ఆఫ్ రోడింగ్ పనితీరును మెరుగు పరిచే అడాప్టివ్ డైనమిక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రేంజ్ రోవర్ స్పోర్ట్ విడుదల: ధర రూ. 99.48 లక్షలు

సరికొత్త రేంజ్ రోవర్ ఎస్‌యూవీల ఇంటీరియర్ విషయానికి వస్తే, వెలార్ ఎస్‌యూవీలో తొలిసారిగా పరిచయం చేసిన టచ్ ప్రో డ్యూఒ డ్యూయల్-స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వీటిలో ఉంది. డ్యాష్‌బోర్డులో చాలా వరకు ప్రదేశాన్ని ఆక్రమించుకున్న ఇది రోటరీ నాబ్ ద్వారా కంట్రోల్ చేయగలిగే ఎన్నో ఫంక్షన్స్ కలిగి ఉంది. మరియు 12.3-అంగుళాల డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్ అడ్వాన్స్‌డ్ రియర్ టైమ్ డేటా అందిస్తుంది.

రేంజ్ రోవర్ స్పోర్ట్ విడుదల: ధర రూ. 99.48 లక్షలు

2018 రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీలు నాలుగు విభిన్న ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతాయి. అవి,

3.0-లీటర్ సూపర్ ఛార్జ్‌డ్ వి6 పెట్రోల్,

5.0-లీటర్ సూపర్ ఛార్జ్‌డ్ వి8 పెట్రోల్,

3.0-లీటర్ వి6 డీజల్,

4.4-లీటర్ వి8 డీజల్. అన్ని ఇంజన్‌లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ అనుసంధానం కలిగి ఉన్నాయి.

రేంజ్ రోవర్ స్పోర్ట్ విడుదల: ధర రూ. 99.48 లక్షలు

వీటిలో వి6 పెట్రోల్ ఇంజన్ 335బిహెచ్‌పి పవర్ మరియు 450ఎన్ఎమ్ టార్క్, వి6 డీజల్ ఇంజన్ 190బిహెచ్‌పి-255ఎన్ఎమ్, వి8 డీజల్ 250బిహెచ్‌పి-740ఎన్ఎమ్ మరియు వి8 పెట్రోల్ ఇంజన్ 518బిహెచ్‍‌‌పి-625ఎన్ఎమ్ ప్రొడ్యూస్ చేస్తాయి.

రేంజ్ రోవర్ స్పోర్ట్ విడుదల: ధర రూ. 99.48 లక్షలు

సరికొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ లగ్జరీ ఎస్‌యూవీ విపణిలో ఉన్న వోల్వో ఎక్స్‌సి90, ఆడి క్యూ7, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 మరియు మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ వంటి మోడళ్లకు అదే విధంగా, రేంజ్ రోవర్ మోడల్ పోర్షే కయూన్, జాగ్వార్ ఎఫ్-పేస్ మరియు జీప్ గ్రాండ్ చిరోకీ వంటి లగ్జరీ ఎస్‌యూవీలకు గట్టిపోటీనిస్తాయి.

రేంజ్ రోవర్ స్పోర్ట్ విడుదల: ధర రూ. 99.48 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

లగ్జరీ ఎస్‌యూవీల విషయానికి వస్తే, రేంజ్ రోవర్ ఎస్‌యూవీలు ప్రసిద్ది. ల్యాండ్ రోవర్ భారీ మార్పులు చేర్పులతో తమ అదే మునుపటి డిజైన్ లక్షణాలతో పోటీదారులకు ఏ మాత్రం తీసిపోకుండా తమ 70 ఏళ్ల వారసత్వాన్ని రంగరించి నూతన రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీలను అత్యద్భుతమైన ఆఫ్-రోడింగ్ లక్షణాలకో లాంచ్ చేసింది.

మరి మీ అభిప్రాయం ఏంటి?

More from DriveSpark

Article Published On: Thursday, June 28, 2018, 17:52 [IST]
English summary
Read In Telugu: 2018 Range Rover & Range Rover Sport Launched In India; Prices Start From Rs 99.48 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+