ఎస్వీ ఆటోబయోగ్రఫీ మరియు స్పోర్ట్ ఎస్వీఆర్ మోడళ్ల మీద బుకింగ్స్ ప్రారంభించిన రేంజ్ రోవర్

రేంజ్ రోవర్ పర్ఫామెన్స్ ఎస్‌యూవీలైన లేటెస్ట్ వెర్షన్ స్పోర్ట్ ఎస్వీ మరియు ఎస్వీఆటోబయోగ్రఫీ ఎస్‌యూవీల మీద అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించినట్లు ల్యాండ్ రోవర్ వెల్లడించింది.

By Anil Kumar

రేంజ్ రోవర్ ఎస్వీ ఆటోబయోగ్రఫీ మరియు స్పోర్ట్ ఎస్వీ మోడళ్ల మీద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రేంజ్ రోవర్ పర్ఫామెన్స్ ఎస్‌యూవీలైన లేటెస్ట్ వెర్షన్ స్పోర్ట్ ఎస్వీ మరియు ఎస్వీఆటోబయోగ్రఫీ ఎస్‌యూవీల మీద అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించినట్లు ల్యాండ్ రోవర్ వెల్లడించింది.

ఎస్వీ ఆటోబయోగ్రఫీ మరియు స్పోర్ట్ ఎస్వీఆర్ మోడళ్ల మీద బుకింగ్స్ ప్రారంభించిన రేంజ్ రోవర్

రేంజ్ రోవర్ ఎస్వీ ఆటోబయోగ్రఫీ డైనమిక్ మరియు ఎల్‌డబ్ల్యూబీ అనే రెండు వేరియంట్లెలో లభ్యమవుతోంది. డైనమిక్ వేరియంట్ వీల్‌బేస్ 2.92 మీటర్లు మరియు ఎల్‌డబ్ల్యూబీ(లాంగ్ వీల్‌బేస్) వేరియంట్ పొడవు 3.12 మీటర్లుగా ఉంది.

ఎస్వీ ఆటోబయోగ్రఫీ మరియు స్పోర్ట్ ఎస్వీఆర్ మోడళ్ల మీద బుకింగ్స్ ప్రారంభించిన రేంజ్ రోవర్

సరికొత్త పర్ఫామెన్స్ మోడళ్లు రెండు కూడా 2018 రేంజ్ రోవర్ ఫ్యామిలీ డిజైన్ కలిగి ఉన్నాయి. ఆకర్షణీయమైన డీఆర్ఎల్స్ మరియు పదునైన బాడీ లైన్స్ ఉన్నాయి. రెండు మోడళ్లలోని అన్ని వేరియంట్లను ఎస్వీఓ(స్పెషల్ వెహికల్ ఆపరేషన్స్) బృందం తీర్చిదిద్దింది. వీటి ఫ్రంట్ డిజైన్‌లో ఓవరాల్ గ్లాజ్ బ్లాక్ థీమ్ గల అట్లాస్ మెష్ ఫ్రంట్ గ్రిల్ ఉంది.

ఎస్వీ ఆటోబయోగ్రఫీ మరియు స్పోర్ట్ ఎస్వీఆర్ మోడళ్ల మీద బుకింగ్స్ ప్రారంభించిన రేంజ్ రోవర్

రేంజ్ రోవర్ ఎస్వీఆర్ మోడల్‌లో కార్బన్ ఫైబర్ బానెట్, ఫ్రంట్ బంపర్ మీద విశాలమైన ఎయిర్ డ్యామ్ మరియు ఇంటీరియర్‌లో తేలికపాటి బరువున్న ఎస్వీఆర్ పర్ఫామెన్స్ సీట్లు ఉన్నాయి.

ఎస్వీ ఆటోబయోగ్రఫీ మరియు స్పోర్ట్ ఎస్వీఆర్ మోడళ్ల మీద బుకింగ్స్ ప్రారంభించిన రేంజ్ రోవర్

లగ్జరీ పర్ఫామెన్స్ ఎస్‌యూవీ, ఎస్వీ ఆటోబయోగ్రఫీలో అధునాతన ఛాసిస్, స్టీరింగ్ యూనిట్, ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు మునుపటి మోడల్ కంటే 8ఎమ్ఎమ్ తక్కువ ఎత్తులో వచ్చింది. ఇందులో ఇరువైపులా గ్రాఫైట్ అట్లాస్ ప్యానళ్లతో పాటు 21-అంగుళాల అల్లాయ్ వీల్స్ వచ్చాయి.

ఎస్వీ ఆటోబయోగ్రఫీ మరియు స్పోర్ట్ ఎస్వీఆర్ మోడళ్ల మీద బుకింగ్స్ ప్రారంభించిన రేంజ్ రోవర్

రెండు ఎస్‌యూవీలలో రేంజ్ రోవర్ బ్రాండ్ లేటెస్ట్ టచ్ ప్రో డ్యూయె ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. పలు రకాల ఫీచర్లతో 10-అంగుళాల పరిమాణంలో ఉన్న రెండు డిస్ల్పేలు ఉన్నాయి. ఎస్వీఆటోబయోగ్రఫీ వేరియంట్లలో 24-వే హాట్ స్టోన్ మసాజ్ సీట్లు, పవర్-క్లోజ్ డోర్ గల రిఫ్రిజిరేటర్ మరియు సౌకర్యవంతమైన మెటీరియల్‌తో తీర్చిదిద్దిన ఇంటీరియర్ ఉంది.

ఎస్వీ ఆటోబయోగ్రఫీ మరియు స్పోర్ట్ ఎస్వీఆర్ మోడళ్ల మీద బుకింగ్స్ ప్రారంభించిన రేంజ్ రోవర్

రేంజ్ రోవర్ కొత్త ఎస్‌యూవీల పర్ఫామెన్స్ విషయానికి వస్తే, రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీఆర్ ఎస్‌యూవీలో 575బిహెచ్‌పి పవర్ మరియు 700ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 5.0-లీటర్ కెపాసిటి గల సూపర్‌ఛార్జ్‌డ్ వి8 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది కేవలం 4.5-సెకండ్ల వ్యవధిలోనే గంటకు 100కిమీల వేగాన్ని అందుకుంటుంది. ఎస్వీఆటోబయోగ్రఫీ డైనమిక్ వేరియంట్లో కూడా ఇదే ఇంజన్ ఉంది.

ఎస్వీ ఆటోబయోగ్రఫీ మరియు స్పోర్ట్ ఎస్వీఆర్ మోడళ్ల మీద బుకింగ్స్ ప్రారంభించిన రేంజ్ రోవర్

రేంజ్ రోవర్ ఎస్వీ ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యూబీ వేరియంట్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది. అవి, అదే 5.0-లీటర్ పెట్రోల్ మరియు 4.4-లీటర్ డీజల్ ఇంజన్(340బిహెచ్‌పి-740ఎన్ఎమ్). రెండు ఇంజన్‌లకు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

ఎస్వీ ఆటోబయోగ్రఫీ మరియు స్పోర్ట్ ఎస్వీఆర్ మోడళ్ల మీద బుకింగ్స్ ప్రారంభించిన రేంజ్ రోవర్

ల్యాండ్ రోవర్ ఈ రెండు కొత్త మోడళ్లను ఇంకా ఇండియన్ మార్కెట్లోకి విడుదలవ్వలేదు. ప్రస్తుతం ఉన్న మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి...

  • రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీఆర్ - రూ. 1.97 కోట్లు
  • రేంజ్ రోవర్ ఎస్వీ ఆటోబయోగ్రఫీ డైనమిక్ - రూ. 3.11 కోట్లు
  • ఎస్వీ ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యూడీ - రూ. 3.88 కోట్లు
  • ఎస్వీ ఆటోబయోగ్రఫీ మరియు స్పోర్ట్ ఎస్వీఆర్ మోడళ్ల మీద బుకింగ్స్ ప్రారంభించిన రేంజ్ రోవర్

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీలు ఎంత సౌకర్యవంతమైనవో... అంతే ఖరీదైనవి కూడా. ఎస్వీఓ (స్పెషవ్ వెహికల్ ఆపరేషన్స్) బృందం రూపొందించిన ఈ ప్రీమియం మరియు స్పోర్టివ్ లగ్జరీ ఎస్‌యూవీలు విపణిలో ఉన్న బెంట్లీ బెంట్యాగా మోడల్‌కు గట్టి పోటీనిస్తాయి. అంతే కాకుండా, వీటి కోసం పలు కస్టమైజేషన్ ఆప్షన్లు కూడా లభ్యమవుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 20, 2018, 16:21 [IST]
English summary
Read In Telugu: Range Rover SVAutobiography & Sport SVR Bookings Open — The Performance-Focussed Models Of The Lot
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+