కస్టమర్‌ను మోసం చేసినందుకు 9.23 లక్షలు జరిమానా విధించిన కోర్టు

Written By:

ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన కారులో ఉన్నట్లుండి సాంకేతిక లోపం తలెత్తితే ఎలా ఉంటుంది. దాన్ని తయారు చేసిన కంపెనీ నుండి విక్రయించిన డీలర్ వరకు ప్రతి ఒక్కరి మీద విపరీతమైన కోపం వస్తుంది కదూ... ఈ క్రమంలో కొన్ని సార్లు తయారీదారుల తప్పిదం ఉంటే, మరికొన్ని సార్లు డీలర్ల మోసం బయటపడుతుంది.

డీలరుకు జరిమానా విధించిన కోర్టు

ఇలా డీలర్ చేతిలో మోసపోయిన కస్టమర్ కోర్టును ఆశ్రయించగా, డీలర్ మోసం బుుజువు కావడంతో ఆ డీలరుకు ఏకంగా 9.23 లక్షల రుపాయలు జరిమానా విధించింది. మంళూరులోని రెనో డీలర్ లోపం ఉన్న డస్టర్ ఎస్‌యూవీని విక్రయించడంతో వినియోగదారుల కోర్టు భారీ జరిమానా విధించింది.

డీలరుకు జరిమానా విధించిన కోర్టు

కర్ణాటకలోని తీర ప్రాంత నగరంగా పేరుగాంచిన మంగళూరు నగరంలోని వినియోగదారుల న్యాయస్థానం నుండి అందిన రిపోర్ట్స్ మేరకు, రెనో డస్టర్ ఎస్‌యూవీని సొంతం చేసుకున్న తరువాత వెనువెంటనే పలు రకాల సాంకేతిక సమస్యలు రావడంతో సరాసరిగా కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.

డీలరుకు జరిమానా విధించిన కోర్టు

వ్యక్తిగతంగా సొంత కారును కొనుగోలు చేసే ప్రతి కస్టమర్, ఎక్కువ కాలం పాటు అతి తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎలాంటి అరుగుదల లేకుండా చాలా జాగ్రత్తగా... ఇంకా చెప్పాలంటే కన్నబిడ్డలా చూసుకోవాలని భావిస్తారు.

డీలరుకు జరిమానా విధించిన కోర్టు

మంగళూరులో డస్టర్ ఎస్‍యూవీని కొనుగోలు చేసిన కస్టమర్ ఆశలన్నీ ఆవిరయ్యాయి. మంగళూరుకు చెందిన న్యాయవాది ఇస్మాయిల్ సున్నాల్ రెనో అధీకృత డీలరు టీవీఎస్ సుందరమ్ అయ్యంగార్ అండ్ సన్స్ లిమిటెడ్ వద్ద రెనో డస్టర్‌ను కొనుగోలు చేశాడు.

డీలరుకు జరిమానా విధించిన కోర్టు

ఇస్మాయిల్ ఎంచుకున్న డస్టర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.64 లక్షలు ఉండగా, పన్నులు, రిజిస్ట్రేషన్ మరియు ఇతరత్రా ఖర్చుల కోసం అదనంగా మరో రూ. 1.94 లక్షల వరకు చెల్లించాడు.

డీలరుకు జరిమానా విధించిన కోర్టు

సమస్యలు

రెనో డస్టర్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన తరువాత సుమారుగా 19,000 కిలోమీటర్లు నడిచిన అనంతరం అసలు సమస్యలు ఎదురయ్యాయి. డస్టర్‌ను డ్రైవ్ చేస్తున్నపుడు దడ దడ శబ్దం వస్తుండటాన్ని గమనించాడు.అందరు డ్రైవర్లలాగే, బానెట్ డోరును పైకి ఎత్తి గమనించగా రేడియర్ సిస్టమ్ పగిలిపోయినట్లు గుర్తించాడు.

డీలరుకు జరిమానా విధించిన కోర్టు

సమస్య ఎదురైన డస్టర్ ఎస్‌యూవీతో ఇస్మాయిల్ డీలరును సంప్రదించగా, కారును రిపేరీ కోసం తీసుకోకుండా... ఇస్మాయిల్ సున్నాల్ డ్రైవింగ్ స్టైల్‌ను తప్పుబట్టారు. అంతే కాకుండా, ఉద్దేశ్యపూర్వకంగా మీ కారుతో యాక్సిడెంట్ చేసి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని ఉచితంగా రేడియేటర్ మార్చుకోమని సలహా ఇచ్చింది.

Recommended Video - Watch Now!
Ford Freestyle Review | Test Drive | Interior, Top Features & More - DriveSpark
డీలరుకు జరిమానా విధించిన కోర్టు

అయితే, రెనో డీలర్ ఇచ్చిన సమాధానంతో ఆశ్చర్యపోయిన ఇస్మాయిల్ అందుకు ఒప్పుకోకపోగా, వారంటీ ఉంది కాబట్టి వారంటీలో భాగంగానే రేడిటర్‌ను రిపేర్ చేయాలని సూచించాడు. అయితే, డీలరు ఇందుకు అంగీకరించలేదు.

డీలరుకు జరిమానా విధించిన కోర్టు

డీలర్ నిర్వాహకులు రేడియర్‌ను కమ్మీతో బిగించి తాత్కాలికంగా రిపేరీ చేశారు. ఆశ్చర్యకరంగా, రేడియేటర్‌ను బిగించిన ఆ కమ్మీతో సుమారుగా 13,000 కిలోమీటర్లు నడిచింది. అయితే, రెండవ సమస్యతో మళ్లీ రెనో డస్టర్ ఆగిపోయింది.

డీలరుకు జరిమానా విధించిన కోర్టు

ఈ సారి డస్టర్ సస్పెన్షన్ సిస్టమ్‌లో సమస్య తలెత్తింది. విసిగిపోయిన ఇస్మాయిల్ తన కారును డీలర్ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. సుమారుగా 12 రోజులైనా, ఆ కారుకు ఎలాంటి రిపేరి చేయలేదు, దాని గురించి ఎలాంటి సమాచారం కస్టమర్‌కు అందివ్వలేదు. దీంతో ఇస్మాయిల్ అడ్వకేట్ కావడంతో ఈ విషయాన్ని వినియోగదారుల కోర్టుకు తీసుకెళ్లాడు.

డీలరుకు జరిమానా విధించిన కోర్టు

తీర్పు

ఈ కేసు వాదోపవాదనల అనంతరం సుమారుగా మూడేళ్ల తరువాత తీర్పుకు వచ్చింది. మంగళూరు వినియోగదారుల కోర్టు ఇస్మాయిల్‌కు సానుకూలంగా తీర్పునిచ్చింది. రెనో డస్టర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.64 లక్షలను నష్టపరిహారంగా కస్టమర్‌కు చెల్లించాలని డీలరును సూచించింది.

డీలరుకు జరిమానా విధించిన కోర్టు

అదనంగా, ఇస్మాయిల్ తన డస్టర్ కారు రిపేరీ కోసం వెచ్చించిన రూ. 23,000 లు మరియు మరియు మానసిక ఒత్తిడికి కారణమైనందుకు రూ. 25,000 లతో పాటు ఫిర్యాదు ఖర్చుల క్రింద మరో రూ. 10,000 లను కస్టమర్‌కు చెల్లించాలని తీర్పునిచ్చింది. దీంతో భాద్యతారహితంగా వ్యవహరించిన డీలరుకు మొత్తం 9.23 లక్షల రుపాయలను నష్టపరిహారంగా కస్టమర్‌కు చెల్లించాలని సూచించింది.

డీలరుకు జరిమానా విధించిన కోర్టు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఈ మొత్తం వ్యవహారంతో రెనో డస్టర్‌లో సాంకేతిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ, ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో నమ్మకమైన కారు రెనో డస్టర్. అంతే కాకుండా రెనో డస్టర్ అత్యుత్తమ ఆఫ్ రోడ్ మరియు ఆన్ రోడ్ ఎస్‌యూవీగా బాగా గుర్తింపు పొందింది.

డీలరుకు జరిమానా విధించిన కోర్టు

తన కారులో రేడియేటర్ మరియు సస్పెన్షన్ సిస్టమ్‌తో పాటు క్యాబిన్‌లోకి నీరు చేరడం, ఎయిర్-కండీషనింగ్ సంభందించిన సమస్యలు ఉన్నట్లు కూడా వివరించాడు. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని రెనో డీలర్ల వద్ద సేల్స్ అనంతరం వచ్చే సర్వీసింగ్స్ మరియు నిర్వహణలో చాలా దారుణంగా ఉన్నట్లు తెలిసింది.

డీలరుకు జరిమానా విధించిన కోర్టు

రెనో డస్టర్ సబ్ స్టాండర్డ్ ప్రొడక్ట్ అనడం చాలా మందికి మింగుడుపడదు. ఏదేమైనప్పటికీ, రెండు అంశాల పరంగా చెలరేగిన సమస్యలను నిజమేనని ఒప్పుకోవాల్సి వస్తుంది. రేడియేటర్ సమస్య తరువాత ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన అనంతరమే సస్పెన్షన్ సమస్య వచ్చింది.

డీలరుకు జరిమానా విధించిన కోర్టు

మరో అంశం, అరుగుదల మరియు తరుగుదల. ఇది ప్రతి కారులో కూడా కామన్‌గా ఉంటుంది. కదిలే విడి భాగాల మధ్య అరుగుదల మరియు తరుగుదల ఖచ్చితంగా ఉంటుంది. కానీ, చక్కటి నిర్వహణ మరియు జాగ్ర్తత్తగా డ్రైవ్ చేస్తే ఇలాంటి సమస్యలు తలెత్తవు.

డీలరుకు జరిమానా విధించిన కోర్టు

1. రిజిస్ట్రేషన్ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారా...?

2.బొలెరోను మెర్సిడెస్ బెంజ్‌గా మార్చుకోండి!!

3.మోడిఫికేషన్స్‌కు పులిస్టాప్ పెట్టేందుకే RTOల కొత్త ఎత్తుగడ

4.ఎట్టకేలకు విడుదలకు సిద్దమైన మహీంద్రా ఎమ్‌పీవీ

5.సాంకేతిక లోపంతో కాలి బూడిదైన ఫోర్డ్ ఎండీవర్

Source: Rushlane

English summary
Read In Telugu: Renault Dealership To Pay Rs 9.23 Lakh As Compensation For Selling Faulty Renault Duster
Story first published: Saturday, April 14, 2018, 8:13 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark