రెనో క్విడ్ సూపర్ హీరో ఎడిషన్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు
ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో తమ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్ కారును సూపర్ హీరో ఎడిషన్‌లో విపణిలోకి విడుదల చేసింది. క్విడ్ సూపర్ హీరో ఎడిషన్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 4.34 లక్షలు.
Recommended Video

ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో తమ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్ కారును సూపర్ హీరో ఎడిషన్‌లో విపణిలోకి విడుదల చేసింది. సరికొత్త క్విడ్ సూపర్ హీరో ఎడిషన్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 4.34 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

డిస్నికి చెందిన మార్వెల్‌తో భాగస్వామ్యంతో క్విడ్ తమ సూపర్ హీరో ఎడిషన్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసింది. అవెంజర్ సిరీస్‌లోని సూపర్ హీరోల ప్రేరణను ప్రతిబింబించే ప్రత్యేక బాడీ డీకాల్స్ మరియు గ్రాఫిక్స్ ఉన్నాయి.

లిమిటెడ్ ఎడిషన్‌లో విడుదలైన సూపర్ హీరో క్విడ్ రెండు విభిన్న రూపాల్లో లభిస్తున్నాయి. అవి, రెనో క్విడ్ క్యాప్టెన్ అమెరికా ఎడిషన్ మరియు రెనో క్విడ్ ఐరన్ మ్యాన్ ఎడిషన్.

రెండు రకాల క్విడ్ సూపర్ హీరో మోడళ్లు 1.0-లీటర్ ఇంజన్ గల ఆర్ఎక్స్‌టి వేరియంట్ ఆధారంగా రెనో తీసుకొచ్చింది. రెగ్యులర్ వెర్షన్ క్విడ్ ఆర్ఎక్స్‌టితో పోల్చుకుంటే ఇది రూ. 29,000 ల వరకు ఖరీదైనది.

రెనో క్విడ్ సూపర్ హీరో ఎడిషన్ నచ్చిందా...? అయితే, దీనిని రూ. 9,999 లతో అమెజాన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. క్విడ్ సూపర్ హీరో ఎడిషన్ వేరియంట్లను మార్వెల్ సూపర్ హీరోలయిన ఐరన్ మ్యాన్ మరియు క్యాప్టెన్ అమెరికా ప్రేరణతో పెయింట్ స్కీమ్ అందివ్వడం జరిగింది.

రెనో క్విడ్ ఐరన్ మ్యాన్ ఎడిషన్ ఎక్ట్సీరియర్‌లో ఆర్క్ రియాక్టర్ మరియు ఐరన్ మ్యాన్ ఆర్మర్ ప్రేరణ పొందిన బాడీ గ్రాఫిక్స్, గోల్డెన్ మరియు రెడ్ పెయింట్ జాబ్ గమనించవచ్చు. రియర్ డోర్ క్లాడింగ్ మీద ఇన్విసిబుల్ డీకాల్స్ గుర్తించవచ్చు.

అదే విధంగా రెనో క్విడ్ క్యాప్టెన్ అమెరికా కారు ఎక్ట్సీరియర్‌లో సూపర్ హీరో సూట్ మరియు షీల్డ్ ప్రేరణ పొందిన బాడీ గ్రాఫిక్స్ ఉన్నాయి. అంతే కాకుండా సూపర్ సోల్జర్ డీకాల్ కారు రియర్ డోర్ క్లాడింగ్ మీద గుర్తింవచ్చు.

ఫీచర్ల పరంగా చూస్తే, క్విడ్ ఆర్ఎక్స్‌టి(ఒ) వేరియంట్ కంటే స్పెషల్ ఎడిషన్ క్విడ్ ఎంతో ఉత్తమం అని చెప్పవచ్చు. ఇందులో న్యావిగేషన్ సపోర్ట్ చేయగల 7.0-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

సాంకేతికంగా రెనో క్విడ్ సూపర్ హీరో ఎడిషన్‌లో 1.0-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

క్విడ్ విడులైన తొలినాళ్లలో రెనో మంచి సక్సెస్ అందుకుంది. అంతే కాకుండా, సందర్భాన్ని బట్టి రెనో ఇండియా తమ క్విడ్ కారును పలు దఫాలు విభిన్న స్పెషల్ ఎడిషన్‌లలో లాంచ్ చేసింది. ప్రత్యేక కస్టమర్లను టార్గెట్ చేస్తూ రెనో తమ క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌ను సూపర్ హీరో ఎడిషన్‌లో ప్రవేశపెట్టింది.

ఎలాంటి బాడీ గ్రాఫిక్స్ లేకుండా, రెగ్యులర్ వెర్షన్ క్విడ్ కావాలనుకునేవారు సాధారణ క్విడ్ ఎంచుకోవచ్చు. మార్వెల్ మరియు అవెంజర్ ఎడిషన్‌లను ఇష్టపడే వారు క్విడ్ సూపర్ హీరో ఎడిషన్‌లను ఎంచుకోవచ్చు.
Trending DriveSpark Telugu YouTube Videos


Click it and Unblock the Notifications








