విపణిలోకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ సిగ్నల్స్ 350 లాంచ్: ఇవీ ప్రత్యేకతలు!!
రాయల్ ఎన్ఫీల్డ్ నేడు విపణిలోకి సరికొత్త క్లాసిక్ సిగ్నల్స్ 350 బైకును విడుదల చేసింది. నూతన కలర్ ఆప్షన్స్ మరియు పలు రకాల అదనపు ఫీచర్లు గల రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ సిగ్నల్స్ 350 బైకు ప్రారంభ ధర రూ. 1.6
దేశీయ అగ్రామి ఐకానిక్ బైకుల తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ నేడు విపణిలోకి సరికొత్త క్లాసిక్ సిగ్నల్స్ 350 బైకును విడుదల చేసింది. నూతన కలర్ ఆప్షన్స్ మరియు పలు రకాల అదనపు ఫీచర్లు గల రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ సిగ్నల్స్ 350 బైకు ప్రారంభ ధర రూ. 1.62 లక్షలు ఎక్స్-షోరూమ్(పూనే)గా ఉన్నట్లు కంపెనీ నిర్ణయించింది.
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ సిగ్నల్స్ 350 గురించి పూర్తి వివరాలు మరియు సాధారణ క్లాసిక్ 350 మోడల్‌కు దీనికి మధ్యనున్న తేడా ఏంటో చూద్దాం రండి...

సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ సిగ్నల్స్ 350 రెండు విభిన్న రంగుల్లో విడుదలైంది. అవి, ఎయిర్‌బార్న్ బ్లూ మరియు స్టార్మ్‌రైడర్ శాండ్. భారత సైనిక దళంలో ఉన్న యుద్ద విమానాల ప్రేరణతో, వాటి గౌరవాత్మకంగా ఈ రెండు రంగులను పరిచయం చేశారు. అయితే, స్టార్మ్‌రైడర్ శాండ్ కలర్ క్లాసిక్ 350 డెసర్ట్‌స్టార్మ్ మోడల్ శైలిలో ఉంటుంది.

క్లాసిక్ సిగ్నల్స్ 350 బైకులోని ఫ్యూయల్ ట్యాంక్ మీద విభిన్నమైన నెంబరింగ్ సిస్టమ్ కలదు. ఈ నెంబర్ ఉత్పత్తి సంఖ్యను సూచిస్తుంది. అంతే కాకుండా, బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్న ఇంజన్, చక్రాలు, సైలెన్సర్ మరియు డార్క్ ట్యాన్ సీట్ వంటివి ఉన్నాయి.

క్లాసిక్ సిగ్నల్స్ 350 మోడల్‌లో వచ్చిన కీలకమైన మార్పు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ రావడం. అవును, టూ వీలర్ల సేఫ్టీలో అత్యంత కీలకమైన ఏబిఎస్ టెక్నాలజీ ఇప్పుడు క్లాసిక్ సిరీస్ బైకుల్లో వచ్చింది. మెరుగైన మరియు పటిష్టమైన బ్రేకింగ్ దీని సొంతం.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ సిగ్నల్స్ 350 బైకులో సాంకేతికంగా 346సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 19బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

డిజైన్ మరియు ఇంజన్ పరంగా దాదాపు అన్ని విడి భాగాలు రెగ్యులర్ క్లాసిక్ 350 మోడల్‌నే పోలి ఉంటాయి. బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి ఇరు వైపులా డిస్క్ బ్రేకులు మరియు డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలదు.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ సిగ్నల్స్ 350 బైకు కోసం మరెన్నో అధునాతన యాక్ససరీల లభ్యమవుతున్నాయి. కస్టమర్లు, హెవీ-డ్యూటీ వాటర్ ప్రూఫ్ మిలిటరీ సైడ్ బ్యాగులు, విశాలమైన స్టీల్ ఇంజన్ గార్డ్, టూరింగ్ సీట్లు, ముందు వైపున పొడవాటి ఫైబర్ అద్దం(విండ్ షీల్డ్), తుప్పుపట్టని మరియు ఎక్కువ కాలం మన్నిక వచ్చే స్టీల్ ర్యాక్స్ మరియు అల్యూమినియం చక్రాలు ఇంకా ఎన్నో యాక్ససరీలు ఎంచుకోవచ్చు.

క్లాసిక్ సిగ్నల్స్ 350 మోటార్ సైకిల్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ అధీకృత డీలర్ల వద్ద బుక్ చేసుకోవచ్చు. మరియు ఇతర మోడళ్ల మాదిరిగానే అన్ని షోరూముల్లో లభ్యమవుతోంది.

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!
రాయల్ ఎన్ఫీల్డ్ సరికొత్త క్లాసిక్ సిగ్నల్స్ 350 బైకును భారత ఆర్మీ దళాలకు నివాళిగా తీసుకొచ్చింది. ఇది లభించే రెండు రంగులను కూడా ఇండియన్ ఆర్మీ లోని రెండు యుద్ద విమానాలకు ప్రేరణగా పరిచయం చేసింది. ఏబిఎస్ తీసుకురావడాన్ని మరో ప్రధాన హైలెట్‌గా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications








