స్కోడా ర్యాపిడ్‌‌లో మరో అదనపు సేఫ్టీ ఫీచర్లు

స్కోడా ఇండియా ర్యాపిడ్ సెడాన్ కారులో సేఫ్టీ ఫీచర్లను అప్‌డేట్ చేసింది. ర్యాపిడ్ సెడాన్ టాప్ ఎండ్ వేరియంట్లో ఎయిర్ బ్యాగుల సంఖ్యను నాలుగుకు పెంచింది.

By Anil

Recommended Video

Bangalore Helmet Ban For Non-ISI Models

స్కోడా ఇండియా ర్యాపిడ్ సెడాన్ కారులో సేఫ్టీ ఫీచర్లను అప్‌డేట్ చేసింది. ర్యాపిడ్ సెడాన్ టాప్ ఎండ్ వేరియంట్లో ఎయిర్ బ్యాగుల సంఖ్యను నాలుగుకు పెంచింది. స్కోడా ర్యాపిడ్ స్టైల్ టాప్ ఎండ్ వేరియంట్ కారులో ఇది వరకు ఉన్న ఫ్రంట్ ప్యాసింజర్స్ ఎయిర్ బ్యాగులకు అదనంగా మరో రెండు ఎయిర్ బ్యాగులను అందించినట్లు స్కోడా ఇండియా వెల్లడించింది.

 స్కోడా ర్యాపిడ్

చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన స్కోడా ఆటో నవంబర్ 2016లో స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ సెడాన్ కారును యాక్టివ్, ఆంబిషన్ మరియు స్టైల్ అనే మూడు విభిన్న వేరియంట్లలో ప్రవేశపెట్టింది.

 స్కోడా ర్యాపిడ్

అయితే, స్కోడా ర్యాపిడ్ స్టైల్ టాప్ ఎండ్ వేరియంట్ కేవలం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులతో మాత్రమే లభించేది. ప్రయాణికుల సేఫ్టీ దృష్ట్యా ఇందులో మరో రెండు ఎయిర్ బ్యాగులను అదనంగా చేర్చింది.

 స్కోడా ర్యాపిడ్

స్కోడా ర్యాపిడ్ సెడాన్ విపణిలో ఉన్న హోండా సిటి మరియు హ్యుందాయ్ వెర్నా మోడళ్లతో పోటీ పడుతోంది. స్కోడా ర్యాపిడ్‌కు పోటీగా ఉన్న మోడళ్లు టాప్ ఎండ్ వేరియంట్లో ఆరు ఎయిర్ బ్యాగులను అందిస్తున్నాయి. అయితే, నాలుగు ఎయిర్ బ్యాగులతో అందుబాటులోకి రావడంతో స్కోడా ర్యాపిడ్ మరింత పాపులర్ అయ్యే అవకాశం ఉంది.

 స్కోడా ర్యాపిడ్
స్కోడా స్టైల్ వేరియంట్లు ధరలు
1.6 పెట్రోల్ (మ్యాన్యువల్ గేర్‌బాక్స్) రూ. 10.61 లక్షలు
1.6 పెట్రోల్ (ఆటోమేటిక్ గేర్‌బాక్స్) రూ. 11.85 లక్షలు
1.5 డీజల్ (మ్యాన్యువల్ గేర్‌బాక్స్) రూ. 12.42 లక్షలు
1.5 డీజల్ (ఆటోమేటిక్ గేర్‌బాక్స్) రూ. 13.56 లక్షలు
 స్కోడా ర్యాపిడ్

మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో ఉన్న హోండా సిటి మరియు హ్యుందాయ్ వెర్నాలోని టాప్ ఎండ్ వేరియంట్ల ధరలతో పోల్చుకుంటే స్కోడా ర్యాపిడ్ టాప్ ఎండ్ వేరియంట్ ధర తక్కువే. అయితే, ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు లేవు.

Trending On DriveSpark Telugu:

ఎయిర్ బ్యాగ్స్: ఎలా పనిచేస్తాయి, ఎన్ని రకాలు, చరిత్ర

ఆరు ఎయిర్ బ్యాగ్‌లు గల అత్యంత చౌకైన కారు...!!

 స్కోడా ర్యాపిడ్

2016లో స్కోడా లాంచ్ చేసిన ర్యాపిడ్ సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ కారును 2017లో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, టాప్ ఎండ్ వేరియంట్లో రివర్స్ కెమెరాతో అప్‌డేట్ చేసింది. ఇప్పుడు ఇదే వేరియంట్లో మరో రెండు ఎయిర్ బ్యాగులను జోడించింది.

 స్కోడా ర్యాపిడ్

స్కోడా ర్యాపిడ్ ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇది పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్లతో లభిస్తోంది. సాంకేతికంగా ర్యాపిడ్ పెట్రోల్ వేరియంట్లోని 1.6-లీటర్ ఇంజన్ 105బిహెచ్‌పి పవర్ మరియు 153ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

 స్కోడా ర్యాపిడ్

మరియు స్కోడా ర్యాపిడ్ డీజల్ వేరియంట్లోని 1.5-లీటర్ కెపాసిటి గల టుర్భోఛార్జ్‌డ్ ఇంజన్ గరిష్టంగా 108బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

 స్కోడా ర్యాపిడ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్కోడా ఇండియా ర్యాపిడ్ విషయంలో కస్టమర్లకు అత్యుత్తమ భద్రతను కల్పించేందుకు గాను ర్యాపిడ్ సెడాన్ కారులో అదనంగా మరో రెండు ఎయిర్ బ్యాగులను చేర్చింది. అంతే కాకుండా ఈ అప్‌డేట్‌తో మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో స్కోడా తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

అధునానత ఫీచర్లతో తమ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే స్కోడా ఆటో ఇండియా దేశీయంగా ఉన్న ప్రధాన నగరాలు మరియు జిల్లా కేంద్రాలకు తమ విక్రయ కేంద్రాలను విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

Read more on: #skoda #స్కోడా
English summary
Read In Telugu: Skoda Rapid Airbags In Top Variant Increased To Four; The Rapid Gets Safer
Story first published: Wednesday, January 24, 2018, 13:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X