స్కోడా సూపర్బ్ కార్పోరేట్ ఎడిషన్ విడుదల: ధర రూ. 23.49 లక్షలు

స్కోడా ఆటో విపణిలోకి సరికొత్త స్కోడా సూపర్బ్ కార్పోరేట్ ఎడిషన్ కారును విడుదల చేసింది. స్కోడా ఇండియా తమ సూపర్బ్ కార్పోరేట్ ఎడిషన్ కారును ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా నిశ్శబ్ధంగా రూ. 23.49 లక్షల ప్రారంభ ఎక

By Anil Kumar

చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన స్కోడా ఆటో బుధవారం నాడు విపణిలోకి సరికొత్త స్కోడా సూపర్బ్ కార్పోరేట్ ఎడిషన్ కారును విడుదల చేసింది. స్కోడా ఇండియా తమ సూపర్బ్ కార్పోరేట్ ఎడిషన్ కారును ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా నిశ్శబ్ధంగా రూ. 23.49 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసింది.

స్కోడా సూపర్బ్ కార్పోరేట్ ఎడిషన్

ఇప్పటికే స్కోడా కారును వినియోగిస్తున్న కస్టమర్లలో ఖరీదైన కారుకు అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా ఈ సూపర్బ్ కార్పోరేట్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. స్కోడా సూపర్బ్ రెగ్యులర్ వేరియంట్‌తో పోల్చుకుంటే కార్పోరేట్ ఎడిషన్‌లో పెద్దగా గుర్తించదగిన మార్పులేమీ చోటు చేసుకోలేదు.

స్కోడా సూపర్బ్ కార్పోరేట్ ఎడిషన్

స్కోడా సూపర్బ్ మూడు పెట్రోల్ వేరియంట్లు మరియు రెండు డీజల్ ఇంజన్ వేరియంట్లతో లభిస్తోంది. పెట్రోల్ వెర్షన్ ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ రెండు రకాల గేర్‌బాక్స్‌ ఆప్షన్‌లతో లభిస్తుండగా, డీజల్ వేరియంట్లో కేవలం ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం మాత్రమే ఉంది.

స్కోడా సూపర్బ్ కార్పోరేట్ ఎడిషన్

స్కోడా సూపర్బ్ సెడాన్‌లోని నాలుగు సిలిండర్ల 1.8-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 177బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

స్కోడా సూపర్బ్ కార్పోరేట్ ఎడిషన్

స్కోడా సూపర్బ్‌లోని 2-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ గరిష్టంగా 175బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే, ఇది కేవలం 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో మాత్రమే లభ్యమవుతోంది.

స్కోడా సూపర్బ్ కార్పోరేట్ ఎడిషన్

స్కోడా సూపర్బ్ లగ్జరీ సెడాన్ కారులో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ప్రత్యేకించి జెనాన్ హెడ్‌ల్యాంప్స్, అడాప్టివ్ ఫ్రంట్ లైట్ సిస్టమ్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో డిస్ల్పే సపోర్ట్ గల రియర్ వ్యూవ్ కెమెరా మరియు త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

స్కోడా సూపర్బ్ కార్పోరేట్ ఎడిషన్

ఇతర ఫీచర్లలో ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రికల్‌గా 12-మార్గాల్లో అడ్జెస్ట్ చేసుకునే సౌకర్యం ఉన్న డ్రైవర్ సీటు మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.

స్కోడా సూపర్బ్ కార్పోరేట్ ఎడిషన్

ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ మరియు సైడ్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, హిల్-హోల్డ్ కంట్రోల్ ఇంకా ఎన్నో సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

స్కోడా సూపర్బ్ కార్పోరేట్ ఎడిషన్

ఇప్పటికే స్కోడా కార్లను ఉపయోగిస్తున్న కస్టమర్లలో ఖరీదైన మరియు ప్రీమియం కార్లకు అప్‌‌గ్రేడ్ అవ్వాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుని స్కోడా సూపర్బ్ కార్పోరేట్ ఎడిషన్ కారును లాంచ్ చేసింది. దీనికి కనుక మంచి ఆదరణ లభిస్తే మరో కొత్త ఎడిషన్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, ధర విషయంలో స్కోడా కస్టమర్లను కోల్పోయే ప్రమాదం ఉంది.

స్కోడా సూపర్బ్ కార్పోరేట్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఖరీదైన కార్లను ఎంచుకునే కస్టమర్ల కోసం సూపర్బ్ కార్పోరేట్ ఎడిషన్ కారును విడుదల చేసింది. అయినప్పటికీ, దీని ధర ఎక్కువనే అనిపిస్తోంది. స్కోడా సూపర్బ్ కార్పోరేట్ ఎడిషన్ కస్టమర్లను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 22, 2018, 14:58 [IST]
English summary
Read In Telugu: Skoda Superb Corporate Edition Launched In India; Priced At Rs 23.49 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+