సుజుకి కనెక్ట్ సిస్టమ్ విడుదల చేసిన మారుతి సుజుకి

మారుతి సుజుకి సరికొత్త సుజుకి కనెక్ట్ టెలిమ్యాటిక్స్ సొల్యూషన్ సిస్టమ్‌ను ప్రత్యేకించి తమ నెక్సా బ్రాండ్ కార్ల కోసం విడుదల చేసింది. సుజుకి కనెక్ట్ సిస్టమ్ వెహికల్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలర్ట్స్, లైవ్

By Anil Kumar

మారుతి సుజుకి సరికొత్త సుజుకి కనెక్ట్ టెలిమ్యాటిక్స్ సొల్యూషన్ సిస్టమ్‌ను ప్రత్యేకించి తమ నెక్సా బ్రాండ్ కార్ల కోసం విడుదల చేసింది. సుజుకి కనెక్ట్ సిస్టమ్ వెహికల్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలర్ట్స్, లైవ్ వెహికల్ స్టేటస్ మరియు డ్రైవింగ్ ప్రవర్తన గురించిన సమాచారం అందిస్తుంది.

సుజుకి కనెక్ట్ సిస్టమ్ విడుదల చేసిన మారుతి సుజుకి

మారుతి సుజుకి నెక్సా విక్రయ కేంద్రాలలో లభించే ఇగ్నిస్, బాలెనో, ఎస్-క్రాస్ మరియు సియాజ్ కార్ల కోసం మాత్రమే ఇది లభ్యమవుతోంది. ఈ కార్లను ఇప్పటికే కొనగోలు చేసిన కస్టమర్లను రూ. 9,999 లు చెల్లించి అధునాతన సుజుకి కనెక్ట్ సిస్టమ్ పొందవచ్చు.

సుజుకి కనెక్ట్ సిస్టమ్ విడుదల చేసిన మారుతి సుజుకి

మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ మరియు సేల్స్ విభాగ అధిపతి ఆర్.ఎస్. కల్సి మాట్లాడుతూ, "సుజుకి కనెక్ట్ అత్యాధునిక టెలిమ్యాటిక్ సిస్టమ్. కారు యజమానులకు అద్భుతమైన అనుభవాన్ని కల్పించేందుకు ప్రత్యేకించి ఇండియా కోసం అభివృద్ది చేసి, పరీక్షించాము. కారు యజమానులు తమ కార్ల గురించి తెలుసుకోవాల్సిన వివరాలు మరియు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి దేశవ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించి దానికి అనుగుణంగా ఈ సుజుకి కనెక్ట్ సిస్టమ్‌ను తీసుకొచ్చామని వివరించాడు."

సుజుకి కనెక్ట్ సిస్టమ్ విడుదల చేసిన మారుతి సుజుకి

సుజుకి కనెక్ట్ టెలిమ్యాటిక్స్ కంట్రోల్ యూనిట్ (TCU) కేంద్రీకృత సర్వర్ ద్వారా సమాచారాన్ని అందిస్తుందని మారుతి సుజుకి వెల్లడించింది. ఈ సర్వర్ సెల్యులార్ నెట్‌వర్క్ ద్వారా నెక్సా కస్టమర్ కేర్ వ్యవస్థకు అనుసంధానించబడి ఉంటుంది. కాబట్టి, వెహికల్‌కు సంభందించిన పూర్తి సమాచారం సేఫ్‌గా ఉంటుంది.

సుజుకి కనెక్ట్ సిస్టమ్ విడుదల చేసిన మారుతి సుజుకి

అంతే కాకుండా, కార్లలో ఈ సుజుకి కనెక్ట్ పరికరాన్ని సురక్షితంగా ఇన్‌స్టాల్ చేసేందుకు సుమారుగా 2,800 మంది టెక్నీషియన్లకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చినట్లు మారుతి సుజుకి పేర్కొంది. ఆర్.ఎస్ మాట్లాడుతూ, "2020 నాటికి కనెక్టెడ్ కార్ల శాతం 2.6 శాతం మాత్రమే ఉంటుందని అంచనా. తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ నూతన టెక్నాలజీని కస్టమర్లు ఖచ్చితంగా ఇష్టపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు."

కస్టమర్లు మరియు వారి కార్లకు సంభందించిన డేటా మొత్తం మారుతి సుజుకి క్లౌడ్ ఫ్లాట్‌ఫామ్‌లో అత్యంత సురక్షితంగా నిక్షిప్తమై ఉంటుంది. వెహికల్-టు-క్లౌడ్ ఈ దిశలో మాత్రమే పనిచేస్తుంది. సుజుకి కనెక్ట్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. వొడాఫోన్ అఫీషియల్ సర్వీస్ ప్రొవైడర్‌గా ఉంది.

సుజుకి కనెక్ట్ సిస్టమ్ విడుదల చేసిన మారుతి సుజుకి

మారుతి సుజుకి నిర్వహించిన సర్వే అనంతరం టెలిమ్యాటిక్ కంట్రోల్ యూనిట్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సేఫ్టీ, సెక్యూరిటీ మరియు వెహికల్ పనితీరు పరంగా కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సర్వేలో గుర్తించారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచారాన్ని ఐదుగురు కుటుంబ సభ్యులకు చేరవేస్తుంది, ఇందుకు ముందగానే ఐదు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

సుజుకి కనెక్ట్ సిస్టమ్ విడుదల చేసిన మారుతి సుజుకి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కస్టమర్లు కోసం మారుతి సుజుకి ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజీ నిజంగా హర్షించదగినది. కారు ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఈ పరికరం ద్వారా పూర్తి సమచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అదనంగా, ఈ సిస్టమ్ కారును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటుంది. మీ వద్ద కనుక నెక్సా షోరూమ్‌లో కొనుగోలు చేసిన కారు ఉన్నట్లయితే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓ డివైజ్‌కు ఆర్డర్ ఇచ్చేయండి.

Most Read Articles

English summary
Read In Telugu: Suzuki Connect Launched In India By Maruti Suzuki At Rs 9,999
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X