ఎర్టిగా స్పోర్ట్ కాన్సెప్ట్ ఎమ్‌పీవీని ఆవిష్కరించిన సుజుకి

జపాన్ దిగ్గజం సుజుకి తాజాగా సరికొత్త ఎర్టిగా స్పోర్ట్ కాన్సెప్ట్ ఎ‌మ్‌పీవీ వాహనాన్ని ఆవిష్కరించింది. ఇండోనేషియాలోని జకార్తాలో జరుగుతున్న 2018 గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షోలో ఎర్టిగా స్పోర్ట్ ఎ

By Anil Kumar

జపాన్ దిగ్గజం సుజుకి తాజాగా సరికొత్త ఎర్టిగా స్పోర్ట్ కాన్సెప్ట్ ఎ‌మ్‌పీవీ వాహనాన్ని ఆవిష్కరించింది. ఇండోనేషియాలోని జకార్తాలో జరుగుతున్న 2018 గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షోలో ఎర్టిగా స్పోర్ట్ ఎమ్‌పీవీని ప్రదర్శించింది. ఈ ఎర్టిగా స్పోర్ట్ కాన్సెప్ట్ ఎమ్‌పీవీని ఇండియన్ మార్కెట్లో అతి త్వరలో విడుదల కానున్న మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పీవీ ఆధారంగా రూపొందించారు.

సుజుకి ఎర్టిగా స్పోర్ట్ కాన్సెప్ట్ ఎమ్‌పీవీ గురించి మరిన్ని వివరాలు మరియు ఫోటోలు...

ఎర్టిగా స్పోర్ట్ కాన్సెప్ట్ ఎమ్‌పీవీని ఆవిష్కరించిన సుజుకి

త్వరలో వస్తోన్న ఎర్టిగా ఎమ్‌పీవీ యొక్క స్పోర్ట్ కాన్సెప్ట్ వెర్షన్‌లో ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పలు కాస్మొటిక్ అప్‌డేట్స్, స్మోక్డ్ హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ ల్యాంప్స్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు బ్లాక్ ఎండ్ గల ఫ్రంట్ గ్రిల్ ఉంది.

ఎర్టిగా స్పోర్ట్ కాన్సెప్ట్ ఎమ్‌పీవీని ఆవిష్కరించిన సుజుకి

సుజుకి ఎర్టిగా స్పోర్ట్ కాన్సెప్ట్ ఎమ్‌పీవీ విభిన్నమైన స్పోర్టివ్ బాడీ కిట్‌తో వచ్చింది, దీంతో మెరుగైన సస్పెన్షన్ సిస్టమ్, తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు రూఫ్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా, ఎక్ట్సీరియర్‌లో ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్ గల ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు పలు క్రోమ్ సొబగులు ఉన్నాయి.

ఎర్టిగా స్పోర్ట్ కాన్సెప్ట్ ఎమ్‌పీవీని ఆవిష్కరించిన సుజుకి

ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్లో ఉన్న కొత్త తరం ఎర్టిగా ఎమ్‌పీవీ యొక్క టాప్ ఎండ్ వేరియంట్ ఆధారంగా సరికొత్త స్పోర్ట్ కాన్సెప్ట్ వెర్షన్‌ను డెవలప్ చేశారు. స్పోర్టివ్ వెర్షన్ ఎర్టిగా ఎమ్‌పీవీ కాస్మొటిక్ సొబగులు మినహాయిస్తే, సాంకేతికంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

ఎర్టిగా స్పోర్ట్ కాన్సెప్ట్ ఎమ్‌పీవీని ఆవిష్కరించిన సుజుకి

న్యూ జనరేషన్ ఎర్టిగా ఎమ్‌పీవీలో సాంకేతికంగా 1.5-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ సుజుకి వారి స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్‌ జోడింపుతో వస్తోంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 103బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఎర్టిగా స్పోర్ట్ కాన్సెప్ట్ ఎమ్‌పీవీని ఆవిష్కరించిన సుజుకి

ఆగష్టు 20 వ తేదీన విడుదలకు సిద్దమైన సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మరియు పండుగ సీజన్‌లో విడుదలవ్వనున్న ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ కార్లలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ పరిచయం కానుంది. రెండు మోడళ్లను కూడా ఇప్పటికే పలుమార్లు అత్యంత రహస్యంగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది.

ఎర్టిగా స్పోర్ట్ కాన్సెప్ట్ ఎమ్‌పీవీని ఆవిష్కరించిన సుజుకి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి 2018 ఎర్టిగా ఎమ్‌పీవీని విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది పండుగ సీజన్ ప్రారంభమయ్యే నాటికల్లా విడుదలయ్యే అవకాశం ఉంది. ధరలకు సంభందించి ఎలాంటి సమాచారం లేదు, అయితే రూ. 6.5 లక్షల నుండి రూ. 7 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

Source:Rushlane

More from DriveSpark

Article Published On: Friday, August 3, 2018, 15:55 [IST]
English summary
Suzuki Ertiga Sport Concept Unveiled At GIIAS 2018: Will It Launch In India?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+