ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ ఆవిష్కరించిన సుజుకి

జపాన్ దిగ్గజం సుజుకి సరికొత్త ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. ఇండోనేషియాలోని జకార్తా నగర వేదకగా జరుగుతున్న 2018 గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షోలో సుజుకి మోటార్ కార్పోరేషన్ సరి

By Anil Kumar

జపాన్ దిగ్గజం సుజుకి సరికొత్త ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. ఇండోనేషియాలోని జకార్తా నగర వేదకగా జరుగుతున్న 2018 గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షోలో సుజుకి మోటార్ కార్పోరేషన్ సరికొత్త 2018 సుజుకి ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది.

సుజుకి ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ గురించి మరిన్ని వివరాలు మరియు ఫోటోలు...

ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ ఆవిష్కరించిన సుజుకి

సుజుకి ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ అప్‌డేటెడ్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ అంశాలను కలిగి ఉంది. నూతన మరియు విభిన్న డిజైన్ ఎలిమెంట్లతో ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ చాలా అగ్రెసివ్ శైలిలో ఉంది. అయితే, చూడటానికి దాదాపు రెగ్యులర్ మోడల్ ఇగ్నిస్‌నే తలపిస్తుంది.

ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ ఆవిష్కరించిన సుజుకి

సుజుకి ఇండోనేషియా మార్కెట్లో ఇప్పటికే బ్లాక్ బంపర్, సైడ్ స్కర్ట్, స్కిడ్ ప్లేట్ మరియు రియర్ స్పాయిలర్ గల ఇగ్నిస్ కారును విక్రయిస్తోంది. అయితే, ఈ స్పోర్ట్ కాన్సెప్ట్ వెర్షన్ ఇగ్నిస్ కారును స్పెషల్ ఎడిషన్‌గా పరిచయం చేసే అవకాశం ఉంది.

Image Courtesy: Oto Spirit

ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ ఆవిష్కరించిన సుజుకి

సుజుకి ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ కారులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు లేవు కాబట్టి ఇది ఇగ్నిస్ రెగ్యులర్ వెర్షన్ యొక్క ఎంట్రీ లెవల్ వేరియంట్ అని తెలుస్తోంది. ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ పూర్తిగా బ్లాక్ కలర్ పెయింట్ ఫినిషింగ్‌లో ఇరువైపులా రెడ్ కలర్ స్ట్రిప్స్ కలిగి ఉంది.

ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ ఆవిష్కరించిన సుజుకి

సుజుకి ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ ఫ్రంట్ డిజైన్‌లో స్టాండర్డ్ క్రోమ్ స్థానంలో ఎల్ఈడీ డీఆర్ఎల్ బార్ వచ్చింది. అంతే కాకుండా, రియర్ డిజైన్‌లో రెడ్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్న స్పాయిలర్ వచ్చింది. ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ వెర్షన్‌లో 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. పలు రకాల డిజైన్ అంశాల జోడింపుతో ఇగ్నిస్ స్పోర్ట్ నిజంగానే స్పోర్టివ్ స్టైల్లో ఉంది.

ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ ఆవిష్కరించిన సుజుకి

సుజుకి ఇగ్నిస్ స్పోర్ట్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఆల్ బ్లాక్ థీమ్ గమనించవచ్చు. ప్రత్యేకమైన సీట్ అప్‌హోల్‌స్ట్రే మరియు మ్యూజిక్ సిస్టమ్ హైలెట్‌గా నిలిచాయి. టాప్ ఎండ్ వేరియంట్ ఇగ్నిస్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్ మరియు కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ ఆవిష్కరించిన సుజుకి

సుజుకి ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ కారులో సాంకేతికంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇందులోని, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 81.8బిహెచ్‌పి పవర్ మరియు 115ఎమ్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు.

ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ ఆవిష్కరించిన సుజుకి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సుజుకి ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ కారును ఇగ్నిస్ స్టాండర్డ్ మోడల్ యొక్క ఎంట్రీ లెవల్ వేరియంట్ ఆధారంగా రూపొందించారు. ఇందులో కాస్మొటిక్ మెరుగులు మరియు పలు అదనపు డిజైన్ ఎలిమెంట్ల జోడింపు మినహాయిస్తే సాంకేతికంగా మరియు ఓవరాల్ డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు సంభవించలేదు. ప్రస్తుతం ఇండోనేషియాలో ఆవిష్కరించిన ఇగ్నిస్ స్పోర్ట్ కాన్సెప్ట్ కారును ఇండియన్ మార్కెట్లో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, August 6, 2018, 10:09 [IST]
English summary
Read In Telugu: Suzuki Ignis Sport Concept Unveiled At 2018 Indonesia International Auto Show
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+