ఈ స్విఫ్ట్ కారు లీటరుకు 32కిమీల మైలేజ్ ఇస్తుంది

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క "స్ట్రాంగ్ హైబ్రిడ్" వెర్షన్‌ మోడల్‌ను ఇండోనేషియాలో జరుగుతున్న ఆటో షోలో ఆవిష్కరించింది. స్విఫ్ట్ హైబ్రిడ్ 2017 నుండి జపాన్ మార్కెట్లో అందుబాటులో ఉంది.

By Anil Kumar

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క "స్ట్రాంగ్ హైబ్రిడ్" వెర్షన్‌ మోడల్‌ను ఇండోనేషియాలో జరుగుతున్న ఆటో షోలో ఆవిష్కరించింది. స్విఫ్ట్ హైబ్రిడ్ 2017 నుండి జపాన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది లీటరుకు 32 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సుజుకి హైబ్రిడ్ స్ట్రాంగ్ గురించి మరిన్ని వివరాల కోసం...

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ స్ట్రాంగ్

జకార్తా నగర వేదికగా జరుగుతున్న గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షోలో ఆవిష్కరించింన స్విఫ్ట్ హైబ్రిడ్ స్ట్రాంగ్ మోడల్ ఫ్రంట్ డిజైన్‌లో ఉన్న హనీకాంబ్ మెష్ గ్రిల్ మరియు హైబ్రిడ్ బ్యాడ్జి మినహాయిస్తే, చూడటానికి అచ్చం రెగ్యులర్ మోడల్ స్విఫ్ట్‌నే పోలి ఉంటుంది.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ స్ట్రాంగ్

సుజుకి స్విఫ్ట్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్‌లో సాంకేతికంగా 1.2-లీటర్ సామర్థ్యం గల కె12సి సిరీస్ పెట్రోల్ ఇంజన్ మరియు మోటార్ జనరేటర్ యూనిట్(MGU) కలదు. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 90బిహెచ్‌పి పవర్ మరియు 118ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ స్ట్రాంగ్

ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్‌కు 100వోల్ట్ లిథియం-అయాన్ బ్యాటరీ నుండి పవర్ అందుతుంది. ఎలక్ట్రిక్ మోటార్ మాత్రమే 13.4బిహెచ్‌పి పవర్ మరియు 30ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ మరియు MGU యూనిట్ సంయుక్తంగా 103బిహెచ్‌పి-148ఎన్ఎమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. పెడల్ షిఫ్టర్స్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ స్ట్రాంగ్

ఇండియన్ వెర్షన్ స్విప్ట్ హ్యాచ్‌బ్యాక్‌తో పోల్చుకుంటే, ఇందులో ఉన్న 1.2-లీటర్ కె12బి సిరీస్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 82బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇండియన్ మోడల్ స్విఫ్ట్ కంటే జపాన్ వెర్షన్ చాలా శక్తివంతమైనది.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ స్ట్రాంగ్

అదే విధంగా, మైలేజ్ విషయానికి వస్తే, జపాన్ వెర్షన్ స్విఫ్ట్ హైబ్రిడ్ లీటరుకు 32కిలోమీటర్ల మైలేజ్‌నిస్తుంది, ఇండియన్ మార్కెట్లో ఉన్న మారుతి స్విఫ్ట్ మైలేజ్ దాని కంటే 10కిలోమీటర్లు తక్కువగా ఉంది.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ స్ట్రాంగ్

ఇండోనేషియా ఆటో షోలో ఆవిష్కరించిన సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ స్ట్రాంగ్ మోడల్‌లో పాదచారుల భద్రత కోసం లేజర్లు మరియు కెమెరాలు ఉన్నాయి. అదే విధంగా, మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం డ్యూయల్ సెన్సార్ బ్రేక్ సపోర్ట్ టెక్నాలజీ కూడా ఉంది.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ స్ట్రాంగ్

మారుతి సుజుకి ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్‌పో 2018లో స్విప్ట్ హైబ్రిడ్ మోడల్‌ను ఆవిష్కరించింది. ఏదేమైనప్పటికీ, స్విఫ్ట్ హైబ్రిడ్ ఇండియా విడుదల గురించి ఎలాంటి సమాచారం లేదు.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ స్ట్రాంగ్

2020 ఏప్రిల్ 1 నుండి అత్యంత కఠినమైన ఉద్గార ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి కాబట్టి బహుశా 2020లో మారుతి సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ కారును ఇండియన్ మార్కెట్‌కు ఖరారు చేసే అవకాశం ఉంది.

సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ స్ట్రాంగ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి 2020 నుండి ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిసిందే. దీనికి తోడు, ప్రస్తుతం విపణిలో ఉన్న సియాజ్, ఎర్టిగా మరియు ఎస్-క్రాస్ మోడళ్లలోని డీజల్ యూనిట్లలో హైబ్రిడ్ టెక్నాలజీని పరిచయం చేసింది కాబట్టి, స్విఫ్ట్ హైబ్రిడ్ విడుదలకు మరెంతో కాలం లేదని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: Suzuki Swift Strong Hybrid Showcased At 2018 Indonesia Auto Show — Will It Come To India?
Story first published: Saturday, August 4, 2018, 18:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X