2019 వితారా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన సుజుకి
సుజుకి వితారా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్ కోసం ఆవిష్కరించింది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వితారా ఎస్‌యూవీలో పలు కాస్మొటిక్ అప్‌డేట్స్‌తో డిజైన్ పరంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అంతే కాక
సుజుకి మోటార్ కార్పోరేషన్ సరికొత్త 2019 సుజుకి వితారా ఫేస్‌కలిఫ్ట్ ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్ కోసం ఆవిష్కరించింది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వితారా ఎస్‌యూవీలో పలు కాస్మొటిక్ అప్‌డేట్స్‌తో పాటు ముందు మరియు వెనుక వైపున డిజైన్ పరంగా మార్పులు చోటు చేసుకున్నాయి. అంతే కాకుండా పలు నూతన ఫీచర్లను కూడా జోడించింది.

సుజుకి మోటార్ కార్పోరేషన్ సరిగ్గా 2015లో ఇంగ్లాండ్ విపణిలోకి వితారా ఎస్‌యూవీని లాంచ్ చేసింది, ఇప్పటి నుండి సుజుకి వితారా మంచి సేల్స్ సాధిస్తోంది. సుజుకి అంతర్జాతీయ విపణిలో ఉన్న అత్యంత ప్రభావవంతమైన మోడళ్లలో వితారా ఎస్‌యూవీ ఒకటి.

సుజుకి మోటార్స్ ఈ వితారా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని వితారా సిరీస్ II పేరుతో విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త తరం వితారా ఎస్‌యూవీ సాంకేతికంగా రెండు కొత్త టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌లతో పరిచయం అవుతోంది.

సుజుకి వితారా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలోని 1.0-లీటర్ పెట్రోల్ యూనిట్ 109బిహెచ్‌పి పవర్ మరియు 1.4-లీటర్ బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజన్ 138బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ పరంగా రెండు ఇంజన్‌లు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యమవుతాయి.

ఈ రెండు ఇంజన్‌లు కూడా గతంలో ఉన్న 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానాన్ని భర్తీ చేయనున్నాయి. అయితే, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో వస్తోన్న సుజుకి వితారా సిరీస్ II మోడల్‌లో డీజల్ ఇంజన్ రావడం లేదు. అత్యుత్తమ డ్రైవింగ్ అనుభం కోసం ఆల్ గ్రిప్ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ఇందులో వస్తోంది.

సుజుకి వితారా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఎక్ట్సీరియర్ విషయానికి వస్తే, ఇందులో అత్యాధునిక క్రోమ్ సొబగులు, పెద్ద పరిమాణంలో ఉన్న ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కండలు తిరిగిన ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. అధునాతన అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ అండ్ బ్లాక్ క్లాడింగ్, రియర్ డిజైన్‌లో పదునైన ఎల్ఈడీ లైట్లు గల టెయిల్ గేట్ కలదు.

ఎక్ట్సీరియర్ మాత్రమే కాదు, ఇంటీరియర్‌లో కూడా చెప్పుకోదగిన మార్పులు మరియు నూతన ఫీచర్లు పరిచయం అయ్యాయి. ప్రీమియం మరియు స్పోర్ట్ ఫీల్ కల్పించే, సరికొత్త డ్యాష్‌బోర్డ్, అప్‌డేటెడ్ సీటింగ్ సిస్టమ్, రీడిజైన్ చేయబడిన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, బ్లాక్-థీమ్‌లో ఉన్న స్పోర్టివ్ అప్‌హోల్‌స్ట్రే ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్లు ఇంకా వెల్లడి కాలేదు.

సుజుకి వితారా ఎస్‌యూవీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఖండాలలో మొత్తం 191 దేశాలలో అమ్ముడవుతోంది. అంతర్జాతీయంగా సుజుకి వితారా ఎస్‌యూవీ 37 లక్షల యూనిట్ల సేల్స్ మైలురాయి చేరుకుంది.

మారుతి సుజుకి ఒకవేళ వితారా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్‌కు ఖరారు చేస్తే, విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు జీప్ కంపాస్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

మారుతి సుజుకి తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ వితారా ఎస్‌యూవీని ఇప్పటికే పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షిస్తూ పట్టుబడింది. కానీ, భారత్‌లో దీని విడుదల గురించి కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ప్రస్తుతం ఉన్న మార్కెట్ ట్రెండ్ ప్రకారం దాదాపుగా విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








