టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విడుదల వివరాలు

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో సరికొత్త 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును ఆవిష్కరించింది.

By Anil Kumar

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో సరికొత్త 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును ఆవిష్కరించింది. దీనితో పాటు వేదిక మీద ఆవిష్కరించిన హెచ్5ఎక్స్ ఎస్‌యూవీకి హ్యారియర్ అనే పేరును ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విడుదల గురించిన వివరాలు లీక్ అయ్యాయి.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్

ఖరీదైన డిజైన్ శైలిలో విలాసవంతమైన ఇంటీరియర్ ఫీచర్లు మరియు ప్రీమియం ఫీల్ కలిగించే హ్యాచ్‌బ్యాక్ కార్లను ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు అంటారు. ఉదాహరణకు, మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు, బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్

ఇండియన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల జాబితాలో మారుతి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ కార్లు ఉన్నాయి. ఇప్పుడు వీటికి గట్టి పోటీనిచ్చేలా టాటా మోటార్స్ 45ఎక్స్ కోడ్ పేరుతో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును సిద్దం చేసింది.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్

టాటా నూతన డిజైన్ ఫిలాసఫీ ఇంపాక్ట్ డిజైన్ 2.0 ఫిలసఫీ ఆధారంగా అభివృద్ది చేసిన టాటా 45ఎక్స్ కారును వచ్చే ఏడాది పండుగ సీజన్ నాటికల్లా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. 2019 మొదటి త్రైమాసికంలో టాటా హ్యారియర్ విడుదల అనంతరం 45ఎక్స్ విడుదల ఉంటుంది.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్

అడ్వాన్స్‌డ్ మోడ్యూలర్ ఫ్లాట్‌ఫామ్ మీద టాటా 45ఎక్స్ మోడల్‌ను అభివృద్ది చేస్తున్నారు. సాంకేతికంగా ఇందులో నెక్సాన్ ఎస్‌యూవీ నుండి సేకరించిన పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను అందివ్వనున్నారు.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో రానున్న 1.2-లీటర్ టర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా, 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్

టాటా 45ఎక్స్ ఒక్కసారి విడుదలైతే, మార్కెట్లో అత్యంత శక్తివంతమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలవనుంది. పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించనున్నాయి.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్

టాటా హెచ్5ఎక్స్ తరహాలో 45ఎక్స్ కూడా ప్రొడక్షన్ వెర్షన్ పేరును పొందనుంది. టాటా మోటార్స్ ఇటీవల తమ హెచ్5ఎక్స్ కాన్సెప్ట్ ఎస్‌యూవీకి హ్యారియర్ అనే పేరును అధికారికంగా ఖరారు చేసింది.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇంటీరియర్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం మెటీరియల్‌తో రూపొందించిన అప్‌హోల్‌స్ట్రే మరియు సీట్లతో పాటు మరెన్నో విలాసవంతమైన ఫీచర్లు రానున్నాయి.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా 45ఎక్స్ మోడల్ టాటా మోటార్స్‌‌కు ఇండియన్ మార్కెట్లో అత్యంత కీలకమైన ఉత్పత్తి. విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్న టాటా 45ఎక్స్ ఇండియన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఓ సంచలనాత్మక ఉత్పత్తిగా నిలవనుంది. టాటా 45ఎక్స్ మారుతి బాలెనో మరియు హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మోడళ్లకు సరాసరి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Tata 45X Premium Hatchback Launch Details Revealed
Story first published: Thursday, July 12, 2018, 16:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X