టాటా ఏస్ గోల్డ్ ఎడిషన్ విడుదల: ప్రారంభ ధర రూ. 3.75 లక్షలు

Written By:

విపణిలోకి టాటా ఏస్ గోల్డ్ ఎడిషన్ విడుదలయ్యింది. టాటా మోటార్స్ మార్కెట్లోకి సరికొత్త ఏస్ గోల్డ్ తేలికపాటి కమర్షియల్ వెహికల్‌ను రూ. 3.75 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. ఏస్ గోల్డ్ విడుదలతో టాటా మోటార్స్ తమ ఏస్ లైనప్‌లోకి మరో ప్రీమియమ్ వేరియంట్‌ వచ్చి చేరింది.

టాటా ఏస్ గోల్డ్

ఇవాళ్టి నుండి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టాటా మోటార్స్ వాణిజ్య విక్రయకేంద్రాలలో లభిస్తుంది. టాటా ఏస్ గోల్డ్ కమర్షియల్ వెహికల్ ఆర్కిటిక్ వైట్ కలర్‌లో లభిస్తుంది. అత్యుత్తమ పనితీరు, కఠినత్వం మరియు మెరుగైన సేఫ్టీ మరియు సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి.

టాటా ఏస్ గోల్డ్

టాటా ఏస్ గోల్డ్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ డిజైన్ చూడటానికి అచ్చం ఏస్ స్టాండర్డ్ వెర్షన్‌నే పోలి ఉంటుంది. టాటా ఏస్ గోల్డ్ క్యాబిన్‌లో సౌకర్యవంతమైన ప్రయాణానాన్ని మెరుగుపరిచింది. సాంకేతికంగా ఇందులో 702సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కలదు.

టాటా ఏస్ గోల్డ్

టాటా మోటార్స్ టాటా ఏస్ కమర్షియల్ ట్రక్కును తొలిసారిగా 2005లో విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన అనతి కాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందింది. చిన్న స్థాయి వ్యాపారులకు మరియు రవాణా నిర్వహణ సంస్థల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక డిజైన్ మరియు ఆధునిక శైలిలో టాటా డిజైన్ బృందం మిని ట్రక్కును అభివృద్ది చేసింది.

టాటా ఏస్ గోల్డ్

టాటా మోటార్స్ ఏస్ మిని ట్రక్కు ఫ్లాట్‌‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేసిన సుమారుగా 15 మోడళ్లను విక్రయిస్తోంది. విభిన్న డిజైన్ మరియు పలు రకాల ఇంజన్‌లతో రూపొందించిన ఏస్, జిప్, మెగా మరియు మినీ వంటి కార్గో వాహనాలతో పాటు మ్యాజిక్, మ్యాంట్రా మరియు ఐరిస్ వంటి ప్యాసింజర్ వాహనాలను రూరల్ మరియు అర్బన్ ఏరియాలలో విక్రయిస్తోంది.

టాటా ఏస్ గోల్డ్

టాటా ఏస్ గోల్డ్ టాటా అలర్ట్, 24x7 బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్ ప్రోగ్రాం, టాటా డిలైట్ వంటి పలు ఉచిత సర్వీసులను అందిస్తోంది. టైమ్ బౌండ్ రిపేర్ కమిట్‌మెంట్ కోసం టాటా జిప్పీ మరియు టైమ్ బౌండ్ యాక్సిడెంట్ రిపేర్ ప్రామిస్ కోసం టాటా కవచ్ వంటి సేవలు అందిస్తోంది.

టాటా ఏస్ గోల్డ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా ఏస్ మినీ ట్రక్కు దేశీయ లైట్ వెయిట్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో మోస్ట్ పాపులర్ వెహికల్. ధరకు తగ్గ విలువలు, అతి తక్కువ నిర్వహణ ఖర్చు టాటా ఏస్ ప్రత్యేకత చిన్న చిన్న వ్యాపార సంస్థలకు, మరియు వ్యక్తిగతంగా అద్దెకు వాడుకోవడానికి టాటా ఏస్ అత్యుత్తమ ఎంపిక. ఏస్ బ్రాండ్‍‌ ద్వారా మార్కెట్లో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఇప్పుడు ఏస్ గోల్డ్ మోడల్‌ను లాంచ్ చేసింది.

టాటా ఏస్ గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకోండి...

English summary
Read In Telugu: Tata Ace Gold Launched In India; Priced At Rs 3.75 Lakh
Story first published: Friday, April 13, 2018, 9:30 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark