సియాజ్, సిటీ కార్లకు పోటీగా కాన్సెప్ట్ సెడాన్ టీజర్ రివీల్ చేసిన టాటా

అతి త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచపు అతి పెద్ద ఆటోమోటివ్ ఈవెంట్ జెనీవా మోటార్ షోలో టాటా మోటార్స్ సరికొత్త మిడ్ సైజ్ సెడాన్ కారును ఆవిష్కరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

By Anil

Recommended Video

2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark

అతి త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచపు అతి పెద్ద ఆటోమోటివ్ ఈవెంట్ జెనీవా మోటార్ షోలో టాటా మోటార్స్ సరికొత్త మిడ్ సైజ్ సెడాన్ కారును ఆవిష్కరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఆటోమోటివ్ ఔత్సాహికులను ఆశ్చర్యపరిచేలా డైనమిక్ డిజైన్ అంశాలతో రూపొందించిన కాన్సెప్ట్ సెడాన్ కారును టాటా రివీల్ చేయనుంది.

టాటా కాన్సెప్ట్ సెడాన్

తాజాగా, టాటా మోటార్స్ తమ కాన్సెప్ట్ మిడ్ సైజ్ సెడాన్ టీజర్ ఫోటోను రివీల్ చేసింది. ఇండియన్ మార్కెట్లో ఉన్న హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సియాజ్ కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

టాటా కాన్సెప్ట్ సెడాన్

టాటా మోటార్స్ తమ అత్యాధునిక అడ్వాన్స్‌డ్ మోడ్యూలర్ ఫ్లాట్‌ఫామ్(AMP) ఆధారంగా సెడాన్ కారును అభివృద్ది చేసింది. ఇదే ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించిన 45ఎక్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించింది.

టాటా కాన్సెప్ట్ సెడాన్

టాటా తమ అధునాతన డిజైన్ ఫిలాసఫీతో నూతన కాన్సెప్ట్ కార్లను సంచలనాత్మక డిజైన్ అంశాలతో అభివృద్ది చేస్తోంది. టాటా తాజాగా ఆవిష్కరిస్తున్న మోడళ్లను పరిశీలిస్తే ఉత్సాహపూరితమైన, అత్యాధునిక మరియు డైనమిక్ డిజైన్ అంశాలను గమనించవచ్చు.

టాటా కాన్సెప్ట్ సెడాన్

ఆటోమొబైల్ ప్రియులను టాటా తన వైపుకు ఆకర్షించుకునే లక్ష్యంతో మునుపటి ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ 1.0 ఆధారంగా వచ్చిన నెక్సాన్, హెక్సా, టియాగో మరియు టిగోర్ కార్లతో పాటు సరికొత్త ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ 2.0 ఆధారంగా వచ్చిన హెచ్5ఎక్స్ ప్రీమియమ్ ఎస్‌యూ మరియు 45ఎక్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇందుకు చక్కటి ఉదాహరణ.

టాటా కాన్సెప్ట్ సెడాన్

టాటా మోటార్స్ తమ కాన్సెప్ట్ మిడ్ సైజ్ సెడాన్ కారును తమ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ 2.0 ఆధారంగా డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేకించి, ఆకర్షణీయమైన ఫ్రంట్ మరియు రియర్ డిజైన్, పెద్ద పరిమాణంలో ఉన్న వీల్స్ మరియు వీల్ ఆర్చెస్, అత్యాధునిక హెడ్‌ల్యాంప్ క్లస్టర్ మరియు టాటా వారి హ్యుమానిటీ క్యారక్టర్ లైన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

టాటా కాన్సెప్ట్ సెడాన్

టాటా ప్రస్తుతం ఆవిష్కరించిన హెచ్5ఎక్స్ మరియు 45ఎక్స్ కార్లును గమనిస్తే, కాన్సెప్ట్ సెడాన్ కారును కూడా వీటిలాగే విశాలమైన మరియు సౌకర్యవంతమైన ఇంటీరియర్ స్పేస్ అందివ్వనుంది. టాటా ఇంజన్ ఫ్యామిలీలో ఉన్న రివట్రాన్ మరియు రివోటార్క్ ఇంజన్‌లే కాన్సెప్ట్ సెడాన్‌కు పవర్ అందివ్వనున్నాయి.

టాటా కాన్సెప్ట్ సెడాన్

పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను తప్పనిసరిగా అందించి, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఆప్షనల్‌గా అందించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, భారత్‌లో దీని విడుదల గురించి ఎలాంటి సమాచారం లేదు, అయితే మార్కెట్లో అవకాశాలు ఉన్న నేపథ్యంలో కాన్సెప్ట్ సెడాన్ విడుదల తప్పనిసరి అని చెప్పవచ్చు.

టాటా కాన్సెప్ట్ సెడాన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జెనీవా మోటార్ షో ద్వారా అంతర్జాతీయ ఆటోమొబైల్ ప్రియులను ఆకట్టుకోవడమనేది టాటా మోటార్స్‌కు పెద్ద సవాలుతో కూడుకుంది. గతంలో టామో రేస్‌మో సూపర్ కారును జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో టాటా మోటార్స్ భాగమై 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా టాటా కాన్సెప్ట్ సెడాన్ కారును అంతర్జాతీయ ఆవిష్కరణకు సిద్దం చేసింది.

Most Read Articles

English summary
Read In Telugu: All-New Tata Concept Sedan To Be Unveiled At Geneva International Motor Show
Story first published: Saturday, February 24, 2018, 18:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X