సరికొత్త ఎక్ట్సీరియర్‌తో మళ్లీ పట్టుబడిన టాటా హెచ్5ఎక్స్

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ విడుదలకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఆటో ఎక్స్ పోలో హెచ్5ఎక్స్ ఎస్‌యూవీని

By Anil Kumar

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ విడుదలకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఆటో ఎక్స్ పోలో హెచ్5ఎక్స్ ఎస్‌యూవీని కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించిన టాటా ఇప్పుడు ప్రొడక్షన్ వెర్షన్ ఎస్‌యూవీని ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది.

టాటా హెచ్5ఎక్స్

తాజాగా, పరీక్షించబడిన టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీలో నూతన ఎక్ట్సీరియర్ డిజైన్ అంశాలు మరియు ఇంటీరియర్ గుర్తించడం జరిగింది. అయితే, దీని ఎక్ట్సీరియర్‌లో ఎలాంటి డిజైన్‌ అంశాలు గుర్తించడానికి వీల్లేకుండా బ్లాక్ అండ్ వైట్ ఫినిషింగ్ గల పేపరుతో కప్పేశారు.

టాటా హెచ్5ఎక్స్

గతంలో పరీక్షించిన మోడల్‌లో తాత్కాలిక హెడ్‌లైట్లు మరియు టెయిల్ లైట్లు ఉండేవి, కానీ ప్రస్తుతం టెస్టింగ్ చేస్తున్న హెచ్5ఎక్స్ ఎస్‌యూవీలో అధునాతన హెడ్‌ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్ క్లస్టర్ ఉన్నాయి.

టాటా హెచ్5ఎక్స్

టాటా హెచ్5ఎక్స్ రియర్ డిజైన్ విషయానికి వస్తే, ఆటో ఎక్స్ పోలో రివీల్ చేసిన కాన్సెప్ట్ వెర్షన్ ఎస్‌యూవీనే పోలి ఉంది. బాడీ క్లాడింగ్, ప్రొడక్షన్ వెర్షన్ డోర్ హ్యాండిల్స్ మరియు రియర్ విండ్ షీల్డ్ వైపర్ వంటి సరికొత్త డిజైన్ ఎలిమెంట్లు వచ్చాయి. మొత్తానికి ప్రొడక్షన్ వెర్షన్ మోడల్‌ను తలపించింది.

టాటా హెచ్5ఎక్స్

అంతే కాకుండా, టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీలో బ్లాక్ కలర్ ఫినిషింగ్ గల 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి, ఇవి కూడా ప్రొడక్షన్ వెర్షన్ అల్లాయ్ వీల్స్ తరహాలోనే ఉన్నాయి. ఈ అల్లాయ్ వీల్స్ డిజైన్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీలో కూడా గుర్తించవచ్చు.

టాటా హెచ్5ఎక్స్

టాటా మోటార్స్ ఈ హెచ్5ఎక్స్ మోడల్‌ను ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ప్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. అయితే, దీనిని ఇండియన్ రోడ్లకు అనుగుణంగా తీర్చిదిద్ది, తక్కువ ధరలోనే అందివ్వనుంది. టాటా హెచ్5ఎక్స్ తొలుత 5-సీటింగ్ లేఔట్లో, కాస్త ఆలస్యంగా 7-సీటింగ్ ఆప్షన్‌లో విడుదల కానుంది.

టాటా హెచ్5ఎక్స్

టాటా మోటార్స్ సాంకేతికంగా తమ హెచ్5ఎక్స్ ఎస్‌యూవీలో ఫియట్ నుండి సేకరించిన 2-లీటర్ డీజల్ ఇంజన్‌ను అందిస్తోంది. 140 నుండి 170బిహెచ్‌పి మధ్య పవర్ ప్రొడ్యూస్ చేసే దీనికి జడ్ఎఫ్ కంపెనీ నుండి సేకరించిన 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

టాటా హెచ్5ఎక్స్

జీప్ కంపాస్ ఎస్‌యూవీలో కూడా ఇదే ఇంజన్ కలదు. తరువాత దశలో పెట్రోల్ ఇంజన్ కూడా పరిచయం చేసే అవకాశం ఉంది.

టాటా హెచ్5ఎక్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా హెచ్5ఎక్స్ టాటా మోటార్స్ విక్రయిస్తున్న అన్ని కార్లలోకెల్లా అత్యంత ఖరీదైన మోడల్‌గా నిలవనుంది. టాటా మోటార్స్ తమ ఇంపాక్ట్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీని డిజైన్ చేసింది, దీనితో పాటు ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద 45ఎక్స్ అనే ప్రీమియం హ్యాచ్‌‌బ్యాక్ కారును కూడా డెవలప్ చేసింది.

Source: CarDekho

More from DriveSpark

Article Published On: Monday, June 25, 2018, 10:19 [IST]
English summary
Read In Telugu: Tata H5X Spotted Testing Again — New Exterior Details Revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+