టాటా H5X ఎస్‌యూవీ మరియు 45X ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విడుదల వివరాలు లీక్

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ మరియు 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లను కాన్సెప్ట్ దశలో ఆవిష్కరించింది. తాజాగా అందిన రిపోర్ట్స్ మే

By Anil Kumar

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ మరియు 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లను కాన్సెప్ట్ దశలో ఆవిష్కరించింది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, ఈ రెండు మోడళ్ల విడుదల వివరాలు లీక్ అయ్యాయి.

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ

టాటా ఇప్పటికే హెచ్5ఎక్స్ ఎస్‌యూవీని ఇండియన్ రోడ్ల మీద అత్యంత రహస్యంగా పరీక్షించింది. అతి త్వరలో ఈ రెండు ఉత్పత్తుల విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. వీటిలో హెచ్5ఎక్స్ ఎస్‌యూవీని 2019 తొలి త్రైమాసికంలో మరియు 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను 2019 రెండవ త్రైమాసికంలో విడుదల చేయనుంది.

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ

టాటా మోటార్స్ ఈ రెండు మోడళ్లను ఇంపాక్ట్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించింది. రెండు కార్లు కూడా రెండు విభిన్న ఫ్లాట్‌ఫామ్‌ల మీద అభివవృద్ది చేస్తోంది. రెండు మోడళ్లు కూడా టాటా యొక్క ఖరీదైన మరియు విలాసవంతమైన ఉత్పత్తులుగా మార్కెట్లోకి రానున్నాయి.

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ

టాటా హెచ్5ఎక్స్ 5-సీటర్ ఎస్‌యూవీ టాటా యొక్క ప్రీమియం మోడల్‌గా నిలవనుంది. దీనిని టాటా భాగస్వామ్యపు దిగ్గజం ల్యాండ్ రోవర్ ఎల్550 ఫ్లామ్‌ఫామ్ మీద అభివృద్ది చేసింది. ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద డిస్కవరీ స్పోర్ట్ మోడల్‌ను కూడా డెవలప్ చేయడం జరిగింది. అయితే తక్కువ ధరలో ఇండియన్ రోడ్లకు అనుగుణంగా టాటా మోటార్స్ ఈ మోడళ్లను తీర్చిదిద్దనుంది.

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీలో సాంకేతికంగా ఫియట్ నుండి సేకరించిన 2-లీటర్ కెపాసిటి గల టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్టాండర్డ్ ఫ్రంట్ వీల్ డ్రైవ్‌తో పాటు ఆప్షనల్ 4-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా అవకాశం ఉంది.

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ

అదే విధంగా టాటా సిద్దం చేస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా 45ఎక్స్ విషయానికి వస్తే, ఇది విపణిలో ఉన్న మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది. ఈ సెగ్మెంట్లోకి తొలిసారిగా ప్రవేశిస్తున్న టాటా దీనిని టాటా వారి అడ్వాన్స్‌డ్ మోడ్యూలర్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేస్తోంది.

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ

సాంకేతికంగా టాటా 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్ కారులో టాటా లైనప్‌లో ఇది వరకే ఉన్న అవే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.05-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లు రానున్నాయి. 45ఎక్స్ కారులో తొలుత మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందించింది. తరువాత కాస్త ఆలస్యంగా డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పరిచయం చేసే అవకాశం ఉంది.

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

విపణిలో ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మరియు ఖరీదైన ప్రీమియం ఎస్‌యూవీల సెగ్మెంట్లోకి రెండు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి టాటా మోటార్స్ దాదాపు సిద్దమైంది. సరిగ్గా రెండేళ్ల క్రితం టాటా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా వచ్చిన మోడళ్లు భారీ విజయాన్ని సాధించిపెట్టాయి. దీంతో, ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీకి కొనసాగింపుగా ఇంపాక్ట్ 2.0 వెర్షన్ ద్వారా మరో రెండు మోడళ్లను టాటా సిద్దం చేసింది.

టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ

ప్రపంచ స్థాయి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలకు ధీటుగా అద్భుతమైన ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ డిజైన్ వీటి సొంతం. ఈ రెండు మోడళ్లు పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, టాటా దశ తిరిగినట్లేనని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: Tata H5X SUV And 45X Premium Hatchback Launch Details Revealed
Story first published: Friday, April 27, 2018, 17:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X